Tamannaah Bhatia: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి తమన్నా(Tamannaah) ఒకరు. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె హ్యాపీ డేస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. తదుపరి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళంతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం పాటు మనగడ ఉండాలి అంటే నటనలో నైపుణ్యంతో పాటు , అందం కూడా ఎంతో ముఖ్యమని చెప్పాలి. అందుకే హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
తమన్నా బ్యూటీ సీక్రెట్ ఇదేనా?
ఇక తమన్నా సైతం తన అందానికి తరచూ మెరుగులు దిద్దుతూ ఉంటారని చెప్పాలి. అయితే తన బ్యూటీ సీక్రెట్(Beauty Secrets) ఏంటో తాజాగా ఈమె ఒక సందర్భంగా బయటపెట్టారు. తన చర్మం అందంగా మరింత కాంతివంతంగా ఉండటానికి, మొహం పై మొటిమలు మచ్చలు రాకుండా ఉండటానికి గల కారణాన్ని ఈమె తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మన ఉమ్మితో(saliva) మొహానికి మసాజ్ చేయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి అంటూ తమన్న బ్యూటీ సీక్రెట్ చెప్పారు. వినడానికి ఇది కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తమన్న చెప్పిన విషయంలో నిజం ఉందని దీని వెనుక సైన్స్ కూడా ఉందని తెలియజేశారు.
ఉమ్మితో అందం పెంపు..
మనం ఉదయం లేవగానే మన ఉమ్మిలో యాంటీ బ్యాక్టీరియాలు వృద్ధి చెంది ఉంటాయని తెలిపారు. ఇవి మన చర్మంపై ఉన్న మొటిమలతో పోరాడి మొటిమలు మచ్చలు రాకుండా ఎంతగానో సహాయపడుతుందని తెలియజేశారు. ఇది ఎంతో సహజ సిద్ధమైన చిట్కా అని ఈమె తెలియజేశారు. మన నిద్రపోయే సమయంలో మన లాలాజలంలో ఎంతో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఉదయం లేవగానే బ్రష్ చేయకూడదని తెలిపారు. ఏది ఏమైనా తమన్నా స్టార్ హీరోయిన్ స్థాయిలో ఈ విధమైనటువంటి చిట్కా చెప్పడంతో ఇది కాస్త సంచలనగా మారింది.
సహజ సిద్ధమైన చిట్కా…
ఇక తమన్నా చెప్పిన ఈ చిట్కా పై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు అయితే సైన్స్ ప్రకారం చూస్తే తమన్నా చెప్పింది వాస్తవమే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున కెమికల్స్ వాడుతూ ఎన్నోరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు కానీ తమన్న మాత్రం చాలా సహజ సిద్ధమైన చిట్కాని చెప్పడంతో కొంతమేర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమన్నా సినిమాల విషానికి వస్తే ఇటీవల ఓదెలా 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఈమె పెద్ద ఎత్తున లవ్ బ్రేక్, పెళ్లి వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన వ్యక్తితో పెళ్లి జరగబోతుందని వార్తలు రావడంతో ఈ వార్తలను ఖండించారు. అయితే ఈమె గత రెండు సంవత్సరాలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma)ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. ఇటీవల వీరి మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తుంది. అయితే బ్రేకప్ వార్తలు గురించి తమన్న ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం .
Also Read: Niharika: గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగా డాటర్.. గెస్ చేయమంటున్న నిహారిక?