Train Dirty Photo: ఆకాశాన్ని తాకే టవర్లు, పక్కాగా క్లీన్ గా కనిపించే మెట్రో స్టేషన్లు, వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ ట్రెయిన్లు. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో చైనా ఒకటి. అక్కడ ఉన్న కట్టడాలు, టెక్నాలజీ, ప్రజా రవాణా వ్యవస్థ అన్నీ చూస్తే.. ఇది నిజంగా మనకంటే పదేళ్ల ముందే ఉందనిపిస్తుంది. కానీ ఈ ఫోటో చూస్తే.. అసలు అభివృద్ధి అంటే ఏంటి? బయట కనిపించేదే అభివృద్ధా? లోపల దాగిన అసలు సత్యాన్ని చూసే సామర్థ్యం ఉందా మనకు? అసలు నిజం తెలుసుకుంటే.. మనమే బెస్ట్ అనేస్తారు.
చైనాలోని ఒక సాధారణ రైలు బయట మాత్రం సూపర్.. లోపలికి తొంగి చూస్తే డూపర్ అనేస్తారు. ఎందుకంటే అక్కడి ట్రైన్స్ లోపలి పరిస్థితి అంతా వేరే. నీటిబాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, వాడిన ప్లాస్టిక్ స్పూన్లు, నూనె బొత్తులు, బిస్కట్ కవర్లు.. ఫ్లోర్ అంతా చెత్తతో నిండిపోయి కనిపిస్తాయట. రైల్వే ప్రయాణికులు మాత్రం తినే పని పూర్తయ్యాక తమ చెత్తను అక్కడికక్కడే పడేసి మొబైల్‌లో మునిగిపోతారట.
చెత్తకుప్పల మధ్య ప్రయాణం
చైనా రైలు ఫోటోను ఒక పర్యాటకుడి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇది సాధారణ ఓపెన్ సిటింగ్ రైలు కావొచ్చు. కానీ ఆ భయానక దృశ్యం చూస్తే, ఇది గదిలో కాకుండా డంపింగ్ యార్డులో ఉన్నట్టే ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనదేశంలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయనే వాదన తప్పు కాదు. కానీ చైనాను చాలామంది ఒక ‘క్లీన్ మోడల్’గా చూసే పరిస్థితిలో, ఈ ఫోటో నిజంగా షాక్‌కు గురి చేస్తుంది.
సాంకేతికంగా అభివృద్ధి.. కానీ మానవత్వంలో?
చైనాలో బుల్లెట్ ట్రెయిన్లు గంటకు 350 కిలోమీటర్లు వెళ్తాయి. AI ఆధారిత ట్రాఫిక్ మానిటరింగ్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, నగరాల మధ్య హైస్పీడ్ కనెక్షన్స్.. ఇవన్నీ ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా తమ చుట్టూ ఉన్న పరిసరాలపై ప్రజల అవగాహన లేకుంటే, ఆ టెక్నాలజీకి విలువ ఎంత? మనిషి మానసిక అభివృద్ధి లేకుండా, యంత్రాల అభివృద్ధి ఒక్కటే దేశాన్ని ముందుకు నడిపించగలదా?
Also Read: Make In India Metro: వేగంగా తయారవుతున్న మెట్రో కోచ్‌లు.. విలువ కోట్లలో.. ఏ రాష్ట్రానికో తెలుసా?
పై ఫోటోలోని యువకుడు మొబైల్‌లో మునిగిపోయాడు. అతని కాళ్ల కింద ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, చెత్త కప్పులు ఉన్నా అతనికి పట్టనట్లుంది. ఇది కేవలం అతని సమస్య కాదు. ఇది కలసి ఉండే సమాజం వైఫల్యం.
ప్రపంచానికి అద్దంగా మారే ఫోటో
ఈ ఫోటో చూసి చైనాను తప్పు పట్టడమే కాదు.. మనం కూడా ఆలోచించాలని నెటిజన్స్ అంటున్నారు. మన దేశంలో స్వచ్ఛ భారత్ వంటి ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఇదే సామాజిక స్థితిగతులు మనకూ ఉన్నాయి. కానీ మారేందుకు అవగాహన అవసరం. చైనా ఒక వైపు మారుతున్నా, పౌరుల్లో ఆ మార్పు ఎంత వరకు అర్థమైందో ఈ ఫోటోనే చెబుతోంది.
అభివృద్ధి అంటే శుభ్రతతో మొదలవుతుంది
ఒక దేశ అభివృద్ధి లౌడ్ స్పీకర్లపై ప్రసారం కాదు.. ఫ్లోర్‌పై పడిన చెత్త ఎత్తే చేతిలో ఉంటుంది. ప్రజలు నైతిక బాధ్యతతో ప్రవర్తిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. చైనా ఫోటో ఒక బలమైన గుర్తింపు.. మెరిసే ఊహలకు అంతరంగపు దుప్పటి ఎలా ఉండవచ్చో చూపింది. మనం కూడా ఈ సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అభివృద్ధి టెక్నాలజీతో కాదు.. మానవత్వంతో మొదలవుతుంది.
Not everything in China is fancy or glittery. pic.twitter.com/7eu7UJ3c7g
— Indian Tech & Infra (@IndianTechGuide) August 4, 2025