E-Paper
Advertisement

బ్రిక్స్ కోసం ఢిల్లీకి భారీ భద్రత.. రోడ్లే కాదు, ఎయిర్ స్పేస్ పైనా పరిమితులు!

బ్రిక్స్ కోసం ఢిల్లీకి భారీ భద్రత.. రోడ్లే కాదు, ఎయిర్ స్పేస్ పైనా పరిమితులు!
Advertisement

Delhi Traffic Advisory Today: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. ఈ అంతర్జాతీయ సమావేశానికి పలువురు దేశాధినేతలు, ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరవుతుండటంతో కీలక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సదస్సు కారణంగా నగరంలోని 35కి పైగా ప్రధాన రహదారులు, కీలక మార్గాలపై ట్రాఫిక్ ప్రభావం ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. అవసరాన్ని బట్టి వాహనాలను దారి మళ్లించే అవకాశం ఉందన్నారు.

అంతర్జాతీయ అతిథులతో ఢిల్లీలో సందడి!

భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సు కోసం ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రముఖ నాయకులు ఢిల్లీకి వచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సహా పలువురు నేతలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తున్నారు.

బ్రిక్స్ ఆర్థిక సహకారంపై దృష్టి

Advertisement

బ్రిక్స్ సమావేశాల్లో రాజకీయ అంశాలతో పాటు ఆర్థిక సహకారానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. సభ్య దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలను పెంచడం, వాణిజ్య సంబంధాలను విస్తరించడం అవసరమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు.  వ్యాపార సంస్థలు కొత్త భాగస్వాములను గుర్తించడం, వివిధ మార్కెట్లకు చేరుకోవడం, సరఫరా వ్యవస్థలను అనుసంధానం చేసుకోవడం సులభతరం చేయడమే ఉమ్మడి లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

విదేశీ నేతల పర్యటన దృష్ట్యా ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా సుమారు 15 వేల మంది పోలీసు సిబ్బందితో పాటు 200 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘాను పెంచేందుకు 500కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో హై-రిజల్యూషన్, ప్రత్యేక నిఘా కెమెరాలు కూడా ఉన్నాయి.

విమానాలపైనా ఆంక్షలు

Advertisement

భద్రతా చర్యలు రహదారులకే పరిమితం కాలేదు. ఢిల్లీ విమానాశ్రయం పరిసరాల్లో కూడా గగనతల ఆంక్షలు అమలు చేశారు. సెప్టెంబర్ 13 వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షెడ్యూల్ చేయని విమాన సర్వీసులపై పరిమితులు విధించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నారు. మరోవైపు, అత్యవసర అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఢిల్లీ వాసులకు సూచించారు.

Read Also: ఆరేళ్ల తర్వాత భారత్‌కు చైనా విమానాలు.. సెప్టెంబర్ 21 నుంచి గ్వాంగ్‌జౌ–ఢిల్లీ సర్వీసులు షురూ!

Tags

Related News

ఆరేళ్ల తర్వాత భారత్‌కు చైనా విమానాలు.. సెప్టెంబర్ 21 నుంచి గ్వాంగ్‌జౌ–ఢిల్లీ సర్వీసులు షురూ!

చాక్లెట్ పిరమిడ్లు.. మ్యాట్రియోష్కా బొమ్మలు.. బ్రిక్స్ అతిథులకు ఢిల్లీ హోటళ్లలో రాయల్ ట్రీట్!

పుతిన్ ‘రష్యా వన్’ vs జిన్‌పింగ్ బోయింగ్ 747.. ఎవరి విమానం ఖరీదైనదో తెలుసా?

జాబ్ వెతకడానికి ఇకపై నేరుగా దుబాయ్ వెళ్లిపోవచ్చు.. కొత్త వీసా ఇదిగో.. స్పాన్సర్ అవసరం లేదు

ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

రైలు వాష్ రూమ్ లో యువతి, యువకుడు.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

రైలులో ప్రమాదవశాత్తు కిందపడినా ఇక పరిహారం.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

Big Stories

Advertisement
×