BigTV English

Travis Head: SRHలో కరోనా కల్లోలం.. హెడ్ కు పాజిటివ్ !

Travis Head: SRHలో కరోనా కల్లోలం.. హెడ్ కు పాజిటివ్ !

Travis Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( SRH Team ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కల్లోలం రేపుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కు ( Travis Head)  కరోనా పాజిటివ్ గా ( Covid 19) నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ డానియల్ వెటోరీ అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.


Also Read: Virat Kohli Fans : కోహ్లీ కి అరుదైన గౌరవం.. చిన్నస్వామి స్టేడియంలో అన్ని 18 జెర్సీలే

హెడ్ కు కరోనా పాజిటివ్


ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్… మద్యాంతరంగా ఆగిపోయింది. అయితే యుద్ధం ముగిసిన నేపథ్యంలో నిన్నటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటును పునః ప్రారంభించారు. దీంతో విదేశీ ప్లేయర్లు అందరూ ఇండియాకు వచ్చి… మ్యాచులు ఆడుతున్నారు. కానీ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కు సంబంధించిన డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ మాత్రం ఇండియాకు రాలేదు. అతనికి ఆస్ట్రేలియా లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు.

అందుకే కమిన్స్ తో ( PAT CUMMINS ) పాటు కలిసి హైదరాబాద్ కు ( HYDERABAD) రాలేదు సన్రైజర్స్ ఆటగాడు హెడ్ ( TRAVIS HEAD). దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ( Sunrisers Hyderabad vs Lucknow Super Giants ) మధ్య.. రేపు జరిగే మ్యాచ్ కు హెడ్ దూరంగా ఉంటాడని చెబుతున్నారు. ఈ మ్యాచ్ లో హెడ్ లేకుండానే బరిలోకి దిగుతామని హైదరాబాద్ కోచ్ డానియల్ వెటోరి ( Daniel Vettory) అధికారికంగా ప్రకటించారు. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో ఈనెల 19 అంటే రేపటి రోజున లక్నోలోని అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow )  వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో హెడ్ లేకుండానే హైదరాబాద్ జట్టు లక్నో కి వెళ్లింది. అయితే.. సోమవారం రోజున ఆస్ట్రేలియా నుంచి హెడ్ ఇండియా కు వస్తాడని చెబుతున్నారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆయన కోల్కున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఇంటి దారి పట్టిన హైదరాబాద్ టీం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత దారుణంగా విఫలమైతున్న సంగతి తెలిసిందే.. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తప్పుకుంది. 2024 ఐపీఎల్ టోర్నమెంట్ లో ఫైనల్ దాకా వెళ్ళిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… ఈసారి మాత్రం దారుణంగా విఫలమైంది. ప్లే ఆఫ్ కూడా వెళ్లకుండానే ఇంటిదారి పట్టింది.

Also Read: Virat Kohli: చిన్న స్వామిలో తెల్ల పావురాలు…కోహ్లీ కోసం భారీ ప్లాన్.. గూస్ బంప్స్ రావాల్సిందే

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×