Librarian Jobs: పీహెచ్‌డీ, లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో లేదా కనీసం 55 శాతం మార్కులో అదే విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్(IITGN) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హత ఉన్న అభ్యర్థుల ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్(IITGN) లో డైరెక్ట్ లేదా డిప్యూటేషన్ విధానంలో లైబ్రేరియన్, సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హత ఉన్న అభ్యర్థుల ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 2
ఇందులో లైబ్రేరియన్, సూపరింటెండింట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: లైబ్రేరియన్ పోస్టుకు పీహెచ్‌డీ, లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో లేదా కనీసం 55 శాతం మార్కులో అదే విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఉండాలి. డిప్యూటీ లైబ్రేరియన్‌గా 10 ఏళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
సూపరింటెండింగ్ ఉద్యోగానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఏడేళ్లతో సహా 12 ఏళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్‌తో బీఈ/బీటెక్ డిగ్రీ ఉండాలి.
వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 57 ఏళ్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు 50 ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు.
జీతం: లైబ్రేరియన్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి రూ.1,44,200- రూ.2,18,200 వేతనం ఉంటుంది.
సూపరెంటిండెంగ్ ఇంజినీర్‌కు రూ.1,23,100- రూ.2,15,900 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 30
అఫీషియల్ వెబ్ సైట్: https://iitgn.ac.in/careers
Also Read: Ekalavya Adarsha Gurukul: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరోతరగతి ప్రవేశాలు..
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి సెలెక్ట్ అయితే భారీ వేతనం ఉంటుంది. దరఖాస్తుకు ఇంకా వారం రోజుల గడువే ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.