E-Paper
Advertisement

అమెరికా ప్రయాణం ఇక మరింత ఫాస్ట్.. భారత్ నుంచి మళ్లీ డైరెక్ట్ ఫ్లైట్స్!

అమెరికా ప్రయాణం ఇక మరింత ఫాస్ట్.. భారత్ నుంచి మళ్లీ డైరెక్ట్ ఫ్లైట్స్!
Advertisement

Air India US Flights Update: అమెరికా వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. భారత్ నుంచి అమెరికాకు నడిపే నాన్‌స్టాప్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై నుంచి న్యూయార్క్‌ లోని జేఎఫ్‌కే, నెవార్క్ విమానాశ్రయాలకు ఈ సర్వీసులను పునరుద్ధరించింది. దీంతో ప్రయాణికులు మధ్యలో మరో దేశంలో ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా అమెరికా చేరుకోవచ్చు. అంతేకాదు, గతంలో కంటే ప్రయాణ సమయం కూడా దాదాపు నాలుగు గంటలు తగ్గనుంది.

ఇరాక్ గగనతలం తెరుచుకోవడంతో మారిన పరిస్థితులు

గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఘర్షణ, పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా ఎయిర్ ఇండియా తన విమాన మార్గాలను మార్చుకోవాల్సి వచ్చింది. భద్రతా కారణాలతో ఇరాక్, సిరియా, జోర్డాన్ ప్రాంతాల్లోని గగనతల పరిస్థితులను కూడా విమానయాన సంస్థలు నిశితంగా పరిశీలించాయి. దీంతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని విమానాలకు రోమ్‌లో అదనపు స్టాప్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణ సమయం మరింత  పెరిగింది. తాజాగా ఇరాక్ గగనతలం తిరిగి అందుబాటులోకి రావడంతో పరిస్థితులు మారాయి. భద్రతాపరమైన అంశాలను సమీక్షించిన ఎయిర్ ఇండియా, తన విమానాలను తక్కువ దూరం ఉన్న మార్గంలో నడిపేందుకు నిర్ణయించింది.

నాలుగు గంటల ప్రయాణ సమయం ఆదా

Advertisement

గతంలో రోమ్‌లో ఆగి వెళ్లాల్సి రావడంతో భారత్ నుంచి న్యూయార్క్ చేరుకోవడానికి సుమారు 20 గంటల సమయం పట్టేది. ఇప్పుడు రోమ్ స్టాప్‌ను తొలగించడంతో ప్రయాణ సమయం తగ్గింది. తాజా రూట్ లో ఢిల్లీ, ముంబై నుంచి న్యూయార్క్‌ కు చేరుకోవడానికి సుమారు 15 నుంచి 16 గంటలు పడుతుంది. అంటే, ప్రయాణికులకు దాదాపు నాలుగు గంటల సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా బిజినెస్ అవసరాలు, ఉద్యోగాలు, విద్య, పర్యాటకం కోసం అమెరికా వెళ్లేవారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఏ నగరాల మధ్య విమానాలు అందుబాటులో ఉంటాయి?

ఎయిర్ ఇండియా పునరుద్ధరించిన నాన్‌స్టాప్ సర్వీసులు ఢిల్లీ నుంచి న్యూయార్క్ జేఎఫ్‌కే ఎయిర్ పోర్టు, నెవార్క్ విమానాశ్రయం, ముంబై నుంచి న్యూయార్క్ జేఎఫ్‌కే ఎయిర్ పోర్టు, నెవార్క్ విమానాశ్రయానికి అందుబాటులో ఉంటాయి.

విమాన మార్గాలపై నిరంతర నిఘా

Advertisement

పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. ఇరాన్ గగనతలం ప్రస్తుతం అందుబాటులో లేకపోయినప్పటికీ, ఇరాక్ గగనతలాన్ని ఉపయోగించడం ద్వారా ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ సర్వీసులను పునరుద్ధరించగలిగింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, గగనతల భద్రత పరిస్థితులను తమ ఆపరేషన్స్ బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని సంస్థ వెల్లడించింది. అవసరాన్ని బట్టి విమాన మార్గాల్లో మార్పులు చేస్తోంది.

Read Also: విమానం అవసరం లేదు.. గంటలోనే అబుదాబికి చేరుకోవచ్చు!

Tags

Related News

విమానం అవసరం లేదు.. గంటలోనే అబుదాబికి చేరుకోవచ్చు!

60 రోజులు కాదు.. ఇక 365 రోజుల ముందే.. ఎన్నారైలకు రైల్వే బంపర్ ఆఫర్!

గాల్లోనే దీపావళి సంబరాలు.. పైలట్ చేసిన పనికి ప్రయాణికులు ఫిదా!

భారతలో మినీ స్విట్జర్లాండ్.. ఈ హిల్ స్టేషన్‌కు వెళ్తే తిరిగి రావాలనిపించదు

ఒకప్పుడు ఎయిర్‌పోర్టులు.. ఇప్పుడు విమానాల వంతు, బెంబేలెత్తుతున్న ప్రయాణికులు

దేశంలో వింత స్టేషన్.. రైలు ఎక్కాలంటే టికెట్ ఒక్కటే సరిపోదు.. వీసా, పాస్‌పోర్ట్ కూడా ఉండాల్సిందే!

రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ యాప్‌లతో జాగ్రత్త.. IRCTC హెచ్చరిక!

Big Stories

Advertisement
×