Indian Railways: పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రైల్వే స్టేషన్లలో టికెట్లు కొనుగోలు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ప్యాసింజర్ రైలు టికెట్లు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే స్టేషన్ కౌంటర్ దగ్గర పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు క్యూలో ఉంటారు. ఇలాంటి సమయంలో టికెట్లు కొనుగోలు చేయలేకపోతారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఇకపై ఓ మోబైల్ యాప్ ద్వారా ప్యాసింజర్ రైలు టికెట్లు మాత్రమే కాదు, ఫ్లాట్ ఫారమ్ టికెట్లు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
UTS యాప్ తో ప్యాసింజర్ రైళ్ల టికెట్ల బుకింగ్
సాధారణంగా రైలు టికెట్లు కొనుగోలు చేయడానికి చాలా మంది IRCTC యాప్ లేదంటే వెబ్ సైట్ ను ఉపయోగిస్తారు. కానీ, మరో ప్రభుత్వ యాప్ ద్వారా కూడా రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ప్యాసెంజర్ రైళ్లతో పాటు ఫ్లాట్ ఫారమ్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ యాప్ మరేదో కాదు, UTS యాప్. దీనినే ఇండియన్ రైల్వేస్ అన్ రిజర్వుడ్ టికెటింగ్ యాప్ అంటారు. ఈ యాప్ ద్వారా నార్మల్ టికెట్ బుకింగ్, ఫ్లాట్ ఫారమ్ టికెట్ బుకింగ్, సీజన్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు, బుక్ చేసిన టికెట్లను అవసరం లేదు అనుకుంటే క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
5 సెకెన్లలో టికెట్ బుకింగ్
ఇక UTS యాప్ అనేది ప్లే స్టోర్ తో పాటు యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది నూటికి నూరుశాతం ప్రభుత్వ యాప్. దీని ద్వారా సేఫ్ గా రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్నాక, ఓపెన్ చేయాలి. అనంతరం మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత టికెట్ బుకింగ్ ఆప్షన్ లోని వెళ్లి, మీరు రైలు ఎక్కాల్సిన స్టేషన్ తో పాటు మీరు దిగాల్సిన స్టేషన్ ను ఎంటర్ చేయాలి. వెంటనే ఈ మార్గంలో అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలకు మీకు డిస్ ప్లే అవుతాయి. వాటిలో మీకు అనుకూలంగా ఉన్న రైల్లో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా కేవలం 5 సెకెన్లలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సో, ఇకపై రైల్వే స్టేషన్ కౌంటర్ లో చాలా మంది ఉన్నారని టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. UTS యాప్ ద్వారా సింపుల్ గా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు, మీ వెంట వచ్చిన వారికి ఫ్లాట్ ఫారమ్ టికెట్ ను కూడా బుక్ చేయ్యొచ్చు. కానీ, ఓ కండీషన్.. మీరు రైల్వే ఫ్లాట్ ఫారమ్ మీద ఉండి ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. రైల్వే స్టేషన్ బయటకు వచ్చి టికెట్ బుక్ చేసుకుంటేనే అవుతుంది. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.
Read Also: టికెట్ లేకుండా టీసీకి దొరికితే.. ఎంత ఫైన్ కట్టాలి? రైల్వే రూల్ ఏం చెప్తున్నాయంటే?