E-Paper
Advertisement

ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ వన్ ల్యాప్‌టాప్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ వన్ ల్యాప్‌టాప్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్
Advertisement

Acer Smartchoice Aspire One: ప్రస్తుత కాలంలో ల్యాప్‌ టాప్ అనేది.. విద్యార్థులకు, ఉద్యోగులకు అత్యవసరంగా మారిపోయింది. అయితే తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు ఉండే ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడం కొంచెం కష్టమైన పనే. అలాంటి వారి కోసం ప్రముఖ టెక్ బ్రాండ్ ఏసర్ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన మోడల్ ‘ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ వన్’. బెస్ట్ ఫర్ఫామెన్స్, ఆకర్షణీయమైన లుక్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

ధర:

ఇండియన్ మార్కెట్లో ఈ ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ వన్ ల్యాప్‌టాప్ ధర వేరియంట్లు, ఆఫర్లను బట్టి సుమారు రూ.44,490 వద్ద అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ వేదికలపై బ్యాంక్ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లతో ఇది మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో ..మంచి బ్రాండ్ ల్యాప్‌ టాప్ కోరుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

Advertisement

ప్రాసెసర్:

ఈ ల్యాప్‌టాప్ లో పవర్ ఫుల్  ప్రాసెసర్ ఉంది. ఇది రోజువారీ.. పనులను ఎలాంటి లాగ్స్ లేకుండా సజావుగా సాగేలా చూస్తుంది. ఆన్‌లైన్ తరగతులు వినే విద్యార్థులకు, కోడింగ్ ప్రాక్టీస్ చేసే బిగినర్స్‌కు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు ఈ ప్రాసెసర్ చాలా సరిగ్గా సరి పోతుంది. మల్టీటాస్కింగ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ర్యామ్, స్టోరేజ్:

Advertisement

ఈ డివైజ్ మెయిన్ హైలైట్ దీని మెమరీ వ్యవస్థ. ఇందులో.. 8GB RAM వాడారు. సాధారణ డీడీఆర్ 4 ర్యామ్‌తో పోలిస్తే.. ఎల్ పీడీడీఆర్ 5 టెక్నాలజీ వేగంగా పని చేస్తుంది. అంతే కాకుండా పవర్ ఎఫిషియన్సీని అందిస్తుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో ఫాస్ట్ బూటింగ్ కోసం హై-స్పీడ్ ఎస్ ఎస్ డీ ఇచ్చారు. దీని వల్ల ల్యాప్‌టాప్ క్షణాల్లో ఆన్ అవ్వడంతో .. పాటు ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ వేగంగా జరుగుతాయి.

డిస్‌ప్లే, డిజైన్:

ఈ ల్యాప్‌టాప్ 14 ఇంచుల (35.56 సెం.మీ) హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది.స్క్రీన్ చుట్టూ ..ఉన్న నారో బెజెల్స్ మంచి వ్యూయింగ్ ఫీల్ ఇస్తాయి. ఇక డిజైన్ పరంగా చూస్తే.. ఇది ప్యూర్ సిల్వర్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని బరువు కేవలం 1.48 కిలోలు మాత్రమే ఉండటం విశేషం. దీని వల్ల స్టూడెంట్స్ , ఆఫీస్ వెళ్లేవారు దీన్ని తమ బ్యాగులో ఎక్కడికైనా చాలా ఈజీగా మోసుకెళ్లొచ్చు.

Also Read: క్లాసిక్ లుక్‌తో..బ్లూటూత్ స్పీకర్,రూ.వెయ్యిలోపు బెస్ట్ ఛాయిస్ 

కనెక్టివిటీ, బ్యాటరీ:

లేటెస్ట్ అవసరాలకు తగినట్లుగా ఇందులో వివిధ రకాల పోర్ట్స్ లభిస్తాయి. యూఎస్‌బీ పోర్ట్‌లతో పాటు డిస్‌ప్లేలను కనెక్ట్ చేయడానికి హెచ్‌డీఎంఐ పోర్ట్ కూడా అందించబడింది. అలాగే.. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం వై-ఫై , బ్లూటూత్ సదుపాయం ఉంది. ఆన్‌లైన్ మీటింగ్స్ వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేయబడిన కెమెరా.. మైక్రోఫోన్లు ఇందులో వాడారు. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పని చేస్తుంది.

మీరు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ క్వాలిటీ, తక్కువ బరువు , లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ల్యాప్‌ టాప్ కోసం చూస్తున్నట్లయితే.. ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ వన్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

Related News

స్టైలిష్ లుక్‌తో బోట్ క్రోమ్ హారిజాన్..డైలీ వాడకానికి బెస్ట్

మాగింగ్ అంటే ఏంటి? ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న జెన్-జీ ట్రెండింగ్ స్లాంగ్ అసలు కథేంటి?

క్లాసిక్ లుక్‌తో..బ్లూటూత్ స్పీకర్,రూ.వెయ్యిలోపు బెస్ట్ ఛాయిస్

రూ.999కే బ్లూటూత్ స్పీకర్..పార్టీల కోసం బెస్ట్ ఛాయిస్

రూ.1,799కే బోట్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్! ఫీచర్లు చూస్తే మతిపోతుంది

వాయు కాలుష్యానికి చెక్ పెట్టే..అడ్వాన్స్‌డ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్!

తక్కువ ధరలో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనాలా?వీటిని మించినవి లేవు!

Big Stories

Advertisement
×