E-Paper
Advertisement

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!
Advertisement

Once More: తమిళ నటుడు అర్జున్ దాస్, దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ జంటగా నటిస్తున్న ‘వన్స్ మోర్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో సినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

రొమాంటిక్ హీరోగా అర్జున్ దాస్

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అర్జున్ దాస్, అదితి శంకర్ జోడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా విలన్ పాత్రల్లో కనిపించిన అర్జున్ దాస్.. ఈసారి మాత్రం పూర్తి స్థాయి రొమాంటిక్ హీరోగా కనిపించబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదితి శంకర్‌పై భారీ అంచనాలు

Advertisement

అదితి శంకర్ కూడా వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా నేచురల్‌గా ఉంటుందని, అర్జున్ దాస్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని మూవీ టీమ్ చెబుతోంది.

ఈ సినిమాకు విఘ్నేశ్ శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలిసిన కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

హేషమ్ మ్యూజిక్ మరో హైలైట్

Advertisement

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ కూడా మెయిన్ ఎసెట్ అనే చెప్పాలి. ‘హృదయం’, ‘హాయ్ నాన్న’ సినిమాలకు అద్భుతమైన సంగీతం ఇచ్చిన ఆయన, ఇప్పుడు ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతుండటం విశేషం.ఇక ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో మ్యూజిక్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

also read :ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

సోనా ఒలికల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందించగా, నాష్ ఎడిటింగ్ చేశారు. రాజ్ కమల్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మిలియన్ డాలర్ స్టూడియోస్ బ్యానర్‌పై యువరాజ్ గణేశన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందా?

రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. “అర్జున్ దాస్‌ను లవర్ బాయ్‌గా చూడాలని ఉంది”, “హేషమ్ మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తున్నాం”, “ఈ జోడీకి హిట్ ఖాయం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బజ్‌ను చూస్తుంటే ఆగస్టు 28న విడుదలయ్యే ‘వన్స్ మోర్’ మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.చూడాలి ఈ సినిమాతోనైనా అదితి శంకర్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ చూస్తుందో లేదో !

Tags

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×