Student Suicide: అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనగా మారింది. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పైన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, అసలు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడానికి గల కారణాలను అందరూ అన్వేషిస్తున్నారు. అది కూడా కాలేజీ భవనం పై నుండి విద్యార్థి దూకడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న చరణ్ కాలేజీ భవనం పై నుండి దూకి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతి గదిలో టీచర్ ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా తన సీట్లు లేచి నిలబడ్డ చరణ్, పక్కనే గల ప్రహరీ గోడ వద్దకు వెళ్లి కిందికి దూకాడు. దీనితో చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే చరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన తోటి విద్యార్థులు హుటాహుటిన కిందికి వెళ్లి చూడగా, తీవ్ర రక్తస్రావంలో చరణ్ చనిపోయి ఉండడాన్ని గమనించారు. కళాశాల యాజమాన్యం జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
Also Read: Train Journey: రైలులో కునుకు తీస్తున్నారా.. ఇలా చేయండి.. అలా చేయకండి!
చరణ్ తండ్రి తెలిపిన వివరాల మేరకు.. కాలేజీ ఫీజు కోసం వేధింపులు అధికంగా ఉండేవని, అయితే తాను తన కుమారుడి వెంట ఫీజు చెల్లించేందుకు తగిన నగదును కూడ పంపించానన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం తనకు తెలిపినట్లు ఆయన తెలిపారు. కాగా చరణ్ మృతిపై పలు అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులోనే అసలు కారణం బయటకు వెల్లడి కావాల్సి ఉంది. ఏది ఏమైనా తమ కుమారుడు కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో చరణ్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్.. కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. #Charan #Anantapur #NarayanaJuniorCollege #suicide #APNews #AndhraPradesh… pic.twitter.com/you3mcKZxy
— Swetcha Daily (@swetchadaily) January 23, 2025