Indian Railway Rules: దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా రైల్వే గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని పలు ప్రాంతాలకు రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉంది. రోజూ దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. సుదూర ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా రైల్లో వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. జనరల్ బోగీలో ప్రయాణం చేసేందుకు అప్పటికప్పుడు రైల్వే స్టేషన్ లోని కౌంటర్ లో టికెట్ తీసుకోవచ్చు.
టికెట్ లేకుండా ప్రయాణిస్తూ టీసీకి దొరికితే?
కొంత మంది రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. ముఖ్యమంగా పండుగలు, ఇతర రద్దీ సమయాల్లో టికెట్ లేకపోయినా, రైల్లోప్రయాణం చేస్తుంటారు. జనరల్ బోగీలో ప్రయాణీకులు కిక్కిరిసిపోవడం వల్ల టీసీ పెద్దగా చెక్ చేయరు. కానీ, కొన్ని సందర్భాల్లో జనరల్ బోగీల్లోనూ టికెట్స్ చెక్ చేస్తారు. అలాంటి సమయంలో టికెట్ లేకుండా టీసీకి దొరికితే ఫైన్ చెల్లించడంతో పాటు ఒక్కోసారి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఎంత ఫైన్ వేస్తారంటే?
టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తూ టీసీకి దొరికితే.. పైన్ విధించేందుకు ఓ పద్దతి ఉంటుంది. ఇష్టం వచ్చినంత జరిమానా విధిస్తామంటే కుదరదు. టికెట్ లేని ప్రయాణానికి సంబంధించి ఎంత ఫైన్ విధించాలి? అనే అంశానికి సంబంధించి రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయంటే.. రైల్వే యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం టీసీకి నచ్చినంత ఫైన్ విధించే హక్కు లేదు. ఒక వ్యక్తి ఎంత దూరం అయితే ప్రయాణం చేశాడో, అంత టికెట్ ధరతో పాటు అదనంగా 250 రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు టికెట్ లేకుండా భీమవరంలో రైలు ఎక్కి విజయవాడ వరకు స్లీపర్ క్లాస్ లో ప్రయా చేస్తే, టికెట్ ధర 175 ఉంటుంది. 175కు ఫైన్ 250 కలిపి 425 కట్టాల్సి ఉంటుంది. మీరు ఫ్లాట్ ఫారమ్ టికెట్ తీసుకుంటే ఏ స్టేషన్ లో ఎక్కి, ఎక్కడి వరకు వచ్చారో అంత వరకు టికెట్ ఛార్జీతో పాటు ఫైన్ కలిపి కట్టాల్సి ఉంటుంది. కనీసం ఫ్లాట్ ఫారమ్ టికెట్ కూడా తీసుకోకపోతే, రైలు ఎక్కడ బయల్దేరిందో అక్కడి నుంచి ప్రస్తుత స్టేషన్ వరకు టికెట్ ఛార్జీతో పాటు ఫైన్ కలిపి వసూళు చేసే అవకాశం ఉంటుంది.
Read Also: రోడ్ల మీద ఉండే మైలు రాళ్లకు ఇన్ని రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక కహానీ ఏంటంటే?
సో, ఎవరైనా రైలు ప్రయాణం చేయాలనుకుంటే కచ్చితంగా టికెట్ తీసుకొని వెళ్లాలి. ఒకవేళ టైన్ టికెట్ తీసుకోలేని పరిస్థితిలో కనీసం ఫ్లాట్ ఫారమ్ టికెట్ అయినా తీసుకోవాలి. ఎందుకంటే, మీరు ఎక్కడ రైలు ఎక్కారో చెప్పేందుకు ఆధారం అవుతుంది. దాని ప్రకారం టీసీ మీకు ఫైన్ విధించే అవకాశం ఉంటుంది.
Read Also: టికెట్లపై 75 శాతం డిస్కౌంట్.. విద్యార్థులకు రైల్వే సంస్థ స్పెషల్ రాయితీల గురించి తెలుసా?