E-Paper
Advertisement

ఇండియన్ రైల్వేలో ఇలాంటి రైళ్లు కూడా ఉన్నాయా? జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

ఇండియన్ రైల్వేలో ఇలాంటి రైళ్లు కూడా ఉన్నాయా? జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!
Advertisement

10 Incredible Indian Trains: రైలు ప్రయాణం అంటే.. చాలామంది తక్కువ ఖర్చుతో ఒక చోటు నుంచి మరో చోటుకు చేరే పద్దతి అనుకుంటారు. కానీ, భారతీయ రైల్వేలో కొన్ని రైళ్లు ప్రయాణాన్నే ఒక అద్భుతమైన అనుభూతిగా మార్చేస్తాయి. మంచుతో కప్పుకున్న కొండలు, పచ్చని అడవులు, లోతైన లోయలు, రాజభవనాల తరహా విలాసవంతమైన కోచ్‌లు, ఆధ్యాత్మిక క్షేత్రాలు.. ఇలా ప్రతి రైలుకు ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ రైల్వేలోని 10 అద్భుతమైన రైళ్ల గురించి తెలుసుకుందాం.

1.డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

1881 నుంచి నడుస్తున్న ఈ టాయ్ ట్రైన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్ వరకు తేయాకు తోటలు, హిమాలయ కొండల మధ్య సాగే ఈ ప్రయాణం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చోటు సంపాదించింది.

2.కల్కా–సిమ్లా టాయ్ ట్రైన్

Advertisement

100కు పైగా సొరంగాలు, అందమైన వంతెనలు, పచ్చని కొండల మధ్య సాగే ఈ రైలు ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది.

3.మహారాజాస్ ఎక్స్‌ ప్రెస్

భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన రైలు ఇదే. రాజుల్లా ప్రయాణించాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. లగ్జరీ సూట్లు, అద్భుతమైన భోజనం, స్పెషల్ సర్వీసులు ఈ రైలును మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.

4.ముంబై–గోవా విస్టాడోమ్ రైలు

Advertisement

కొంకణ్ తీరంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఈ ప్రయాణం తప్పక చేయాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొండలు, జలపాతాలు, సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం కళ్లకు పండుగలా ఉంటుంది.

5.గోల్డెన్ చారియట్

దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా ప్రాంతాల అందాలను విలాసవంతంగా చూపించే ప్రత్యేక రైలు ఇది. స్పా, ప్రీమియం డైనింగ్, లగ్జరీ సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉంటాయి.

6.డెక్కన్ ఒడిస్సీ

పశ్చిమ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ సాగే ఈ లగ్జరీ రైలు కూడా ప్రయాణికులకు రాయల్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.

7.ప్యాలెస్ ఆన్ వీల్స్

రాజస్థాన్ రాజభవనాల శైలిలో రూపొందించిన ఈ రైలు కోటలు, రాజప్రాసాదాలు, తాజ్ మహల్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది.

8.నీలగిరి మౌంటెన్ రైల్వే

మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు వెళ్లే ఈ టాయ్ ట్రైన్ పశ్చిమ కనుమల అందాలను మరింత అద్భుతంగా చూపిస్తుంది. ఆవిరి ఇంజిన్‌ తో సాగే ఈ ప్రయాణం ఇప్పటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

9.బౌద్ధ సర్క్యూట్ టూరిస్ట్ రైలు

గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలను ఒకే యాత్రలో చూపించే ప్రత్యేక రైలు ఇది. బోధ్ గయ, సారనాథ్, లుంబిని లాంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

10.శ్రీ రామాయణ యాత్ర రైలు

శ్రీరాముడి జీవితానికి సంబంధించిన అయోధ్య, చిత్రకూట్, రామేశ్వరం, జనక్‌ పూర్ లాంటి ప్రాంతాలను కలుపుతూ సాగే ఈ ప్రత్యేక రైలు భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

Read Also: మాన్సూన్ ట్రిప్‌ కు బెస్ట్ ఛాయిస్.. తెలంగాణలో ఈ 8 ప్లేస్‌లు మిస్ కావొద్దు!

Related News

విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు డైరెక్ట్ ఫ్లైట్స్.. ఇండిగో బిగ్ సర్‌ప్రైజ్!

Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

మాన్సూన్ ట్రిప్‌ కు బెస్ట్ ఛాయిస్.. తెలంగాణలో ఈ 8 ప్లేస్‌లు మిస్ కావొద్దు!

రూ.5లకే ప్లేట్ ఇడ్లీ.. 70 ఏళ్ల పెద్దాయన ఇడ్లీలకు భలే క్రేజ్, ఎక్కడంటే?

115 దీవుల దేశం, స్వర్గాన్ని తలపించే ప్రకృతి.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న సెషెల్స్

జస్ట్ రూ.23 వేలకే.. రౌండ్ ట్రిప్, ఆగస్టులో ఈ ప్రాంతాలకు వెళ్లి వచ్చేయండి!

రైలు బోగిలో ఫస్ట్ నైట్ పై స్పందించిన రైల్వే.. వాళ్లకు దబిడి దిబిడే!

Big Stories

Advertisement
×