E-Paper
Advertisement

దేశంలో వింత స్టేషన్.. రైలు ఎక్కాలంటే టికెట్ ఒక్కటే సరిపోదు.. వీసా, పాస్‌పోర్ట్ కూడా ఉండాల్సిందే!

దేశంలో వింత స్టేషన్.. రైలు ఎక్కాలంటే టికెట్ ఒక్కటే సరిపోదు.. వీసా, పాస్‌పోర్ట్ కూడా ఉండాల్సిందే!
Advertisement

Indian Railways: సాధారణంగా మన దేశంలో ఏదైనా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే ఏం కావాలి? రైలు ప్రయాణానికి సంబంధించి టికెట్ లేదా ప్రయాణికులకు సాగనంపడానికి అయితే ఒక ప్లాట్‌ఫామ్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ దేశంలోని ఆ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ లో అది కుదరదు. అక్కడ అడుగు పెట్టాలన్నా, ప్రయాణించాలన్నా కేవలం రైలు టికెట్ ఉంటే సరిపోదు.. ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే. ఇవి లేకపోతే స్టేషన్ ప్రాంగణంలోకి అధికారులు అస్సలు అనుమతించరు. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? ఎందుకీ ప్రత్యేకత? ఈ కథనంలో చూద్దాం.

విభిన్న రైల్వే స్టేషన్ పేరు ఏంటంటే?

ఈ వినూత్నమైన రైల్వే స్టేషన్ పేరు ‘అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్’. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ గుండా ప్రయాణించాలంటే కఠినమైన నిబంధనలను ఫాలో కావాల్సిందే. భద్రతా కారణాల దృష్ట్యా సరైన అనుమతి పత్రాలు, విదేశీ ప్రయాణ ధృవీకరణ పత్రాలు లేకుండా స్థానిక పౌరులను కూడా అధికారులు లోపలికి రానివ్వరు.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ప్రయాణం!

Advertisement

ఈ స్టేషన్‌లో ఇంతటి కఠినమైన నిబంధనలు అమలు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య నడిచిన చారిత్రాత్మక ‘సంఝౌతా ఎక్స్‌ప్రెస్’ రైలుకు భారత సరిహద్దులో ఇదే చివరి స్టేషన్. ఢిల్లీ నుంచి లాహోర్ వెళ్లే ప్రయాణికులకు సంబంధించి కస్టమ్స్ తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ప్రక్రియ మొత్తం ఈ స్టేషన్ లోనే జరిగేది. పాకిస్తాన్ వైపు వెళ్లే ప్రయాణికుల వద్ద సరైన ప్రయాణ పత్రాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికే అధికారులు ఈ నియమాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ఎవరైనా స్టేషన్‌లో పట్టుబడితే ‘ఫారెనర్స్ యాక్ట్’ కింద అరెస్టు చేసి జైలుకు పంపించేంత తీవ్రమైన భద్రతా ఏర్పాట్లు ఇక్కడ ఉండేవి.

Also Read: వీఐ సంచలన ఆఫర్.. రూ.35 కే OTT ప్యాక్.. నచ్చిన 2 ఓటీటీలు ఎంచుకోవచ్చు!

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

Advertisement

బీఎస్ఎఫ్ (BSF) జవాన్లు, కేంద్ర నిఘా వర్గాలు ఈ ‘అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్’ను నిరంతరం తమ భద్రతా వలయంలో ఉంచుతాయి. అయితే భారత్-పాకిస్తాన్ మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఆగస్టు 2019 నుండి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం ఇక్కడి నుంచి అంతర్జాతీయ రైలు ప్రయాణాలు జరగడం లేదు. ప్రయాణాలు ఆగిపోయినప్పటికీ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల భద్రతా దళాలు ఇప్పటికీ కట్టుదిట్టమైన కాపలాను కొనసాగిస్తున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలోనే వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి అయిన ఏకైక స్టేషన్‌గా అటారీ తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంది.

Also Read: విమానం కాదని రైలు ఎక్కితే.. 8 గంటలు లేట్.. రైల్వే శాఖపై సీఈఓ ఫైర్!

Tags

Related News

రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ యాప్‌లతో జాగ్రత్త.. IRCTC హెచ్చరిక!

దీపావళి వేళ రైల్లో టపాసులు తీసుకెళ్తున్నారా? జరిమానే కాదు జైలు శిక్షా తప్పదు!

విమానం కాదని రైలు ఎక్కితే.. 8 గంటలు లేట్.. రైల్వే శాఖపై సీఈఓ ఫైర్!

వందే భారత్ రైళ్లకు ఫుల్ డిమాండ్.. ఆ రూట్ లో ఏకంగా 189 శాతం ఆక్యుపెన్సీ!

రాముడి ఊరి నుంచి సీతమ్మ ఊరికి రైలు.. ప్రయాణికులకు త్వరలోనే కొత్త సౌకర్యం!

పాస్‌పోర్ట్ లేకుండా నేపాల్, భూటాన్ వెళ్లొచ్చా? కొత్త రూల్స్ వచ్చేశాయ్!

ఇసుకను చీల్చుకుంటూ బయటకు వస్తున్న భారీ చెయ్యి.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న వింత శిల్పం!

Big Stories

Advertisement
×