HBD Deepika Padukone.. ప్రముఖం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) హిందీలో ఎన్నో చిత్రాలలో నటించి, సూపర్ హిట్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక అలా బాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘కల్కి 2898AD’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Hassan), రాజేంద్రప్రసాద్(Rajendra Prasad)తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా ఈరోజు దీపికా పదుకొనే పుట్టినరోజు. ఈ నేపథ్యంలోని ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంత ఆస్తి కూడబెట్టింది? మొత్తం ఆస్తి విలువ ఎంత? ఎక్కడెక్కడ ఆమె ఆస్తులు ఉన్నాయి…?అనే వివరాలు వైరల్ గా మారుతున్నాయి.
దీపిక ఆస్తుల విలువ..
దీపిక పదుకొనే.. 2006లో ‘ఐశ్వర్య’ అనే సినిమాతో కన్నడ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ (Sharukh Khan) సరసన ‘ఓంశాంతిఓం’ అని సినిమా ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించింది. బాజీరావు మస్తానీ, పద్మావత్, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ప్రెస్ ఇలా సినిమాలు ఎన్నో దీపికాకు మంచి గుర్తింపును అందించాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దీపిక ఆస్తి దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్. తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. 2016లో ఒక్కో చిత్రానికి రూ.10 కోట్ల వరకు తీసుకున్న దీపిక, ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఆ రెమ్యూనరేషన్ రేంజ్ కాస్త పెంచేసిందని చెప్పవచ్చు.
ప్రమోటర్ గా మారిన దీపిక..
అలాగే పలు ప్రైవేట్ బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. ఇందుకుగానూ ఏడాదికి 8 కోట్ల రూపాయలు అందుకుంటుంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఈమె ఆస్తి దాదాపు 30% పెరిగినట్లు సమాచారం. 2022లో దీపికా పదుకొనే ఆస్తులు విలువ రూ.357 కోట్లు ఉండగా.. ఇప్పుడు దాని విలువ రూ.500 కోట్లు దాటింది అని సమాచారం. దీపికా పదుకొనే 2013లో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. దీని విలువ అక్షరాల రూ.16 కోట్లు. అలాగే ముంబైలోని బాంద్రాలో దాదాపు రూ.119 కోట్ల విలువైన ఇల్లు కూడా ఈమె కొనుగోలు చేసింది. అంతేకాదు బాలీవుడ్లో బడా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ ఇంటికి సమీపంలో ఈ ఇల్లు ఉండడం గమనార్హం.
దీపికా పదుకొనే కార్ కలెక్షన్స్..
దీపిక పదుకొనే దగ్గర రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇకపోతే స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టిందట. తాజాగా అందుతున్న నివేదిక ప్రకారం దీపికా దాదాపు రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈమె భర్త రణవీర్ సింగ్ (Ranveer Singh)కూడా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడిగా పేరు దక్కించుకున్నారు.ఈయన ఆస్తి విలువ రూ. 300 కోట్లు వుంటుందట. ఇలా మొత్తంగా ఇద్దరి ఆస్తి విలువ రూ.800 కోట్లు ఉంటుందని సమాచారం. ఇకపోతే వివాహం జరిగిన ఆరేళ్ల తర్వాత గత ఏడాది సెప్టెంబర్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక.. పాప ఆలనా పాలన చూసుకోవడానికి రెండేళ్లు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిందని సమాచారం.