E-Paper
Advertisement

అంతరిక్షం నుంచే బుల్లెట్ రైళ్ల కంట్రోల్.. చైనా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

అంతరిక్షం నుంచే బుల్లెట్ రైళ్ల కంట్రోల్.. చైనా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

China Satellite-Controlled Rail System: ప్రపంచంలోనే అతిపెద్ద హై స్పీడ్ రైల్వే నెట్‌ వర్క్‌ లో ఒకటైన చైనా.. రైల్వే రంగంలో మరో వినూత్న అడుగు వేయడానికి రెడీ అవుతోంది. బుల్లెట్ రైళ్ల మెయింటెనెన్స్ ను మరింత అత్యాధునికంగా మార్చేందుకు కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే నేరుగా అంతరిక్షం నుంచి బుల్లెట్ రైళ్లను కంట్రోల్ చేసే వ్యవస్థను రెడీ చేస్తోంది.

సిగ్నలింగ్ వ్యవస్థకు గుడ్‌బై

ప్రస్తుతం చాలా దేశాల్లో హై స్పీడ్ రైళ్లను ట్రాక్‌ ల వెంట ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థల సహాయంతో పర్యవేక్షిస్తారు. రైలు ఎక్కడ ఉంది? ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? ముందు ట్రాక్ పరిస్థితి ఎలా ఉంది? లాంటి సమాచారాన్ని ఈ వ్యవస్థలు అందిస్తాయి. అయితే, చైనా రూపొందిస్తున్న కొత్త విధానంలో ఈ సంప్రదాయ పద్ధతికి బదులుగా ఉపగ్రహ సాంకేతికతను వినియోగించాలని భావిస్తోంది. స్పేస్ రైల్వేగా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ లో రైళ్ల కదలికలను నేరుగా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షిస్తారు. దీంతో రైలు ప్రయాణానికి సంబంధించిన సమాచారం క్షణక్షణం అందుబాటులో ఉంటుంది. రైలు ఎక్కడ ఉందో? ఏ వేగంతో వెళ్తోందో?  రూట్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో? వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

రైల్వే భద్రత మరింత మెరుగు

Advertisement

ఈ కొత్త వ్యవస్థతో రైల్వే భద్రత మరింత మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రైళ్ల కదలికలను మరింత కచ్చితంగా గుర్తించడం ద్వారా ప్రమాదాల అవకాశాలను తగ్గించవచ్చు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే అవకాశం కూడా పెరుగుతుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ట్రాక్‌ల పక్కన పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే సిగ్నలింగ్ పరికరాలపై ఆధారపడటం తగ్గుతుంది. ప్రస్తుతం ఈ పరికరాల నిర్వహణకు భారీ ఖర్చు అవుతోంది. ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ అందుబాటులోకి వస్తే నిర్వహణ వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణ అవసరం కూడా తగ్గుతుంది.

రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడం కూడా ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. రైళ్ల మధ్య దూరం, వేగం లాంటి అంశాలను మరింత సమర్థవంతంగా నియంత్రించడం ద్వారా ఒకే మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడిపే అవకాశం ఏర్పడుతుంది.  ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చు.

ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్

Advertisement

చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన బుల్లెట్ రైలు వ్యవస్థను కలిగి ఉంది. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ నెట్‌ వర్క్‌ లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇలాంటి భారీ వ్యవస్థను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపగ్రహ సాంకేతికత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అమల్లోకి వస్తే రైల్వే రంగంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది.

Read Also: స్వదేశీ బుల్లెట్ రైలు వస్తోంది.. 2027లో పరుగులు.. స్పీడ్ ఎంతో తెలుసా?

Related News

ఒక రైల్ ఇంజిన్ ఎన్ని బోగీలను లాగగలదు.. రైల్వే బోగీల సంఖ్య ఎందుకు పెంచదు?

పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!

సికింద్రాబాద్–వరంగల్ మార్గంలో నాలుగు రైళ్లు రద్దు, ఎప్పుడంటే?

రైలు 9 గంటలు లేట్.. ప్రయాణికుడికి రూ.35 వేల పరిహారం.. అసలు ఏం జరిగిందంటే?

20 గంటల ప్రయాణం ఇక 7 గంటలే.. మరో బుల్లెట్ రైలు కారిడార్ కు గ్రీన్ సిగ్నల్!

రూ.50,000 బడ్జెట్‌లో ఫారిన్ టూర్.. ఫ్రెండ్స్‌తో కలిసి మలేషియా ట్రిప్ ఇలా ఎంజాయ్ చేయండి

తెలంగాణకు గుడ్ న్యూస్.. కొత్త రైల్వే లైన్ వచ్చేస్తోంది!

దీపావళికి ముందే రెండో వందే భారత్ స్లీపర్ ఎంట్రీ.. ఏ రూట్ లో పరుగులు తీస్తుందంటే?

Big Stories

Advertisement
×