విమానయాన సంస్థలు కొన్ని కచ్చితమైన రూల్స్ పాటిస్తాయి. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్నీ చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. అందులో భాగంగానే తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా పెట్స్ ను విమనాల్లోకి అనుమతించరు. ఒకవేళ అనుమతించినా చిన్నవాటిని అలో చేస్తారు. కానీ, ఇకపై తమ నిర్ణయాన్ని మార్చుకోబోతున్నాయి విమానయాన సంస్థలు. విమానం క్యాబిన్ లోకి పెద్ద సైజ్ పెట్ డాగ్స్ ను అనుమతించబోతున్నాయి. గతంలో కార్గో హోల్డ్ లలో మాత్రమే తీసుకుపోవాలనే రూల్ ఉండగా, ఇప్పుడు ఎయిర్ లైన్స్ క్యాబిన్లలో ప్రయాణించడానికి అనుమతించే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ నిర్ణయం తీసుకుంది ఇండియా కాదు.. ఇటలీ.
పెట్ లవర్స్ కు గుడ్ న్యూస్
పెంపుడు జంతువులకు అనుకూలమైన ప్రయాణాన్ని అందించేలా ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తన విమాన ప్రయాణాన నిబంధనలు సవరించింది. ఈ కొత్త రూల్ ప్రకారం మధ్యస్థ, పెద్ద కుక్కలు విమాన క్యాబిన్ లలో వాటి యజమానులతో కలిసి ప్రయాణించనున్నాయి. ఇప్పటి వరకు విమాన క్యాబిన్లలో చిన్న పెంపుడు జంతువులను మాత్రమే అనుమతించేవారు. పెద్ద కుక్కలు కార్గో హోల్డ్ లో ప్రయాణించాల్సి ఉండేది. ఈ విధానం పెంపుడు జంతువుల యజమానులకు ఇబ్బంది కలిగించేది. తమ డాగ్స్ ఎలా ఉన్నాయోనని టెన్షన్ పడేవారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన ఫిర్యాదులతో కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇటలీ ప్రభుత్వం. తాజా రూల్స్ విమానాలలో పెద్ద కుక్కలు వాటి యజమానులతో ఉండటానికి అనుమతిస్తాయి. జంతువుల పట్ల ప్రేమను పంచాలి అనే దానికి ఈ నిర్ణయం ఓ ముందుడుగుగా ఇటాలియన్ రవాణా మంత్రి మాటియో సాల్విని అభిప్రాయపడ్డారు. ఇకపై పెట్ డాగ్స్ యజమానాలు ఎలాంటి టెన్షన్ లేకుండా తమ పక్కనే డాగ్స్ ను కూర్చోబెట్టుకని ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా తగిన సూచనలు చేయబడుతాయని వివరించారు.
Read Also: దేశంలో అత్యంత పొడవైన 5 వందేభారత్ మార్గాలు ఇవే, ఒక్కోటి ఎన్ని కిలో మీటర్లు అంటే!
ఇకపై రైళ్లలోనూ పెంపుడు జంతువులకు అనుమతి
ఇటలీ ప్రభుత్వం పెంపుడు జంతువులకు సంబంధించి తాజాగా తీసుకొచ్చిన నిబంధనలు విమానాల్లోనే కాకుండా రైళ్లలోనూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై ఎలాంటి పరిమితులు లేకుండా తమ పెట్ డాగ్స్ ను తమతో పాటు రైళ్లలో తీసుకెళ్లవచ్చని ప్రకటించింది. “పెంపుడు జంతువులకు సంబంధించి తాజాగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైళ్లలో తమ పెట్స్ డాగ్స్ ను తీసుకెళ్లవచ్చు. సైజ్ తో సంబంధం లేకుండా రైళ్లలోకి అనుమతిస్తారు. యజమానితో పెంపుడు జంతువుల ఇకపై ప్రయాణాల్లో దూరం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని ఇటలీ ప్రభుత్వ అధికాలులు వెల్లడించారు. ఇటలీ ప్రభుత్వం పెంపుడు జంతువుల విషయంలో తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యక్తిగత సౌలభ్యంతో పాటు, పర్యాటకానికి ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.
Read Also: దేశంలో అత్యంత పొడవైన 5 వందేభారత్ మార్గాలు ఇవే, ఒక్కోటి ఎన్ని కిలో మీటర్లు అంటే!