E-Paper
Advertisement

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు
Advertisement

Punjabi Comedy Movie: కామెడీ సినిమాలు అంటే కేవలం నవ్వులు పంచడమే కాదు.. మంచి కథ, బలమైన స్నేహం, ఎమోషన్స్ కూడా ఉంటే ఆ సినిమా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. అలాంటి చిత్రాల్లో పంజాబీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫ్రాంచైజీ ‘చల్ మేరా పుత్’ ఒకటి. ఇప్పటికే వచ్చిన మూడు భాగాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించగా, ఇప్పుడు నాలుగో భాగం ‘Chal Mera Putt 4’ కూడా అదే మ్యాజిక్‌ను కొనసాగించింది. 2025లో థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పరాయి దేశంలో బతుకుదెరువు కోసం పోరాడే వలసదారుల జీవితాన్ని నవ్వులతో, భావోద్వేగాలతో చూపించిన ఈ చిత్రం కుటుంబం మొత్తం కలిసి చూసేలా రూపొందింది. మరి ఈ క్రేజీ కామెడీ కథను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

లండన్‌లో చట్టబద్ధమైన పత్రాలు లేకుండా జీవిస్తున్న కొందరు భారతీయులు, పాకిస్తానీయులు తమ కుటుంబాల కోసం కష్టపడి చిన్న చిన్న పనులు చేస్తూ రోజులు గడుపుతుంటారు. వీసా గడువు ముగిసినా స్వదేశానికి వెళ్లలేని పరిస్థితుల్లో, ఎప్పుడు పోలీసులు పట్టుకుంటారో అనే భయంతోనే వారి జీవితం సాగుతుంది. అయినా ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ స్నేహాన్ని మాత్రం వదులుకోరు.

Advertisement

రోజువారీ ఖర్చులకే ఇబ్బంది పడుతున్న ఆ స్నేహితుల జీవితంలో ఒకరోజు ఊహించని సంఘటన జరుగుతుంది. వారికి అనుకోకుండా ఒక బ్యాగ్ దొరుకుతుంది. మొదట దాన్ని నార్మల్ బ్యాగ్ అనుకున్నా, తెరిచి చూడగానే అందులో ఒక మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.10 కోట్ల విలువైన నగదు ఉండటాన్ని చూసి షాక్ అవుతారు. ఇంత పెద్ద మొత్తం చేతికి రావడంతో వారి జీవితమే మారిపోతుందని భావిస్తారు.

కానీ అసలు సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది. ఆ డబ్బు ఎవరిది ? దాన్ని వెతుకుతున్న వారు ఎవరు ? పోలీసులు, క్రిమినల్ గ్యాంగులు ఒకేసారి వారి వెంటపడటంతో పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారుతుంది. ఆ డబ్బును దాచాలా ? తిరిగి ఇవ్వాలా ? లేక తీసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలా ? అనే సందిగ్ధంలో పడిన స్నేహితులు చేసే ప్రతి ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు మరో అబద్ధం చెప్పడం, దాని వల్ల మరిన్ని సమస్యలు రావడం, చివరకు అందరూ చిక్కుల్లో పడటం కథను మరింత వినోదాత్మకంగా మారుస్తుంది.

Advertisement

ఈ ప్రయాణంలో స్నేహం విలువ ఏమిటి ? డబ్బు కోసం మనుషులు ఎంతవరకు వెళ్తారు ? పరాయి దేశంలో జీవించే వలసదారుల కష్టాలు ఎలా ఉంటాయి ? అనే అంశాలను దర్శకుడు కామెడీతో పాటు హృదయానికి హత్తుకునేలా చూపించాడు. చివరికి ఆ రూ.10 కోట్ల బ్యాగ్ ఎవరి చేతికి చేరింది ? స్నేహితులు అన్ని సమస్యల నుంచి బయటపడ్డారా ? అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ ?

ఈ సినిమాకు ప్రధాన బలం సహజమైన కామెడీ. అమ్రీందర్ గిల్, సిమి చాహల్‌తో పాటు ఇఫ్తికార్ ఠాకూర్, నసీర్ చినూతి, అక్రమ్ ఉదాస్, హర్దీప్ గిల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. వీళ్ళు తమ కామెడీ టైమింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని మరింత ఆకట్టుకునేలా చేశారు. నవ్వులు పంచుతూనే వలసదారుల జీవితాల్లోని కష్టాలు, కుటుంబాల కోసం వారు పడే బాధలను ఎక్కడా అతిశయోక్తి లేకుండా చూపించారు. అందుకే ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక అభిమాన వర్గం ఏర్పడింది.

ప్రస్తుతం ఈ సినిమా Chaupal ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఒరిజినల్ పంజాబీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. Amazon Prime Video Channels ద్వారా ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు కూడా ఈ సినిమాను చూడవచ్చు. ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే, ఈ ఫీల్‌గుడ్ కామెడీ డ్రామాను తప్పకుండా వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోండి.

Read Also: కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×