Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒక్కటిగా కొనసాగుతోంది. నిత్యం దేశ వ్యాప్తంగా సుమారు 20 వేల రైళ్లు తన రాకపోకలను కొనసాగిస్తున్నాయి. సుమారు 2.5 కోట్ల మందికి పైగా ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు చేరుతున్నారు. ఒకప్పుడు ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైలు ప్రయాణం ఇప్పుడు అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్ల వరకు చేరుకుంది. త్వరలో అత్యంత వేగంగా నడిచే వందేభారత స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. హైడ్రోజన్ రైళ్లు, దేశీ బుల్లెట్ ట్రైన్లు కూడా రూపొందుతున్నాయి.
లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు
దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను, పట్టణాలను కలుపుతూ రైల్వే మార్గాలు ఉన్నాయి. దేశంలో ఒకటి, రెండు రాష్ట్రాల్లోనే రైల్వే లైన్లు లేవు. ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడ రైల్వే మార్గాల నిర్మాణాలు కొనసాగలేదు.
1853లో పట్టాలెక్కిన తొలి రైలు
ఇక మనదేశంలో ఏప్రిల్ 16, 1853లో తొలిసారి రైలు పట్టాలెక్కింది. బ్రిటిషర్లు ఈ రైలును బొంబాయిలోని గోరి బందర్ రైల్వే స్టేషన్ నుంచి థానే వరకు ఈ తొలి ప్యాసింజర్ రైలు నడిచింది. ఈ రైలుకు 14 బోగీలు ఏర్పాటు చేశారు. మొత్తం 400 మంది ఈ రైలులో ప్రయాణించారు. అంతకు ముందు ముంబైలో గుర్రపు బగ్గీలు, ఎడ్లబండ్లు, రిక్షాల ద్వారా ప్రయాణాలు కొనసాగించే సమయంలో రైలు కూత వినిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Read Also: దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఏకబిగిన అన్ని కిలో మీటర్లు వెళ్తుందా?
ఆంగ్లేయుల కాలంలోనే రైల్వే విస్తరణ
ఆంగ్లేయులు తొలుత బొంబాయి, మద్రాస్, కలకత్తా నగరాల్లో రైల్వే లైన్లను విస్తరించారు. ఆ తర్వాత నెమ్మదిగా దేశ వ్యాప్తంగా రైల్వే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత భారత్ పాకిస్తాన్ విడిపోయాక రైల్వే లైన్లు కూడా రెండు ముక్కలు అయ్యాయి. ఇండియాలోని అన్ని రైల్వే లైన్లను కలిపి భారతీయ రైల్వే సంస్థగా మారింది ఇక తొలుత ఆవిరి ఇంజిన్లతో కూడిన రైళ్లు అందుబాటులోకి రాగా, రోజు రోజుకూ అభివృద్ధి చెందాయి. ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వేగవంతంగా నడిచే రైళ్లు రూపొందాయి. తొలుత ఆవిరితో నడిచే రైళ్లు పరిచయం అయ్యాయి. 1985 తర్వాత డీజిల్ లోకో మోటివ్ లు పరిచయం అయ్యాయి. నెమ్మదిగా దేశ వ్యాప్తంగా విద్యుదీకరణ జరిగింది. ప్రస్తుతం ఎక్కువగా విద్యుత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక దేశంలో 1995 తర్వాత కంప్యూటర్ ద్వారా రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే సంస్థ. ప్రస్తుతం రైల్వే సంస్థ పరిధిలో ఏకంగా 15 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సరుకు రవానాలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తున్నది.
Read Also: ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు.. ఒక్కో రైలు ఎన్ని వేల కిలో మీటర్లు వెళ్తుందో తెలుసా?
Read Also: అక్కడ అడుగు పెడితే ప్రాణాలు పోయినట్టే, దేశంలోనే భయంకరమైన ఘోస్ట్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా?