E-Paper
Advertisement

Longest Train Journeys: ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు.. ఒక్కో రైలు ఎన్ని వేల కిలో మీటర్లు వెళ్తుందో తెలుసా?

Longest Train Journeys: ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు.. ఒక్కో రైలు ఎన్ని వేల కిలో మీటర్లు వెళ్తుందో తెలుసా?
Advertisement

World’s Longest Ttrain Journeys: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన రైల్వే ప్రయాణాలు ఉన్నాయి. ప్రయాణీకులను మంత్రముగ్ధులను చేసేలా ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక అనుభవాలు, మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రయాణీకులను వేల కిలో మీటర్లు తీసుకెళ్లడంతో పాటు మర్చిపోలేని అనుభూతులను అందించే 7 అత్యంత పొడవైన రైల్వే ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ట్రాన్స్-సైబీరియన్ రైల్వే (రష్యా): ఈ రైల్వే ప్రయాణం సుమారు 9,289 కిలో మీటర్లు ఉంటుంది. ఇది మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు విస్తరించి ఉన్నది. ఉరల్ పర్వతాలు, ప్రశాంతమైన బైకాల్ సరస్సు, అద్భుతమైన అడవుల గుండా ఈ ప్రయాణం కొనసాగుతుంది. సుమారు 7 రోజుల పాటు ఈ జర్నీ ముందకుసాగుతుంది.

Advertisement

⦿కెనడియన్ (కెనడా): ఈ రైలు టొరంటో నుంచి వాంకోవర్ వరకు ప్రయాణిస్తుంది. 4,466 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణంలో  ప్రేరీలు, అద్భుతమైన సరస్సులు, రాకీ పర్వతాలు ప్రయాణీకులకు సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది.

⦿ ఇండియన్ పసిఫిక్ (ఆస్ట్రేలియా): ఇది సిడ్నీ నుంచి పెర్త్ వరకు ప్రయాణిస్తుంది. సుమారు 4,352 కి.మీ  దూరాన్ని కవర్ చేస్తుంది. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణం ఆస్ట్రేలియా తూర్పు నుంచి పశ్చిమ తీరం వరకు తీసుకెళుతుంది. ఈ  జర్నీ బ్లూ మౌంటైన్స్, విస్తారమైన ఎడారులు, ఐకానిక్ నుల్లార్బోర్ మైదానం మీదగా కొనసాగుతుది.

Advertisement

Read Also: దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఏకబిగిన అన్ని కిలో మీటర్లు వెళ్తుందా?

⦿ వివేక్ ఎక్స్‌ ప్రెస్ (భారత్): ఇది దాదాపు 4,200 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రయాణం పూర్తయ్యేందుకు సుమారు 75 గంటల సమయం పడుతుంది. ఇది 59 స్టేషన్లలో ఆగుతుంది. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 9 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. వివేక్ ఎక్స్‌ ప్రెస్ భారతదేశంలోని అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ ఈస్ట్రన్ & ఓరియంటల్ ఎక్స్‌ ప్రెస్ (ఆగ్నేయాసియా): ఇది బ్యాంకాక్ నుంచి సింగపూర్‌ వరకు ప్రయాణిస్తుంది. సుమారు 2,030 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ మూడు రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుంది. పచ్చని వర్షారణ్యాలు, విచిత్రమైన గ్రామాలు, సుందరమైన వరి పొలాల గుండా ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది.

Read Also:  ప్రపంచంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు.. ఇందులో మన స్టేషన్లు కూడా ఉన్నాయండోయ్!

⦿ క్వింఘై-టిబెట్ రైల్వే (చైనా): జినింగ్ నుంచి లాసా వరకు ప్రయాణిస్తుంది. సుమారు 1,956 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. 22 గంటల ప్రయాణంలో మంచుతో కప్పబడిన శిఖరాలు, టిబెటన్ పీఠభూమి అద్భుతమైన అందాలను చూపిస్తూ ముందుకు సాగుతుంది.

⦿బ్లూ ట్రైన్ (దక్షిణాఫ్రికా): ఇది ప్రిటోరియా నుంచి కేప్ టౌన్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు  ప్రయాణం 1,600 కి.మీ వరకు ఉంటుంది. సుమారు 31 గంటల ప్రయాణంలో పర్యాటకులు అద్భుతమైన ద్రాక్షతోటలు, బంగారు ఎడారులు, అద్భుతమైన తీరప్రాంతా గుండా ఈ ప్రయాణం కొనసాగుతోంది. ఇందులో ఫైవ్ స్టార్ వసతులు అందిస్తారు.

Read Also: పర్వత గర్భంలో నుంచి వెళ్లే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్.. దాన్ని దాటేందుకు ఎంత టైమ్ పడుతుందంటే?

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×