E-Paper
Advertisement

గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!

గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!
Advertisement

Kalyani Amma:గాజులు గలగల అంటూ ఏ ముహూర్తాన రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య నెట్టింట వైరల్ అయిందో కానీ అప్పటినుంచి ప్రశంసలతో పాటు వివాదాలు కూడా ఆమెని చుట్టుముట్టాయి. ముఖ్యంగా రాధమ్మ కూతురిని కళ్యాణి అమ్మ అనే ఆవిడ మొట్టమొదటి సారిగా కామెంట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.

టార్గెట్ చేసి వీడియోలు పెట్టాలన్న ఉద్దేశం లేదు 

Advertisement

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి అమ్మ తన గురించి, తానెందుకు వీడియోలు తీస్తాను అనే విషయాల గురించి,అలాగే తాను ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది అంటూ అసలు విషయం ఇలా చెప్పుకొచ్చింది. తనకు రాధమ్మ కూతురు అసలు ఎప్పుడు పరిచయం లేదని ఆమెని టార్గెట్ చేసి వీడియోలు పెట్టాలన్న ఉద్దేశం తనకి అసలే లేదని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలోకి కళ్యాణి అమ్మ వచ్చిన బ్యాగ్రౌండ్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. మొదట్లో తను ఊర్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసేదాన్ని, తనకి పశువులు కూడా ఉన్నాయని తెలిపింది.అయితే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొంతకాలం ఆసుపత్రుల చుట్టూ తిరిగానని చెప్పింది. మల్లా రెడ్డి హాస్పిటల్ తో పాటు నిమ్స్ లాంటి హాస్పిటల్స్ కూడా వెళ్లాల్సి వచ్చిందని అదే సమయంలో తన కొడుకు దగ్గర ఉండాల్సి వచ్చిందని తెలిపింది.

Advertisement

తన కొడుకు తనకి మొబైల్ కొనియడంతో

ఇక అదే సమయంలో తన కొడుకు తనకి మొబైల్ కొనియడంతో ఫోన్ అలవాటైందని, అలా సెల్ ఫోన్ చూస్తూ సొసైటీలో జరుగుతున్న విషయాలని ఖండిస్తూ తన ఇంట్లోనే వీడియోలు చేస్తూ చెప్పేదాన్ని గుర్తుచేసుకోండి. ఇక తను చెప్పే మాటలు బాగా ఉన్నాయని తన కొడుకు గుర్తించి అలాగే వాటిని పదిమందికి చెబితే బాగుంటుందని సూచించాడని తెలిపింది.ఇక తన కొడుకే తనని మొదటగా కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి తీసికెళ్ళి వీడియోలు చేయడం ప్రారంభించాడని తెలిపింది .అలా చేసిన ప్రయాణమే క్రమంగా కళ్యాణి టాక్స్ గా మారిందని వివరించింది.

ALSO READ :గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!

తన వల్ల ఒకరు అయినా మారితే సంతోషం 

ఇక తనకి చదువు పెద్దగా రాదని మీడియా, ప్రమోషన్స్ ,ఫాలోవర్స్,లైక్స్ ,వ్యూస్ తెలీదని చెప్పుకొచ్చింది. వాటికి సంబంధించిన విషయాలన్నీ తన కొడుకే చూసుకుంటాడని తనకు మాత్రం తెలిసిన విషయాలను పదిమందికి చెప్పడం ఒకటి తెలుసని తెలిపింది. తన వల్ల ఒకరు అయినా మారితే సంతోషమని, తన వల్ల ఎవరు చెడిపోకూడదని సమాజానికి మంచి విషయాలనే చెప్పాలని తన ఆలోచన అని చెప్పుకొచ్చింది.ఇక చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డానని తక్కువ స్థాయి నుంచి తన లైఫ్ ని మొదలుపెట్టానని డబ్బు ఉన్నప్పుడు కూడా డబ్బులు లేనప్పుడు మరొక్కలా బంధువులు ఉంటారని తెలిపింది.

మాలని ధరిస్తే మంచిది 

రాధమ్మ కూతురు విషయానికి వస్తే తను చేసిన రీల్ చూసిన తర్వాత తాను రియాక్ట్ అయ్యాను అని చెప్పింది .ముఖ్యంగా అమ్మాయిలు మాల వేసుకుంటున్నప్పుడు పెద్దవాళ్లుగా మనం దానికి సంబంధించిన పద్ధతులు, నియమాలు తెలియజేయాల్సిన బాధ్యత తనకు ఉందని అనిపించిందని చెప్పింది. ఇక భక్తి అనేది సోషల్ మీడియాలో షో చేసుకునేది కాదని ,అది నమ్మకానికి సంబంధించిన విషయం అని అందులో ఒక ఆచారం, ఆధ్యాత్మిక భావన ఉంటాయని తెలిపింది .ఏదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్లి మనసులోని బాధని చెప్పుకొని మాలని ధరిస్తే మంచిదని ఈ విషయంలో తనకు తెలిసిన సాంప్రదాయాల ప్రకారం మాట్లాడానని కుండలు బద్దలు కొట్టేసింది.

ALSO READ :బాయిలోనే బల్లిపలికే పాటతో సెన్సేషన్.. నాగవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన మల్లి సీరియల్ నటి!

గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!

నల్లగా ఉన్నారని నాన్నను ఇష్టపడమా? కాబోయే భర్త పై లాస్య కామెంట్స్!

నేను గోల్డెన్ లెగ్ అంటున్న మల్లి సీరియల్ నటి లాస్య..ఏ సీరియల్ చేసిన బ్లాక్ బస్టర్!

తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!

బిగ్ బాస్ లో ఆ నలుగురికి జీరో స్టార్స్.. కంటెస్టెంట్స్ కి ఇచ్చిపడేసిన నాగార్జున!

బాయిలోనే బల్లిపలికే పాటతో సెన్సేషన్.. నాగవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Big Stories

Advertisement
×