Bengali Horror Series on OTT: ఇండియన్ జానపద కథలు, పురాతన డార్క్ మేజిక్, సూపర్ నేచురల్ మిస్టరీ ఎలిమెంట్స్ తో వచ్చే వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో అన్‌లిమిటెడ్ డిమాండ్ ఉంటుంది. ఇలాంటి ఎలిమెంట్స్ తో రీసెంట్ గా ఒక బెంగాలీ సూపర్ నేచురల్ అడ్వెంచర్ హారర్ ఓటీటీలోకి వచ్చింది. ఒక అడవి, అక్కడి రహస్య ఆలయం, మనుషుల ప్రాణాలను బలితీసుకునే వింత ఆచారాల కథతో ఇది ఒంట్లో వణుకు పుట్టిస్తోంది. ఈ బెంగాలీ ఫోక్‌లోర్ హారర్ సిరీస్ పేరు ‘Kauriburir Mandir’. ‘Kauriburi: The Cursed Temple’. సయంతన్ ఘోషల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లోని సీట్ ఎడ్జ్ రహస్యాలేంటి ? ఇది ఏ ఓటీటీలో ఉంది ? తెలుగులో చూడొచ్చా ? అనే వివరాలను తెలుసుకుందాం..
ఇందులో భబతారణ్ ఛటర్జీ (జీతూ కమల్)కు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఎదుటివారి చేతిని తాకడం ద్వారా వారి గతం, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను తెలుసుకోగలడు. ఈ శక్తి అతడి జీవితంలోకి ఊహించని సమస్యను తీసుకొస్తుంది. తనకు ఒకప్పుడు ఎంతో ఇష్టమైన మాధురి (సోలంకీ రాయ్) ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలుసుకుంటాడు. ఆమెను కాపాడాలంటే ఒక అరుదైన పుష్పం కోసం వెతకాల్సి వస్తుంది. ఆ పుష్పం పేరు ‘గోలోక్ పుష్ప’. దాని కోసం భబతారణ్ ఒక భయంకరమైన అడవిలోకి అడుగుపెడతాడు.
అయితే ఆ అడవి సాధారణమైనది కాదు. అక్కడ శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక రహస్య ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో రక్తదాహంతో ఉండే దేవతను పూజించే ఒక ప్రాచీన తెగ నివసిస్తుంటుంది. అక్కడి ప్రజలు పాటించే వింత ఆచారాలు, రహస్య పూజల వెనుక ఒక భయంకరమైన ఉద్దేశం దాగి ఉంటుంది. ఆ తెగకు చెందిన బోరో డియోరి (పౌలి దామ్) ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన వ్యక్తి. ఒకవైపు 250 ఏళ్ల నాటి శాపం, మరోవైపు నరబలికి సిద్ధమవుతున్న రహస్య ముఠా… వీటి మధ్య భబతారణ్ తన ప్రేయసిని ఎలా కాపాడతాడన్నదే అసలు కథ.
ఈ ప్రయాణంలో అతడికి గోలోక్ పుష్పం వెనుక ఉన్న అసలు రహస్యం తెలుస్తుంది. అనిర్బన్ అనే వ్యక్తికి ఈ శాపాన్ని ఛేదించడంలో కీలకమైన సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అమావాస్య సమయం దగ్గరపడుతున్న కొద్దీ మాధురిని కాపాడేందుకు చేసే ప్రయత్నాలు మరింత ప్రమాదకరంగా మారతాయి. చివరకు బోరో డియోరి పన్నిన పథకాన్ని భబతారణ్ ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమ కోసం మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన అసలు భయంకరమైన నిజం ఏంటి? అనేది మిగతా ఎపిసోడ్స్‌లో ఆసక్తికరంగా సాగుతుంది. పురాతన తెగలు, రహస్య దేవతలు, నరబలి ఆచారాలు, శతాబ్దాల నాటి శాపాల నేపథ్యంలో సాగే హారర్ కథలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఒక మంచి ఆప్షన్.
ఈ సిరీస్‌లో భబతారణ్‌గా జీతూ కమల్, మాధురిగా సోలంకీ రాయ్, బోరో డియోరిగా పౌలి దామ్ నటించారు. వీరితో పాటు శాశ్వత ఛటర్జీ, బిశ్వరూప్ బిశ్వాస్, అనిరుద్ధ గుప్తా, దేవప్రియ ముఖర్జీ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. సయంతన్ ఘోషల్ దర్శకత్వం వహించగా, ఫాలో ఫోకస్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 20 నుంచి 27 నిమిషాల నిడివితో ఉంటుంది. 2026 నవంబర్ 6నుంచి Netflixలో హిందీ, తమిళం, తెలుగు ఆడియోల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ బెంగాలీ వెర్షన్‌ను Hoichoiలో చూడవచ్చు.
Read Also: చీకటి పడితే ఆ అడవిలోకి పోవద్దు… వనదేవత విలయతాండవం… ఒళ్లు గగుర్పొడిచే హారర్