భారతీయ రైల్వేసంస్థకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. రోజుకు సుమారు 20 వేల రైళ్లు ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చుతుంటాయి. సుమారు రెండున్నర కోట్ల మంది రోజూ రైలు ప్రయాణం చేస్తుంటారు. టన్నుల కొద్దీ సరుకు రవాణా జరుగుతుంది. అయితే, ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. శీతాకాలంలో పొగమంచు, వర్షాకాలంలో వానలతో పాటు ప్రమాదాల కారణంగా రైళ్లు ఆలస్యం అవుతాయి. కొన్నిసార్లు రద్దు అవుతాయి. ఇవి కాకుండా మరికొన్ని కారణాలతో రైళ్లు ఆలస్యం అవుతుంటాయి.
ట్రైన్స్ ఆలస్యంగా నడవడానికి కారణాలు ఏంటి?
చాలా మంది రైళ్లు ఆలస్యంగా నడవడానికి లోకో పైలెట్లు నెమ్మదిగా నడపడం, లేదంటే.. స్టేషన్ మాస్టర్ లేటుగా సిగ్నల్ ఇవ్వడం కారణం అనుకుంటారు. అయితే, రైళ్లు నెమ్మదిగా నడవడానికి చాలా పారా మీటర్స్ ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ బ్లాక్ వర్క్: మేజర్ గా ఏదైనా ట్రాక్ పనులు జరిగినప్పుడు కొన్ని ట్రైన్స్ ను ఆపేసి వర్క్ చేస్తుంటారు. ఒకవేళ ఎమర్జెన్సీ రైళ్లు ఉంటే, అవి వెళ్లిపోయిన తర్వాత ఈ పనులు మొదలు పెడతారు. అది, మిషన్ వర్క్ అయినా, మాన్యువల్ వర్క్ అయినా కొన్ని రైళ్లను మాత్రం ఆపేస్తుంటారు. వర్క్ ఫినిష్ అయిన తర్వాత మళ్లీ ఆ రైళ్లను రిలీజ్ చేస్తుంటారు. ఈ కారణంగా రైళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
⦿ కాషన్ ఆర్డర్: ట్రాక్ లో లొకేన్ బాగా లేనప్పుడు కాషన్ ఆర్డర్ ఇస్తారు. స్టేషన్ మాస్టర్ లోకో పైలెట్ కు ఈ ఆర్డర్ అందిస్తాడు. ట్రైన్ ఎక్కడానికి ముందే లోకో పైలెట్ స్టేషన్ మాస్టర్ నుంచి కాషన్ ఆర్డర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రైలు ప్రయాణించే రూట్ లో ఎక్కడెక్కడ స్లోగా వెళ్లాలి?ఎంత స్పీడ్ లో వెళ్లాలి? అనేది రాసి ఉంటుంది. ఆ ఆర్డర్ కాపీలో ఎంత స్పీడ్ తో వెళ్లాలని ఉంటే, అంతే స్పీడ్ ను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ చోట్ల స్లోగా వెళ్లడం వల్ల రైళ్లు ఆలస్యం అవుతుంటాయి.
Read Also: 8 నెలల డ్యూటీకి 12 నెలల సాలరీ.. రైల్వేలో ఉద్యోగంతో ఇన్ని లాభాలున్నాయా?
⦿ స్టేషన్ మాస్టర్ సిగ్నల్ లేట్ గా ఇవ్వడం: కొన్నిసార్లు స్టేషన్ మాస్టర్ సిగ్నల్ లేటుగా ఇవ్వడం వల్ల కూడా రైళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ముందు ఒక రైలు వచ్చి, అది క్లియర్ కాకుండానే, మరో రైలు వచ్చిన సందర్భంలో సిగ్నల్ దగ్గరే ఆ రైలును నిలిపివేస్తారు. ముందు ఉన్న రైలు వెళ్లిన తర్వాతే మరో రైలుకు సిగ్నల్ ఇవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు రైలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
Read Also: ఇకపై చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు.. ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్!