E-Paper
Advertisement

యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ సీక్రెట్స్..వీడియో అప్‌లోడ్ చేసేముందు ఇవి తెలుసుకోండి!

యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ సీక్రెట్స్..వీడియో అప్‌లోడ్ చేసేముందు ఇవి తెలుసుకోండి!
Advertisement

YouTube channel tips for beginners: ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్ ఉన్న ఈ రోజుల్లో, సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ రన్ చేయాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. పాపులారిటీతో పాటు మంచి సంపాదన కూడా ఉండటంతో యూట్యూబ్ వైపు అడుగులు వేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే..గతంతో పోలిస్తే ప్రస్తుతం యూట్యూబ్ అల్గారిథమ్ పూర్తిగా మారిపోయింది. కోట్లాది మంది క్రియేటర్ల మధ్య మీ వీడియోలకు వ్యూస్ రావాలంటే.. కేవలం వీడియో తీసి అప్‌లోడ్ చేస్తే సరిపోదు. మీరు సక్సెస్ కావాలంటే.. ఛానెల్ స్టార్ట్ చేయడానికి ముందే ఈ 7 కీలక విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

1.  టాపిక్ సెలెక్షన్:

మీ ఛానెల్ ఏ జోనర్‌కి చెందిందో ముందుగానే డిసైడ్ చేసుకోండి. టెక్, కుకింగ్, వ్లాగింగ్, ఎడ్యుకేషన్ లేదా ఎంటర్‌టెయిన్‌మెంట్.. ఇలా ఏదో ఒక నిర్దిష్టమైన టాపిక్‌పై ఫోకస్ చేయాలి. అప్పుడే యూట్యూబ్ అల్గారిథమ్ మీ టార్గెట్ ఆడియన్స్‌ని కరెక్ట్ చేసి మీ వీడియోలను వాళ్లకి రికమండ్ చేస్తుంది.

2. టార్గెట్ ఆడియన్స్ ఎవరనే స్పష్టత:

Advertisement

మీరు చేసే వీడియోలు ఎవరి కోసం? టీనేజర్ల కోసమా? మహిళల కోసమా? లేక టెక్ లవర్స్ కోసమా? మీ ఆడియన్స్ ఎవరో మీకు స్పష్టంగా తెలిస్తే, వాళ్ళకి ఏ రకమైన కంటెంట్ నప్పుతుందో అర్థం చేసుకుని ఆ రీతిలో వీడియోలను ప్లాన్ చేసుకోవచ్చు.

3. కంటెంట్ క్వాలిటీ ముఖ్యం:

చాలా మంది ఖరీదైన కెమెరాలు, మైకులు కొంటేనే సక్సెస్ అవుతామని భ్రమపడతారు. కానీ ప్రస్తుత ట్రెండ్ ప్రకారం కంటెంట్ క్వాలిటీ, స్టోరీ టెల్లింగ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ వాల్యూ మాత్రమే ముఖ్యం. మీ దగ్గర ఉన్న స్మార్ట్‌ ఫోన్‌తోనే అద్భుతమైన వీడియోలు తీయొచ్చు.

4.ఎస్ఈఓ, కీవర్డ్ రీసెర్చ్:

Advertisement

మీ వీడియో ఎంత బాగున్నా.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయకపోతే వ్యూస్ రావు. వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్‌లో సరైన కీవర్డ్స్ వాడటం చాలా ముఖ్యం. గూగుల్, యూట్యూబ్ సర్చ్ అల్గారిథమ్‌కి తగినట్లుగా ఎస్ఈఓ చేయడం నేర్చుకోండి.

5. థంబ్‌నెయిల్ పవర్:

యూట్యూబ్‌లో ఒక వీడియో క్లిక్ కావడానికి థంబ్‌నెయిల్ 90 శాతం కారణమవుతుంది. అట్రాక్టీవ్ కలర్స్, క్లియర్ టెక్స్ట్, క్యూరియాసిటీ కలిగించే ఇమేజ్‌లతో మీ థంబ్‌నెయిల్ డిజైన్ ఉండాలి. జనాలు స్క్రోల్ చేసేటప్పుడు మీ థంబ్‌నెయిల్ చూసి వెంటనే క్లిక్ చేసేలా ఉండాలి.

6. కన్సిస్టెన్సీ :

యూట్యూబ్‌లో సక్సెస్ కావడానికి అతి పెద్ద మంత్రం కన్సిస్టెన్సీ. రోజుకో వీడియో లేదా వారానికి ఇన్ని వీడియోలు అని ఒక పక్కా షెడ్యూల్ పెట్టుకోండి. క్రమం తప్పకుండా వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటేనే.. యూట్యూబ్ మీ ఛానెల్‌ని ప్రమోట్ చేస్తుంది.

Also Read: రూ.1799కే 54 గంటల బ్యాటరీనా? మ్యూజిక్ లవర్స్‌ని ఊపేస్తున్న మోడల్!

7. వ్యూవర్స్ ఫీడ్‌బ్యాక్ & ఎనలిటిక్స్:

మీ వీడియోలకు వచ్చే కామెంట్స్‌ని చదవండి. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో గమనించండి. అలాగే ‘YouTube Studio’ అనలిటిక్స్ చెక్ చేసి, ఏ వీడియోస్ ఎక్కువ వ్యూస్ తెస్తున్నాయో అనలైజ్ చేసుకుంటూ మీ కంటెంట్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోండి.

ఈ అంశాలను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్తే, ఒక విజయవంతమైన యూట్యూబర్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. మీ కష్టానికి సరైన ప్రణాళిక తోడైతే సక్సెస్ మీ సొంతమవుతుంది.

Related News

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే.. ఈ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే!

ల్యాప్ టాప్‌లో స్క్రీన్ షాట్ తీయడం ఎలా? ఈ 5 ఈజీ షార్ట్‌కట్స్ మీకు తెలుసా?

రూ.1799కే 54 గంటల బ్యాటరీనా? మ్యూజిక్ లవర్స్‌ని ఊపేస్తున్న మోడల్!

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×