BigTV English

Vande Bharat Express: దేశంలో అత్యంత పొడవైన 5 వందేభారత్ మార్గాలు ఇవే, ఒక్కోటి ఎన్ని కిలో మీటర్లు అంటే!

Vande Bharat Express: దేశంలో అత్యంత పొడవైన 5 వందేభారత్ మార్గాలు ఇవే, ఒక్కోటి ఎన్ని కిలో మీటర్లు అంటే!

Top 5 Longest Vande Bharat Routes: భారతీయ రైల్వేలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వందేభారత్ ఎక్స్ ప్రెస్. గతంలో ఉన్న రైళ్లతో పోల్చితే చూడ్డానికి అందం, అత్యాధునిక వేగం, అదిరిపోయే సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చింది. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. పూర్తి స్థాయి స్వదేశీ టెక్నాలజీతో, మేకిన్ ఇండియాలో భాగంగా ఈ రైళ్లు తయారయ్యాయి. ప్రస్తుతం ఈ రైళ్లు దేశ వ్యాప్తంగా సర్వీసులు అందిస్తున్నాయి. అయితే, దేశంలో అత్యంత పొడవైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు రూట్లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ న్యూఢిల్లీ- వారణాసి వందే భారత్ ఎక్స్‌ ప్రెస్

దేశంలో అత్యంత పొడవైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రూట్ ఇదే. మొత్తం 759 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ ప్రయాణం పూర్తి కావడానికి సుమారు 8 గంటలు పడుతుంది. ఈ రైలు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీని ప్రముఖ  సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరం అయిన వారణాసితో కలుపుతుంది.


⦿ రాణి కమలాపతి- హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్

ఇక దేశంలో రెండో రెండవ పొడవైన మార్గం భోపాల్‌ను న్యూఢిల్లీకి  కనెకట్ చేస్తుంది. ఈ మార్గం 702 కిలో మీటర్లు విస్తరించి ఉంటుంది. మొత్తంగా 7.5 గంటల్లో ఈ రైలు తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, దేశ రాజధాని న్యూఢిల్లీ నడుమ ప్రయాణీకులకు సేవలను అందిస్తోంది.

⦿ విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

దేశంలో మూడో అతి పొడవైన వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ మార్గం 698 కిలో మీటర్లు విస్తరించి ఉంది. తీరప్రాంత నగరం అయిన విశాఖపట్నం నుంచి  తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఈ మార్గం లింక్ చేస్తుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణించడానికి ఈ రైలుకు సుమారు 8.5 గంటల సమయం పడుతుంది.

⦿ సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

దేశంలోని అతి పొడవైన వందేభారత్ రైల్వే మార్గాల్లో సికింద్రాబాద్‌- తిరుపతి కూడా ఒకటి. ఈ మార్గం మొత్తం 661 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. సికింద్రాబాద్ ను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిని కనెక్ట్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించడానికి దాదాపు 8 గంటల 15 నిమిషాలు పడుతుంది.

Read Also: విస్టాడోమ్ రైల్లో సఫారీ జర్నీ.. ఎంజాయ్ చేద్దాం పదండి బ్రో!

⦿ న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్

దేశంలో ఐదో పొడవైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ మార్గం న్యూఢిల్లీ నుంచి జమ్మూలోని కత్రా వరకు విస్తరించి ఉంటుంది. న్యూఢిల్లీ నుంచి పర్యాటకులను ఈ రైలు తీసుకెళ్తుంది. ఈ మార్గం మొత్తం 655 కిలో మీటర్లు విస్తరించి ఉంటుంది. రైలు తన గమ్య స్థానానికి చేరుకునేందుకు దాదాపు 8 గంటలు పడుతుంది. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ రైలు ప్రయాణం అత్యంత అనుకూలంగా ఉంటుంది.

Read Also: దేశంలో అత్యంత పొడవైన వందే భారత్ స్లీపర్ జర్నీ.. అదీ తెలుగు రాష్ట్రాల మీదుగా!

Related News

Special Trains: పండుగ సీజన్ కోసం మరో 150 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్!

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Vande Bharat Trains: అందుబాటులోకి 20 కోచ్‌ ల వందేభారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు!

Railway tunnels: సొరంగాల్లో సైరన్ ప్రతిధ్వని.. నంద్యాల రైల్వే టన్నెల్స్ రహస్యాలు ఇవే!

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Big Stories

×