E-Paper
Advertisement

ఎవరెస్ట్ మాత్రమే కాదు.. ఈ 7 పర్వతాలు ఎక్కడం చాలా ప్రమాదకరం

ఎవరెస్ట్ మాత్రమే కాదు.. ఈ 7 పర్వతాలు ఎక్కడం చాలా ప్రమాదకరం
Advertisement

Dangerous Mountains to Climb| పర్వతారోహణ అంటే సాహసాన్ని ఇష్టపడే వారికి ఎంతో ఆకర్షణ. అయితే ప్రపంచంలోని కొన్ని పర్వతాలు అందంగా కనిపించినా, వాటిని అధిరోహించడం చాలా ప్రమాదకరం. ఇటీవల బ్రాడ్ పీక్‌పై జరిగిన హిమపాతంలో ఒక ప్రముఖ పర్వతారోహకుడు చనిపోవడం ఈ ప్రమాదాలను మరోసారి గుర్తు చేసింది. అక్కడ చిక్కుకున్న పర్వతారోహకుల కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎత్తైన పర్వతాల్లో ప్రకృతి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన స్పష్టంగా చూపించింది.

కే2 – అత్యంత కఠినమైన పర్వతం

ఈ పర్వతం సముద్ర మట్టానికి 8,611 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కే2 ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతం. చాలామంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎవరెస్ట్ కంటే కే2 ఎక్కడం మరింత కష్టం. నిటారుగా ఉండే మంచు గోడలు, హిమపాతాలు, ఆకస్మిక తుఫాన్లు పర్వతారోహకులకు పెద్ద సవాలుగా మారుతాయి. అందుకే దీన్ని “సావేజ్ మౌంటెన్” అని కూడా పిలుస్తారు.

అన్నపూర్ణ 1 – హిమపాతాల ముప్పు ఎక్కువ

Advertisement

నేపాల్‌లో ఉన్న అన్నపూర్ణ 1 ఎత్తు 8,091 మీటర్లు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో ఇది ఒకటి. ఇక్కడ తరచూ హిమపాతాలు సంభవిస్తుంటాయి. మంచు స్థిరంగా లేకపోవడం, క్లిష్టమైన మార్గాలు ఉండడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.

నంగా పర్బత్ – కిల్లర్ మౌంటెన్

పాకిస్థాన్‌లో ఉన్న నంగా పర్బత్ 8,126 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వతం అధిరోహించడానికి వెళ్లిన చాలా మంది చనిపోయారు. అందుకే నంగా పర్బత్ ప్రాణాలను బలితీసుకుంటుందని అని సామెత ఉంది. అందుకే దీన్ని కిల్లర్ మౌంటెన్ అని పిలుస్తారు. రాళ్లు విరిగి పడటం, హిమపాతాలు, తీవ్రమైన వాతావరణ మార్పులు ఎక్కే వారికి ఎప్పుడూ ప్రమాదమే. ఇందులోని రుపాల్ ఫేస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత గోడగా గుర్తింపు పొందింది.

బ్రాడ్ పీక్ – అందంగా కనిపించినా ప్రమాదకరం

Advertisement

బ్రాడ్ పీక్ ఎత్తు 8,047 మీటర్లు. ఇది కే2 సమీపంలో ఉంటుంది. కే2తో పోలిస్తే ఇది కొంత సులభంగా అనిపించినా, ప్రమాదాలు మాత్రం తక్కువ కావు. హిమపాతాలు, లోతైన మంచు చీలికలు, ఆకస్మిక వాతావరణ మార్పులు ఎప్పుడైనా ప్రాణాపాయంగా మారవచ్చు. 8,000 మీటర్ల ఎత్తులో ఉండే డెత్ జోన్ కూడా పెద్ద సవాలే.

కాంచెన్ జంగా – పవిత్రమైనది కానీ అధిరోహణ కఠినం

నేపాల్, భారత్ సరిహద్దులో ఉన్న కాంచెన్ జంగా 8,586 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలో మూడో అత్యంత ఎత్తైన పర్వతం. భారీ మంచు, హిమపాతాలు, లోతైన గ్లేసియర్ చీలికలు ఎక్కే వారికి ప్రమాదంగా ఉంటాయి. స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ చాలామంది పర్వతారోహకులు శిఖరానికి కొద్దిదూరంలోనే ఆగిపోతారు.

