E-Paper
Advertisement

తెలంగాణలో టాప్ జలపాతాలు..ఈ వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ స్పాట్స్!

తెలంగాణలో టాప్ జలపాతాలు..ఈ వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ స్పాట్స్!
Advertisement

Famous waterfalls in Telangana: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రకృతి సరికొత్త అందాలను సంతరించుకుంటుంది. దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య నుంచి దూకే జలపాతాలను చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. వర్షాకాలంలో చాలా మంది వాటర్ ఫాల్స్ చూడటానికి పక్క రాష్ట్రాలకు వెళ్తుంటారు. కానీ, మన రాష్ట్రంలోనే బాహుబలి రేంజ్ వైబ్స్ ఇచ్చే అద్భుతమైన జలపాతాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలోనే మోస్ట్ ఫేమస్ జలపాతాలు ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

తెలంగాణలో ఫేమస్ జలపాతాలు:

కుంతల జలపాతం (ఆదిలాబాద్/నేరడిగొండ):

రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా కుంతల జలపాతానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి కడెం నదిపై ఈ జలపాతం కిందికి దూకుతుంది. ఇక్కడి అడవి ప్రాంతం, కొండల మధ్య పడే నీటి సవ్వడులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. హైదరాబాద్ నుంచి దాదాపు 260 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్లేస్.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వీకెండ్ రైడ్‌కు వెళ్లడానికి పర్ఫెక్ట్ స్పాట్. శకుంతల, దుష్యంతల కథలతో ఈ ప్రాంతానికి పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది.

బోగత జలపాతం (ములుగు):

Advertisement

ఖమ్మం, ములుగు జిల్లాల సరిహద్దుల్లో, వాజేడు మండలంలో ఉన్న బోగత జలపాతాన్ని ‘తెలంగాణ నయాగరా’ అని పిలుస్తారు. దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉండే ఈ జలపాతం చూడటానికి ఎంతో విశాలంగా, అందంగా ఉంటుంది. ఎత్తు నుంచి ఒకేసారి సమాంతరంగా నీరు కిందకు పడటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ టూరిజం శాఖ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు, బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేసింది. ఫోటోషూట్స్ కి, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఈ ప్లేస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.

పొచ్చెర జలపాతం (ఆదిలాబాద్)-ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్:

కుంతల జలపాతానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే పొచ్చెర జలపాతం ఉంటుంది. కాబట్టి ఒకే ట్రిప్‌లో ఈ రెండు ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇది కుంతల అంత ఎత్తు ఉండకపోయినా.. ఎంతో వెడల్పుగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. గోదావరి నది, ఉపనది ఇక్కడి రాతి కొండల గుండా ప్రవహిస్తూ ఈ జలపాతాన్ని సృష్టిస్తుంది. చుట్టూ ఉండే పచ్చని ప్రకృతి, ల్యాండ్‌స్కేప్ వ్యూస్ టూరిస్టులను తెగ ఆకట్టుకుంటాయి.

Advertisement

Also Read: జీన్స్ అయినా, శారీ అయినా ఆల్-రౌండర్ లుక్.. మహిళల కోసం టాప్ 5 టైటాన్ వాచెస్!

గాయత్రి & కనకాయ్ జలపాతాలు- అడ్వెంచర్ లవర్స్ అడ్డా:

మీకు కాస్త ట్రెకింగ్ చేయడం, అడ్వెంచర్స్ అంటే ఇష్టమైతే ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్న గాయత్రి వాటర్ ఫాల్స్, కనకాయ్ వాటర్ ఫాల్స్ బెస్ట్ ఆప్షన్స్. గాయత్రి జలపాతానికి వెళ్లాలంటే అడవి గుండా కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. ఇక కనకాయ్ జలపాతం దగ్గర కనకదుర్గమ్మ ఆలయం కూడా ఉంటుంది. ఇవి కాస్త లోపలికి ఉండటం వల్ల కాలుష్యం లేకుండా ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి.

మల్లెల తీర్థం (నాగర్ కర్నూల్):

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో నల్లమల అడవుల మధ్య మల్లెల తీర్థం జలపాతం ఉంటుంది. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి నేరుగా ఒక శివలింగం ఆకారంలో ఉండే రాతిపై ఈ నీరు పడటం విశేషం. దట్టమైన చెట్ల మధ్య, చల్లటి గాలి నడుమ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర గడపడం ఒక గొప్ప ఫీల్ ఇస్తుంది. హైదరాబాద్ వాసులకు ఇది వన్-డే ట్రిప్‌కు బెస్ట్ ఛాయిస్.

వర్షాకాలంలో ఈ జలపాతాలన్నీ పూర్తి స్థాయి నీటితో కళకళలాడుతుంటాయి. అయితే.. వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లినప్పుడు సెల్ఫీల కోసం ప్రమాదకరమైన బండరాళ్లపైకి ఎక్కడం, లోతు తెలియకుండా నీటిలోకి దిగడం వంటి పనులు అస్సలు చేయకండి. సేఫ్టీ రూల్స్ పాటిస్తూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయండి.

Related News

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

సముద్రంలో ఈ పసుపు గుర్తు కనిపిస్తే జాగ్రత్త! ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి ఎందుకు చేశారు? కారణాలేంటీ?

బ్రిటీషర్ల నాటి వైభవం.. మన దేశంలోనూ ‘లండన్’ ఉందోచ్.. విశేషాలు ఇవే!

మెట్రో రైలుకు గ్లోబల్ గుర్తింపు, ఆ సర్టిఫికేషన్ సాధించిన తొలి సంస్థగా..

అమృత్ భారత్ రైళ్లలో సూపర్ స్పెసిలిటీస్.. వెర్షన్ 3.0 చూస్తే మతిపోవాల్సిందే!

రాఖీ పండుగ వేళ రైల్వే గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్!

రైల్వే బెడ్‌ షీట్లు కొట్టేసి.. శాలువాలుగా కప్పుకొని.. నెట్టింట వీడియో వైరల్!

Big Stories

Advertisement
×