E-Paper
Advertisement

విమానం అవసరం లేదు.. గంటలోనే అబుదాబికి చేరుకోవచ్చు!

విమానం అవసరం లేదు.. గంటలోనే అబుదాబికి చేరుకోవచ్చు!
Advertisement

Dubai to Abu Dhabi Train: దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్లాలంటే సాధారణంగా రోడ్డు మార్గంలో ఎక్కువ టైమ్ పడుతుంది. అయితే, కొత్త ఎతిహాద్ రైలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రయాణం మరింత ఈజీ కానుంది. గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో దుబాయ్ నుంచి అబుదాబికి సుమారు గంటలోనే చేరుకోవచ్చు. తాజాగా ఓ ఇండియన్ ట్రావెలర్ ఈ రైలులో ప్రయాణించి, తన ఎక్స్ పీరియెన్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రైలులోని సౌకర్యాలు, ఫుడ్, టికెట్ ధరతో పాటు లోపలి విజువల్స్ ను కూడా వీడియోలో చూపించారు.

విమానాన్ని తలదన్నే సౌకర్యాలు..  

ఎతిహాద్ రైలులో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సౌకర్యవంతమైన సీట్లు, ఆర్మ్‌ రెస్టులు, ముందు భాగంలో ట్రే టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తమ బ్యాగులను పెట్టుకునేందుకు ప్రత్యేక లగేజ్ ఏరియాతో పాటు చిన్న బ్యాగుల కోసం సీట్ల పైన స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ముఖ్యంగా రైలులోని బాత్రూమ్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా విమానాల్లో ఉండే వాష్‌రూమ్‌ల కంటే ఇవి మరింత విశాలంగా ఉన్నాయి. లేటెస్ట్ ఎక్యుప్ మెంట్స్, పరిశుభ్రమైన వాతావరణంతో వీటిని రూపొందించారు.

రైలులోనే ఫుడ్.. ప్రయాణికులకు స్పెషల్ సర్వీసులు

Advertisement

ప్రయాణ సమయంలో ఫుడ్ కూడా అందుబాటులో ఉంది. శాకాహారుల కోసం పొటాటో సలాడ్, చిన్న ఆరెంజ్ జ్యూస్ ప్యాక్, వేడి టీ కూడా అందిస్తున్నట్లు సదరు ట్రావెలర్ వెల్లడించాడు. రైలులోని ఇంటీరియర్ డిజైన్, సీటింగ్ సౌకర్యాలు, ఫుడ్ సర్వీసులు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయని చెప్పుకొచ్చాడు.

మెట్రో, ఫ్రీ షటిల్ సౌకర్యం కూడా!

ఈ రైలు ప్రయాణంలో మరో ప్రత్యేకత కనెక్టివిటీ. దుబాయ్‌లోని రైల్వే స్టేషన్ నేరుగా మెట్రో స్టేషన్‌కు లింకై ఉంది. దీంతో మెట్రో ద్వారా స్టేషన్‌కు చేరుకోవడం ప్రయాణికులకు చాలా ఈజీ. అయితే, అబుదాబిలో మెట్రో కనెక్షన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి ప్రయాణికులు బస్సులలో వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టేషన్ నుంచి బస్ స్టాప్ వరకు ఉచిత ఎలక్ట్రిక్ షటిల్ వ్యాన్లను అందుబాటులో ఉంచినట్లు వివరించాడు.

టికెట్ ధర ఎంతంటే?

Advertisement

ఎతిహాద్ రైలులో ప్రయాణానికి తాను ఒకవైపు టికెట్ కోసం సుమారు రూ.1,000 నుంచి రూ.1,100 వరకు చెల్లించినట్లు   వెల్లడించారు. రైలులో లభించే సౌకర్యాలు, ప్రయాణ వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ ధర చాలా తక్కువ అని చెప్పుకొచ్చాడు.

రోజువారీ ప్రయాణికులకు ఎంతో లాభం

దుబాయ్, అబుదాబి మధ్య రోజూ రాకపోకలు సాగించే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఎతిహాద్ రైలు ఉపయోగకరంగా ఉంటుంది. వేగవంతమైన ప్రయాణంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. రోడ్డు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు రెండు నగరాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా ఈ రైలు కీలకంగా మారనుంది.

Read Also: 60 రోజులు కాదు.. ఇక 365 రోజుల ముందే.. ఎన్నారైలకు రైల్వే బంపర్ ఆఫర్!

Tags

Related News

60 రోజులు కాదు.. ఇక 365 రోజుల ముందే.. ఎన్నారైలకు రైల్వే బంపర్ ఆఫర్!

గాల్లోనే దీపావళి సంబరాలు.. పైలట్ చేసిన పనికి ప్రయాణికులు ఫిదా!

భారతలో మినీ స్విట్జర్లాండ్.. ఈ హిల్ స్టేషన్‌కు వెళ్తే తిరిగి రావాలనిపించదు

ఒకప్పుడు ఎయిర్‌పోర్టులు.. ఇప్పుడు విమానాల వంతు, బెంబేలెత్తుతున్న ప్రయాణికులు

దేశంలో వింత స్టేషన్.. రైలు ఎక్కాలంటే టికెట్ ఒక్కటే సరిపోదు.. వీసా, పాస్‌పోర్ట్ కూడా ఉండాల్సిందే!

రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ యాప్‌లతో జాగ్రత్త.. IRCTC హెచ్చరిక!

దీపావళి వేళ రైల్లో టపాసులు తీసుకెళ్తున్నారా? జరిమానే కాదు జైలు శిక్షా తప్పదు!

Big Stories

Advertisement
×