BigTV English

Bride Runaway Mid Wedding: పెళ్లికొడుకుని దోచుకున్న పెళ్లికూతరు.. మూడుముళ్ల సమయంలో దోపిడి చేసి పరార్

Bride Runaway Mid Wedding: పెళ్లికొడుకుని దోచుకున్న పెళ్లికూతరు.. మూడుముళ్ల సమయంలో దోపిడి చేసి పరార్

Bride Runaway Mid Wedding| ఒక యువతి పెళ్లికి అంగీకరించి.. తీరా పెళ్లిపీటలపై మూడు ముళ్లు వేసే సమయంలో పరారైంది. అది కూడా అందరి ముందు పెళ్లి కొడుకు ఇచ్చిన బంగారు నగలు, ఇతర నగదుతో సహా ఉడాయించింది. దీంతో ఆ 40 ఏళ్ల పెళ్లి కొడుకు తెల్ల ముఖం వేసుకొని ఆమె కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గోవింద్ పూర్ గ్రామంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లా ఢిల్లీ సమీపంలో ఉంది. సీతాపూర్ జిల్లా గోవింద్ పూర్ గ్రామానికి చెందిన కమలేశ్ కుమార్ అనే 40 ఏళ్ల రైతు భార్య రెండేళ్ల క్రితం చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో అతనికి కుటుంబం పాలన, పిల్లలను చూసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ కారణంగానే గత కొంత కాలంగా అతని బంధువుల సలహా మేరకు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ఈ క్రమంలో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా.. ఒక మహిళ తనకు రూ.30000 కమీషన్ ఇస్తే మంచి యువతితో పెళ్లిచేయిస్తానని.. ఆ యువతి ఇంట్లో వంట, పిల్లల పెంపకం అంతా చక్కగా చూసుకుంటుందని చెప్పి నమ్మించింది. తన ఇంటికి ఇల్లాలు అవసరముండడంతో కమలేశ్ కుమార్ వెంటనే ఆమె అడిగినంత మొత్తం ఇచ్చేశాడు. దీంతో ఆమె ఒక యువతి, యువతి తల్లితో కమలేఖ్ కుమార్ కు పరిచయం చేసింది. ఆ యువతిని చూసి కమలేశ్ పెళ్లికి అంగీకరించాడు. యువతికి తండ్రి లేడని తెలిసి కమలేశ్ కుమార్ పెళ్లి ఖర్చులన్నీ తానే భరించాడు. పెళ్లి కూతురు కోసం ఖరీదైన బట్టలు కొనిచ్చాడు. ఖర్చుల కోసం పెళ్లికూతరు, ఆమె తల్లికి రూ.20,000 కూడా ఇచ్చాడు. పెళ్లి కోసం బంగారు నగలు చేయించాడు.


Also Read:  ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..

ఆ తరువాత గ్రామంలోని భరోహియా ప్రాంతంలోని శివాలయంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల క్రితం పెళ్లికోసమని ఆ యువతి, ఆమె తల్లి గుడికి వచ్చారు. ఆ సమయంలో కమలేఖ్ తన కాబోయే భార్యకు నగలు ఇచ్చాడు. ఆ తరువాత ఆమెను పెళ్లిపీటల వరకు వచ్చింది. కానీ తాను బాత్రూం వెళ్లాలని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంతే ఇక తిరిగి రాలేదు.

పెళ్లికూతురు గంట తరువాత కూడా తిరిగి రాకపోయేసరికి సహనం కోల్పోయిన కమలేశ్, అతని బంధువులు వెళ్లి వెతికారు. కానీ ఆమె కనబడలేదు. తిరిగి వచ్చి చూస్తే.. ఆమె తల్లి కూడా మాయమైంది. ఈ ఘటన గురించి మీడియాకు తెలియడంతో కమలేశ్ ను స్థానిక విలేకరులు సంప్రదించారు. తన కుటుంబం బాగుండాలని కోరి తన వద్ద ఉన్నదంతా ఆ యువతికి ఇచ్చానని.. ఇప్పుడు తన జీవితకాలం సంపాదించిన దంతా పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ పోలీసులు మాత్రం ఈ కేసులో ఆ యువతిని బలవంతంగా వివాహం చేసుకోవడానికి ఒత్తిడి చేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

భర్తపై యాసిడ్ తో దాడి చేసిన తాగుబోతు భార్య
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన నారాయన్ లోధీ (61) అనే వ్యక్తి ట్రక్కు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతని మొదటి భార్య చనిపోతే రెండేళ్ల క్రితం దుర్గా (45) అనే మహిళను మరో వివాహం చేసుకున్నాడు. దుర్గకు కూడా ఇది రెండో వివాహం. ఆమెకు మొదటి భర్త నుంచి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే వారంలో రెండు రోజులు మాత్రమే ఇంట్లో ఉండే నారాయణ్ మూడు రోజుల క్రితమే లారీ ట్రిప్ పై డ్యూటీ నుంచి తిరిగి వచ్చాడు. వచ్చే సమయంలో తన భార్య చెప్పిన కొన్ని ఇంటి సామాన్లు కూడా తెచ్చాడు. కానీ ఆ సామాన్లలో కొన్ని మిస్ అయ్యాయి.

దీంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెరిగి మద్యం సేవించి ఉన్న దుర్గా తన భర్తను చితకబాదేసింది. గోళ్లతో రక్కేసింది, పళ్లతో కొరికేసింది.. ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నారాయణ్ పై యాసిడ్ విసిరింది. అదృష్టవశాత్తు యాసిడ్ అతని బట్టలపై మాత్రమే పడింది. ఆ తరువాత పరుగులు తీస్తూ నారాయణ్ పోలీస్ స్టేషన్ వెళ్లి తన భార్య దాడి చేసిందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దుర్గను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×