Polavaram District: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు స్టూడెంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని గర్భం దాల్చడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ముగ్గురు అధికారులపై వేటు పడింది ప్రభుత్వం. ఈ ఘటన పోలవరం జిల్లాలో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది?
విద్యార్థుల పాలిట కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారుతున్నారు. తమకు పిల్లలు ఉన్నారన్న విషయం మరిచిపోయి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. కొందరు టీచర్లు.. కామాంధులకు సహకరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది బిగ్ టీవీ.
ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనికి సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, వార్డెన్‌తోపాటు తరగతి ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు వేశారు. రంప చోడవరం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రుక్మండయ్య.. శనివారం రాత్రి ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెన్షన్‌కు గురైన వారిలో ప్రధానోపాధ్యాయురాలు శాంతమతి, వార్డెన్ విజయ, మరో ఉపాధ్యాయురాలు లోవమ్మ ఉన్నారు. విద్యార్థిని గర్భం ఘటనపై విచారణ కొనసాగుతోందని, పూర్తిస్థాయి విచారణ అనంతరం మరికొందరు సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ALSO READ: డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్
పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది ఓ బాలిక. అయితే కొద్దిరోజులుగా ఆ విద్యార్థిని తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరకు బాలిక గర్భవతి అయినట్టు తేలింది. వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో ఈ విషయం బిగ్ టీవీ బట్టబయలు చేసింది. ఈ విషయం తెలియగానే బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ వ్యవహారంపై అడ్డతీగల సీడీపీవోకు ఫిర్యాదు చేశారు. ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న వంట సిబ్బందిలో ఒకరు.. బాలిక గర్భానికి కారణమైనట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సివుంది.