E-Paper
Advertisement

పాక్ విమానం మిస్సింగ్.. సేఫ్ గా ఉందా? సముద్రంలో కూలిందా?

పాక్ విమానం మిస్సింగ్.. సేఫ్ గా ఉందా? సముద్రంలో కూలిందా?
Advertisement

Pakistan Plane Mystery: పాకిస్తాన్ కు చెందిన విమానం అరేబియా సముద్రంపై  అదృశ్యమైన ఘటన సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. షార్జా నుంచి కరాచీకి బయలుదేరిన K2 ఎయిర్‌ వేస్‌ కు చెందిన బోయింగ్ 737-400 అనే కార్గో విమానం నావిగేషన్ ఫెయిల్యూర్ తర్వాత కొద్ది నిమిషాల్లోనే రాడార్ నుంచి కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై పాకిస్థాన్ అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్ అథారిటీ కీలక ప్రకటన

పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్ అథారిటీ (PAA) ఈ ఘటనకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. విమానంలో మొత్తం ఐదుగురు సిబ్బంది ఉన్నారు. విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత కరాచీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ తో సంబంధాలు కొనసాగాయి. అయితే, ప్రయాణ మధ్యలో పైలట్ నావిగేషన్ వ్యవస్థలో సమస్య తలెత్తిందని సమాచారం ఇచ్చి, ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి సాయం కోరాడు. అధికారులు వెంటనే విమానానికి మార్గనిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. మొదట పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు కనిపించినా, కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే విమానం అదృశ్యం అయ్యింది. రాత్రి 9:21 గంటల సమయంలో విమానం ఒక్కసారిగా ఎత్తు నుంచి కిందికి  పడిపోయి దిశ మార్చుకున్నట్లు రాడార్‌ లో రికార్డు అయ్యింది. కరాచీకి పశ్చిమాన సుమారు 287 కిలోమీటర్ల దూరంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

నిమిషానికి 22,400 అడగుల వేగంతో కిందికి..

Advertisement

ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్‌ రాడార్ ఈ ఘటనకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. మొదట విమానం కొంత ఎత్తు తగ్గి, ఆ తర్వాత మళ్లీ పైకి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాలకే మరోసారి చాలా వేగంగా కిందికి పడిపోయింది. చివరిసారిగా నమోదైన సమాచారం ప్రకారం, విమానం సముద్ర మట్టానికి కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉండగా నిమిషానికి సుమారు 22,400 అడుగుల వేగంతో కిందికి దిగుతున్నట్లు గుర్తించారు.

టేకాఫ్ అయిన కాసేపటికే కమ్యూనికేషన్ సమస్య

మరో కీలక విషయం ఏమిటంటే, విమానం షార్జా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)లో సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానానికి సంబంధించిన నావిగేషన్ సమాచారం సరిగా అందకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, అదే ప్రమాదానికి కారణమా? లేక మరో సాంకేతిక సమస్య ఎదురైందా? అనే అంశాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

కొనసాగుతున్న గాలింపు చర్యలు

Advertisement

ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులు అదృశ్యం అయిన విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అరేబియా సముద్రంలో విమానం కూలిపోయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్, శిథిలాలు లభించిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది బయటపడే అవకాశం ఉంది. నావిగేషన్ సమస్య గుర్తించిన కొన్ని నిమిషాల్లోనే విమానం అదృశ్యం కావడం విమానయాన రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

Read Also: రెండు రోజులుగా కుండపోత వర్షాలు.. పలు రైళ్లు రద్దు.. విమానాలు ఆలస్యం!

Related News

మీకు తెలుసా? భారతీయ రైల్వేలో ఒక రోజు ప్రయాణించే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానం!

తక్కువ బడ్జెట్‌లో.. టాప్ సౌత్ ఇండియా టూరిస్ట్ ప్లేసెస్!

పొద్దున్నే వెళ్లి సాయంత్రానికి రావచ్చు.. హైదరాబాద్ దగ్గర్లోని టాప్ 4 టూరిస్ట్ స్పాట్స్!

తెలంగాణలో టాప్ జలపాతాలు..ఈ వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ స్పాట్స్!

విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు డైరెక్ట్ ఫ్లైట్స్.. ఇండిగో బిగ్ సర్‌ప్రైజ్!

Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

ఇండియన్ రైల్వేలో ఇలాంటి రైళ్లు కూడా ఉన్నాయా? జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

Big Stories

Advertisement
×