Uday Kiran : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలతో బాగా ఫెమస్ అయిన హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఉదయ్ కిరణ్ అంటే అప్పటిలో అమ్మాయిలకు క్రష్.. అందుకే ఆయన పక్కన ఏ హీరోయిన్ నటించిన తెగ ఫీల్ అయ్యేవాళ్ళు. అయితే ఈ హీరో కేరీర్ స్టార్టింగ్ లో నటించిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. దాంతో ఈ హీరో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కథల ఎంపిక సరిగ్గా లేకపోవడంతో సినిమాలు వరుస ప్లాపులు పలకరించాయి. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయన మరణం ఇప్పటికి కళ్ళముందు కనిపిస్తుంది. అయితే ఉదయ్ కిరణ్ ను చనిపోయే ముందు ఒక స్టార్ హీరో కలిసి చెప్పిన చివరి మాటలు ఇన్నాళ్లకు వైరల్ అవుతున్నాయి.
సొట్టబుగ్గల సుందరాంగుడు హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తరవాత నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో సక్సస్ ని అందుకుని హ్యాట్రిక్ హీరోగా, లవర్ బాయ్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.. వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో పడటంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. అలా ఒక్కో సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్ లతో ఉదయ్ కిరణ్ కి ఆఫర్లు క్యూ కట్టాయి. అప్పట్లోనే ఉదయ్ అగ్ర హీరోలకు దీటుగా ఎదగడం ప్రారంభించాడు. అంతే కాకుండా స్టార్ డైరెక్టర్లు కూడా డేట్స్ కోసం ఎదరు చూసే స్థాయికి ఉదయ్ కిరణ్ చేరుకున్నాడు.. అయితే ఆయన ఎవరు ఊహించని విధంగా చనిపోయాడు. ఆ చివరి క్షణాల్లో అల్లరి నరేష్ కలిశారట.. ఆయనతో చెప్పిన మాటలే నరేష్ కు ఇంకా గుర్తుకు ఉన్నాయట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
చివరి రోజుల్లో ఉదయ్ కిరణ్ ను నరేష్ కలిశాడట.. ఎందుకు ఉదయ్ అలా డల్ గా ఉన్నావు అని ప్రశ్నించాను అని నరేష్ తెలియజేశాడు. నరేష్ ప్రశ్నకు సమాధానంగా ఉదయ్ కిరణ్ ఓ పేపర్ లో యంగ్ హీరో కథలు సరిగ్గా ఎంచుకోవడం లేదని రాశారని ఆవేదన వ్యక్తం చేశాడట. దానికి నరేష్ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు నీకు కాదు కదా.. నెక్స్ట్ సినిమాలు మంచివి చేద్దామని చెప్పాడు. ఆ తర్వాత ఒక పేపర్ ఇచ్చాడట.. కథలు సరిగ్గా ఎంచుకోకపోతే అతడికి కూడా ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే పడుతుందని ఆ పేపర్ లో రాశారని బాధపడ్డాడట. దాంతో నరేష్.. ఉదయ్ కిరణ్ ని చూసి ఉద్వేగానికి గురయ్యాడట. ఆ విషయంతో ఉదయ్ కిరణ్ ఎంతో డిప్రెషన్ లో ఉన్నాడని నరేష్ కి అర్థమైందని చెప్పాడు. ఇక ఉదయ్ కిరణ్ చనిపోయిన తరవాత అతడి మృతికి డిప్రెషన్ కూడా కారణమని నరేష్ ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు.. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అయ్యింది..