E-Paper
Advertisement

ఘనంగా బిగ్ బాస్ ప్రేరణ సీమంతం వేడుక.. డెలివరీ ఎప్పుడంటే?

ఘనంగా బిగ్ బాస్ ప్రేరణ సీమంతం వేడుక.. డెలివరీ ఎప్పుడంటే?
Advertisement

Prerana kambam:బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి కప్పు కొట్టకపోయినా.. టాప్ 4 ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచి అభిమానుల హృదయాలను దోచుకుంది ప్రేరణ కంభం (Prerana kambam). ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) స్నేహితురాలిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈ ఏడాది సెప్టెంబర్ లో తాను తల్లిని కాబోతున్నాను అంటూ భర్తతో కలిసి సీమంతం వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ విషయాలను అభిమానులతో పంచుకుంటూ సర్ప్రైజ్ ఇచ్చింది ప్రేరణ.

బేబీ బంప్ తో ఆకట్టుకున్న ప్రేరణ..

ఇక ఈ బేబీ షవర్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సినీ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు, నెటిజన్స్ ప్రేరణ దంపతులకు అభినందనలతో పాటు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు ప్రేరణ , శ్రీపాద దంపతులు. తాజాగా సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేరణ ఈ విధంగా రాసుకొచ్చింది. “రెండు చిట్టి చేతులు మమ్మల్ని పట్టుకోవడానికి ముందే.. మా ఈ చిన్న ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి వెయ్యి చేతులు ఏకమయ్యాయి” అంటూ క్యాప్షన్ జోడించింది.

పుట్టేది ఎవరు?

Advertisement

ఇదిలా ఉండగా ప్రేరణ తన బేబీ బంప్ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ..” పుట్టేది అబ్బాయా? అమ్మాయా ? అంటూ టెన్షన్ పడుతున్నట్లు షేర్ చేసింది. ఏది ఏమైనా ప్రేరణ కంభం మరికొన్ని రోజుల్లో డెలివరీ కాబోతోంది అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అని అంటుంటే ..మరి కొంత మంది మీలాగే క్యూట్ గా అమ్మాయి పుడుతుంది” అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పుట్టబోయే బిడ్డ కోసం ప్రేరణ గట్టిగానే ఎదురుచూస్తోంది.

ప్రేరణ సీరియల్ కెరియర్..

ప్రేరణ విషయానికి వస్తే.. ప్రేరణ తెలుగు డైలీ సీరియల్ కృష్ణా ముకుందా మురారిలో ప్రధాన పాత్ర పోషించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక తర్వాత తన భర్త శ్రీపాదతో కలిసి ఇస్మార్ట్ జోడిలో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచింది. తెలంగాణలోని హైదరాబాదులో 1996 జూన్ 18న జన్మించింది . తన బాల్యంలో కొంత భాగాన్ని అమెరికాలో గడిపింది. బెంగళూరులో దయానంద సాగర్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈమె.. తన దీర్ఘకాల భాగస్వామి అయిన శ్రీ పాద దేశ్ పాండేను నవంబర్ 2023న వివాహం చేసుకుంది.

Advertisement

also read: బిగ్ బాస్ టాప్ 5లో వీరికే ఛాన్స్.. శివాజీ కామెంట్స్!

ప్రేరణ కంబం సినిమాలు..

ఇక ప్రేరణ సీరియల్స్, రియాలిటీ షోలలోనే కాదు సినిమాలలో కూడా నటించింది. 2018 లో చురికట్టే అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరకు అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఫిజిక్స్ టీచర్ , ఒండాకే కాదు, పెంటగాన్, క్యాపిటల్ సిటీ వంటి చిత్రాలలో నటించింది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే వంటి టీవీ షోలలో కూడా సందడి చేసింది.

Related News

బిగ్ బాస్ టాప్ 5లో వీరికే ఛాన్స్.. శివాజీ కామెంట్స్!

Gundeninda Gudigantalu : భక్తుడుగా మారిపోయిన బాలు.. సడెన్గా ఇదేం ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో మాధవ్ ఫీల్.. మనసులో మాట చెప్పిన మహా.. విక్కీ ఆఫర్ రిజెక్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి సాగర్ వెళ్ళిపోతాడా..? వల్లికి గుడ్ న్యూస్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..

Nindu Noorella Saavasam Serial Today Episode November 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు మనోహరి గురించి నిజం తెలిసిపోయిందా..?  

Brahmamudi Serial Today Episode November 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రప్రతాప్ జువ్వెల్లరీ కోసం పోటీ పడుతున్న ఇందు, ఐవ్వర్య  

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మనోజ్.. రవికి బంఫర్ ఆఫర్.. ప్రభా ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×