Irumudi OTT streaming: మాస్ మహారాజా రవితేజ (Raviteja )హీరోగా , శివా నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇరుముడి(Irumudi ). గత నెల ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను కూడా అలరించడానికి సిద్ధమైంది. ఈ మేరకు సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ అధికారికంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడిస్తూ.. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన చిత్రం ఇరుముడి. రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ అందుకుంటుంది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18వ తేదీ నుండి అనగా శుక్రవారం నుండి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళ్ ,కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. మొత్తానికి అయితే థియేటర్లలో వరుస కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీ లో ఎలాంటి రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఇరుముడి మూవీ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీలేరు దగ్గర్లో ఉన్న ఒక పల్లెటూరులో త్రినాథ్ (రవితేజ), తన భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణి (బేబీ నక్షత్ర) తో కలసి ఒక సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. త్రినాథ్ అయ్యప్ప స్వామి భక్తుడు. అందుకు తగ్గట్లే ప్రతి ఏడాది కూడా మాల వేస్తూ ఉంటాడు. మరొకవైపు ఊర్లో ఒక రౌడీ గ్యాంగ్ బాగా రెచ్చిపోతూ ఉంటుంది. జనాలను ఇబ్బంది పెట్టడం, స్కూల్ కి వెళ్లే అమ్మాయిలను వేధించడమే వాళ్ళ పని. దీక్షలో లేనప్పుడు మందు తాగడం, అదే టైంలో ఊర్లోని రౌడీలతో గొడవలు దిగడం లాంటివి చేస్తూ ఉంటాడు త్రినాథ్. ఈయన కూతురు మణికి , గాయత్రి విషయంలో ఏదో తేడా జరుగుతోందని అనుమానం వస్తుంది. గాయత్రి ఎవరో కాదు గురు స్వామి (సాయికుమార్) కూతురు. ఈ విషయం తన నాన్నకు చెప్పాలని మణి ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోతుంది.
also read: ఘనంగా సైమా 2026 అవార్డ్స్ వేడుక.. సత్తాచాటిన తెలుగు మూవీస్!
ఊరి బయట కానీ.. ఊరి లోపల కానీ.. స్కూల్ లోపల కానీ స్కూల్ బయట కానీ ఏది జరిగినా పూసగుచ్చినట్టు తన తండ్రికి చెప్పే మణి.. గాయత్రి విషయంలో ఎందుకు తన తండ్రి దగ్గర వెనకడుగు వేసింది? ఒకరోజు రాత్రి గాయత్రి అర్ధరాత్రి దాటినా ఇంటికి రాదు.. అసలు ఆమెకు ఏమైంది? త్రినాధ్ ఆమెను వెతికి పట్టుకున్నాడా? ఆ రౌడీలకు తగిన బుద్ధి చెప్పాడా? ముఖ్యంగా స్కూల్లో ఊహించని హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ బాలికల హత్య వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి ? ఇలా మిగతాది సినిమా స్టోరీ. మొత్తానికైతే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.