E-Paper
Advertisement

ఆర్మీ వాహనానికి ఫైన్.. మహిళా అధికారిణిపై వేటు! అసలేం జరిగింది?

ఆర్మీ వాహనానికి ఫైన్.. మహిళా అధికారిణిపై వేటు! అసలేం జరిగింది?
Advertisement

Assam Army Vehicle Challan Controversy:  ఆర్మీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయడం.. డ్రైవర్‌ తో వాగ్వాదం.. చివరకు చలాన్ విధించిన వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఆర్మీ వాహనానికి జరిమానా విధించిన మహిళా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) సెమిమ్ సుల్తానాను అధికారులు సస్పెండ్ చేశారు. అసోంలోని జోర్హాట్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అసలు గొడవ ఎక్కడ మొదలైంది?

అసోంలోని జోర్హాట్ పట్టణంలో నవంబర్ 18న ఈ ఘటన జరిగింది. ఏటీ రోడ్డులోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ISBT) సమీపంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లిచుబారిలోని 41 సబ్ ఏరియా మిలటరీ స్టేషన్‌కు చెందిన ఆర్మీ వాహనాన్ని అధికారులు ఆపారు. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో జూనియర్ ఆర్మీ సిబ్బంది ఉన్నారు. చెకింగ్స్ సమయంలో డ్రైవర్ సీట్‌బెల్ట్ ధరించలేదని గుర్తించిన MVI సెమిమ్ సుల్తానా చలాన్ విధించారు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ విషయంలోనూ అధికారులకు, ఆర్మీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే ఆమె ఆర్మీ వాహనానికి ఫైన్ వేశారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి కారణం అయ్యింది.

సివిల్ లైసెన్స్ లేకపోతే ఫైన్ వేశారా?

Advertisement

ఈ ఘటనపై జోర్హాట్ జిల్లా రవాణా అధికారి ధనంజయ్ సైకియా వివరణ ఇచ్చారు. ఆర్మీ డ్రైవర్‌కు సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదనే కారణంతో ఎలాంటి జరిమానా విధించలేదని స్పష్టం చేశారు. సీట్‌బెల్ట్ ధరించనందుకే చలాన్ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్మీ వాహనాలను నడిపేందుకు సైనికులకు డిఫెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుందని, దాని ఆధారంగా దేశవ్యాప్తంగా ఆర్మీ వాహనాలను నడపవచ్చని వివరించారు. అయితే, ఆ లైసెన్స్‌ తో సాధారణ ప్రైవేట్ వాహనాలను నడపడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఆర్మీ వాహనాల్లో ప్రయాణించేవారికి కూడా సీట్‌బెల్ట్ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.

మహిళా అధికారిణిపై ఎందుకు చర్యలు?

వీడియో వైరల్ కావడంతో పాటు MVI మీడియాతో మాట్లాడిన సమయంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. ఆమె వ్యవహరించిన తీరు కొంత కఠినంగా ఉందని DTO వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమెను తాత్కాలికంగా విధులకు దూరంగా ఉంచినట్లు వెల్లడించారు. ఇది శాశ్వత సస్పెన్షన్ కాదన్నారు.

జిల్లా యంత్రాంగం విచారం

Advertisement

ఈ ఘటనపై జోర్హాట్ జిల్లా యంత్రాంగం విచారం వ్యక్తం చేసింది. ఆర్మీ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలిగించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. జిల్లా రవాణా అధికారి నివేదిక ఆధారంగా ఘటనపై సమీక్ష నిర్వహించారు. 41 సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ నేతృత్వంలో ఆర్మీ, జిల్లా అధికారుల మధ్య సమావేశం కూడా జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరస్పర గౌరవం, సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు.

Read Also: మెట్రోకు పోటీగా PRTS.. హైదరాబాద్‌లో మరో కొత్త ట్రాన్స్‌ పోర్ట్ సిస్టమ్!

Tags

Related News

అక్వాన్ తుఫాను ఎఫెక్ట్.. 69 రైళ్లు రద్దు.. మీ ట్రైన్ కూడా ఉందా?

సముద్రం కాదు.. కానీ, సముద్రంలా కనిపిస్తుంది.. నల్లగొండలో ఈ అద్భుతం చూశారా?

దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.15 కోట్లతో భారీ అభివృద్ధి!

ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది.. పూర్వం ఎల్ నినోను ఎలా ఎదుర్కొనేవారు? ఎలా బతికి బట్టకట్టేవారో తెలుసా?

వందే భారత్ జర్నీ సోషల్ మీడియా స్టేటస్‌గా ఎందుకు మారుతోంది? సైకాలజీ చెప్పే క్రేజీ సంగతి ఇదే!

స్వామివారి శ్వాసకు దీపం కదలికే సంకేతమా? వాడపల్లి ఆలయంలో అంతుచిక్కని రహస్యం!

మెట్రోకు పోటీగా PRTS.. హైదరాబాద్‌లో మరో కొత్త ట్రాన్స్‌ పోర్ట్ సిస్టమ్!

Big Stories

Advertisement
×