E-Paper
Advertisement

చిత్తూరులో దారుణం.. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కారుతో గుద్ది దారుణ హత్య!

చిత్తూరులో దారుణం.. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కారుతో గుద్ది దారుణ హత్య!
Advertisement

Chittoor: ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడమే ఆ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లిన వ్యక్తులు, తిరిగి రాని లోకాలకు వెళ్తారని ఆ కుటుంబ సభ్యులు కలలైనా ఊహించలేదు. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది?

Advertisement

కార్వేటినగరం పల్లిపట్టు మార్గంలో యుగంధర్, ప్రభుదాస్ అనే వ్యక్తులు బైక్‌పై ప్రయాణిస్తుండగా, ప్రదీప్ రాజు, దిలీప్ రాజు అనే దుండగులు తమ కారుతో వారిని దారుణంగా గుద్దారు. ఈ ప్రమాదంలో యుగంధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ప్రభుదాస్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

రూ. 3 లక్షల వివాదమే కారణం

Advertisement

వీరి మధ్య రూ. 3 లక్షల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవ నడుస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరుగుతుండటంతో, శనివారం ఉదయం కార్వేటినగరం పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు మధ్యవర్తిత్వం చేసుకున్నారు. అయితే, స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరగడం గమనార్హం.

బాధితుల తీవ్ర ఆందోళన

రోడ్డు ప్రమాదం ముసుగులో పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. స్పాట్‌లోనే మరణించినా, ఇప్పటివరకు పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: కరువు సవాళ్లకు చెక్ పెట్టేలా తెలంగాణ సన్నాహాలు.. ఎల్‌నినోపై మంత్రి ఉత్తమ్ సమీక్ష!

Tags

Related News

పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ వీడియోలు.. బయటపెట్టిన మాజీ మంత్రి పేర్ని నాని!

కన్నీటి సంద్రంలో కోనసీమ రైతన్నలు.. ఇంకా అందని ప్రభుత్వ పరిహారం!

కూటమి పార్టీ ఘనవిజయానికి అసలు కారణం అదే.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్!

రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా పాత పెన్షన్! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల!

విజయనగరం జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల.. పూర్తి షెడ్యూల్ విడుదల!

ఇది బ్యాలెట్ తీర్పు.. వైసీపీ గ్రాఫ్ డౌన్‌ఫాల్, ఏడు జిల్లాల్లో ఆ పార్టీకి జీరో రిజల్ట్- సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×