ధౌలగిరి 1 – క్షణాల్లో మారే వాతావరణం

ధౌలగిరి 1 ఎత్తు 8,167 మీటర్లు. ఇక్కడ బలమైన గాలులు, మంచు తుఫాన్లు తరచూ వస్తుంటాయి. హిమపాతాలు, ఐస్‌ఫాల్స్ కారణంగా ప్రయాణం చాలా కష్టమవుతుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో చాలాసార్లు యాత్రను మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తుంది.

Also Read: దుబాయ్ ఫ్యామిలీ టూర్ వెళుతున్నారా? పిల్లలకు వీసా ఫ్రీ.. ఈ కండీషన్స్ పాటిస్తే

ఈగర్ – తక్కువ ఎత్తు, ఎక్కువ ప్రమాదం

స్విట్జర్లాండ్‌లోని ఈగర్ పర్వతం ఎత్తు 3,967 మీటర్లు మాత్రమే. అయినా ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని ఉత్తర ముఖాన్ని “మర్డర్ వాల్” అని పిలుస్తారు. రాళ్లు జారిపడటం, మంచు విరిగిపడటం, ఆకస్మిక తుఫాన్లు ఇక్కడ ప్రధాన ప్రమాదాలు.

Also Read: ఫ్రీ ఫ్రీ.. దుబాయ్‌లో హోటల్ స్టే, డిన్నర్, ట్రావెల్ అన్నీ ఉచితం.. ప్రభుత్వం కొత్త ఆఫర్

ఈ పర్వతాలు ఎందుకు అంత ప్రమాదకరంగా ఉంటాయి?

ఎత్తు పెరిగే కొద్దీ గాలిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. హిమపాతాలు, మంచు చీలికలు, ఐస్‌ఫాల్స్ ఎప్పుడైనా ప్రమాదం కలిగిస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా చాలా కష్టంగా ఉంటాయి. అందుకే పర్వతారోహకులు సరైన శిక్షణ, నాణ్యమైన పరికరాలు, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంతోనే ఈ పర్వతాలను అధిరోహించాలి.

Also Read: ఒక్క విమానం కూడా రాని ఎయిర్‌పోర్ట్‌కు నెంబర్ 1 ర్యాంక్? అసలు విషయం ఇదీ..

పై తెలిపిన పర్వతాలు ప్రకృతి శక్తికి నిలువెత్తు నిదర్శనాలు. వాటి అందం ఎంత అద్భుతంగా ఉన్నా, వాటిని అధిరోహించడం ప్రాణాలకు పెద్ద సవాలు. అందుకే ఈ పర్వతాలను ఎక్కే ముందు ప్రకృతిని గౌరవించడం, పూర్తి సన్నద్ధతతో వెళ్లడం అత్యంత అవసరం.

Related News

భోగాపురం విమానాశ్రయంలో మొక్కలు పీకెళ్ళిన జనం.. వీళ్లు మారరు!

రైల్వే ఉద్యోగులు అన్ని రైళ్లలో ఫ్రీగా వెళ్లొచ్చా? లేక టికెట్ కొనాల్సిందేనా?

విమానం ఎక్కకపోయినా భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ ను చూడొచ్చా? ఇలా వెళ్తే సరిపోతుంది!

‘భోగాపురం’ అంటే ఏంటీ? ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఊరికి ఇంత చరిత్ర ఉందా?

వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే కొత్త ప్యాకేజీ..!

భోగాపురంలో 13 వేల ధింసా డ్యాన్సర్లతో మోడికి వెల్‌కమ్.. గిన్నీస్ రికార్డుల్లోకి ఆదివాసీల నృత్యం!

ఇండియన్ ట్రైన్ జర్నీపై విదేశీ యువతి రివ్యూ.. నెటిజన్లు ఫిదా!

Big Stories

Advertisement
×