E-Paper
Advertisement

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య స్పెషల్ రోల్ ? .. తెరపై తండ్రి-కొడుకుల మాస్ జాతర!

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య స్పెషల్ రోల్ ? .. తెరపై తండ్రి-కొడుకుల మాస్ జాతర!
Advertisement

Mokshagna Debut:అదిగో వస్తున్నాడు ..ఇదిగో వస్తున్నాడు అంటూ ఎంతగానో ఊరించిన నందమూరి మోక్షజ్ఞ ఎట్టకేలకి సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. బింబిసారతో సూపర్ హిట్ కొట్టి విశ్వంభరతో పలకరించేందుకు సిద్దమైన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తుందని ఇప్పటికే అప్ డేట్ వచ్చేసింది కూడా .ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన మరో క్రేజీ అప్ డేట్ ఇపుడు నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది.

తొలి సినిమాలోనే నందమూరి బాలకృష్ణ

Advertisement

అవును.. మోక్షజ్ఞ హీరోగా నటించబోయే తొలి సినిమాలోనే నందమూరి బాలకృష్ణ కూడా కనిపించబోతున్నారన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.ఇదొక చిన్న క్యామియోలా ఉండదని సినిమాలో ఏకంగా కథని మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్‌లో బాలయ్య కనిపించబోతున్నాడన్నటాక్ వినిపిస్తోంది.

స్క్రీన్ టైమ్ దాదాపు 40 నిమిషాల వరకు

Advertisement

ఫిలిం నగర్ సర్కిల్స్ లో వస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో బాలయ్య స్క్రీన్ టైమ్ దాదాపు 40 నిమిషాల వరకు ఉంటుందట. సాధారణంగా స్టార్ హీరోలు తమ పిల్లల మొదటి సినిమాల్లో కనిపించడం చూస్తూనే ఉంటాం. కానీ వశిష్ఠ మాత్రం బాలకృష్ణ పాత్రను కేవలం ఒకటి రెండు సీన్లకు పరిమితం చేయకుండా, కథ మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఇంపాక్ట్ చూపించేలా ప్లాన్ చేయడం ఇక్కడ విశేషం. హీరో క్యారెక్టర్‌కు సంబంధించిన ఒక సీక్రెట్‌ను రివీల్ చేసే సీన్‌లో బాలయ్య ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.

సినిమా రేంజ్ మారడం పక్కా 

ఇక మోక్షజ్ఞ విషయానికి వస్తే, మేకర్స్ ఆయనను చాలా గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఒక స్టార్ కొడుకుగా మాత్రమే కాకుండా, తన ఓన్ టాలెంట్, లుక్, స్టైలిష్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించేలా ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో తన సత్తా చూపాలని మోక్షజ్ఞ కూడా గట్టిగానే కష్టపడుతున్నారట. ఇక దీనికి తోడు బాలకృష్ణ లాంటి స్టార్ హీరో యాడ్ అయితే ఆ సినిమా రేంజే మారిపోతుందని చెప్పక్కర్లేదు.

ఏది ఏమైనా థియేటర్లలో తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు మాంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. దానికి తోడు వశిష్ఠ మార్క్ ఎలివేషన్లు, థమన్ బిజిఎమ్ పడితే ఇక థియేటర్లలో ఆడియన్స్ కి పూనకాలు రావడం పక్కా. మొత్తంగా బాలయ్య మోక్షజ్ఞ కలిసి స్క్రీన్‌పై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.

మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !

అయితే సినిమాలో 40 నిమిషాలు బాలయ్య కనిపించబోతున్నాడు అనే వార్తలపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ వదల్లేదు..నిజంగానే బాలకృష్ణ ఈ సినిమాలో అలాంటి రోల్ చేస్తున్నారా లేదా అనేది క్లారిటీ రావాలి.మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్‌పై ఉన్న సస్పెన్స్, అంచనాలు ఈ రూమర్స్ తో మరింత పెరిగిపోయాయనే చెప్పాలి. చూడాలి ఈ క్రేజీ అప్ డేట్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !

Tags

Related News

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!

రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!

వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!

Varanasi Leak : గుడి దగ్గర ఆ డైనోసర్ ఏంటి..జక్కయ్య నీ ప్లానేంటి సామి..?

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

Big Stories

Advertisement
×