E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో.. టాప్ సౌత్ ఇండియా టూరిస్ట్ ప్లేసెస్!

తక్కువ బడ్జెట్‌లో.. టాప్ సౌత్ ఇండియా టూరిస్ట్ ప్లేసెస్!
Advertisement

Budget South India trips 2026: రోజూ ఆఫీస్ స్ట్రెస్, కాలేజీ టెన్షన్లతో విసిగిపోయి.. ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్లాలని ఉందా? కానీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే భయమేస్తోందా? డోంట్ వర్రీ. మన తెలుగు రాష్ట్రాల పక్కనే, తక్కువ ఖర్చులో గోవా వైబ్స్ ఇచ్చే బీచ్‌లు, ఊటీని మించిన హిల్ స్టేషన్లు చాలానే ఉన్నాయి. దేశంలోని మోస్ట్ ట్రెండీ, బడ్జెట్ ఫ్రెండ్లీ సౌత్ ఇండియా టూరిస్ట్ ప్లేసెస్ ఏంటో, అక్కడ ఎలాంటి లొకేషన్లు ఎంజాయ్ చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

తక్కువ ఖర్చులో.. బెస్ట్ సౌత్ ఇండియా ట్రిప్స్

గోకర్ణ & ఉడుపి (కర్ణాటక):

చాలా మందికి బీచ్ అనగానే గోవా గుర్తొస్తుంది. కానీ.. గోవాలో ఖర్చులు కొంచెం ఎక్కువే. అందుకే ఇప్పుడున్న ట్రెండ్‌లో మన తెలుగు యూత్ అంతా కర్ణాటకలోని గోకర్ణ, ఉడుపి వైపు క్యూ కడుతున్నారు. గోకర్ణలోని ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్‌లలో క్రేజీ వైబ్స్ ఉంటాయి. ఇక్కడ తక్కువ ధరలోనే హోమ్‌స్టేలు దొరుకుతాయి. ఇక అక్కడికి పక్కనే ఉండే ఉడుపికి వెళ్తే.. మాల్పే బీచ్‌లో సీ-వాక్, సెయింట్ మేరీస్ ఐలాండ్‌లో అద్భుతమైన రాతి కట్టడాలు చూడొచ్చు. అటు స్పిరిచువల్ ఫీలింగ్, ఇటు బీచ్ లైఫ్ రెండూ తక్కువ బడ్జెట్‌లోనే ఇక్కడ సాధ్యమవుతాయి.

వయనాడ్ & మున్నార్ (కేరళ):

Advertisement

ప్రకృతి ప్రేమికులకు కేరళ ఎప్పుడూ ఒక స్వర్గధామం. ముఖ్యంగా వర్షాకాలంలో.. చలికాలంలో వయనాడ్, మున్నార్ అందాలు వర్ణనాతీతం. వయనాడ్‌లో దట్టమైన అడవులు, బాణాసుర సాగర్ డ్యామ్, ఎడక్కల్ గుహలు మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. అలాగే మున్నార్ అనగానే.. మనకు గుర్తొచ్చేది మైదానాల్లా పరిచిన పచ్చటి టీ తోటలు. వాన పడుతున్నప్పుడు ఇక్కడి కొండల మధ్య నుంచి పొగమంచు వెళ్తుంటే వచ్చే కిక్కే వేరు. హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి ట్రైన్ లేదా బస్సులో వెళ్తే చాలా తక్కువ ఖర్చులో ఈ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. కేరళ బ్యాక్ వాటర్స్ పక్కన బడ్జెట్ రూమ్స్ కూడా ఈజీగా దొరుకుతాయి.

Also Read: తెలంగాణలో టాప్ జలపాతాలు..ఈ వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ స్పాట్స్!

చిక్కమగళూరు & కూర్గ్ (కర్ణాటక):

Advertisement

హిల్ స్టేషన్లలో చిక్కమగళూరు, కూర్గ్ టాప్‌లో ఉంటాయి. కాఫీకి కేరాఫ్ అడ్రస్ అయిన చిక్కమగళూరులో ముల్లాయనగిరి పీక్ ట్రెకింగ్ చేయడం యూత్‌కు చాలా ఇష్టం. ఇక ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే కూర్గ్‌లో అబ్బే ఫాల్స్, రాజాస్ సీట్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్ వంటి ఎన్నో క్రేజీ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఖరీదైన రిసార్టులకు వెళ్లకుండా.. స్థానిక నడిచే ‘హోమ్‌స్టేలు’ఎంచుకుంటే తక్కువ ధరలోనే అథెంటిక్ కొడగు ఫుడ్ తింటూ, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపవచ్చు. ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్‌గా వెళ్తే ఇక్కడ ఖర్చులు ఇంకా తగ్గిపోతాయి.

బడ్జెట్ ట్రిప్ కోసం కొన్ని స్మార్ట్ టిప్స్:

ఈ ప్లేసెస్ అన్నీ కూడా వీకెండ్‌లో లేదా 3-4 రోజుల ట్రిప్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ముందుగానే ఐఆర్‌సిటిసి (IRCTC) లేదా బస్ టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల జర్నీ ఖర్చులు బాగా తగ్గుతాయి. వీకెండ్స్ కాకుండా కాస్త మిడ్-వీక్ (మంగళ, బుధవారాల్లో) ప్లాన్ చేసుకుంటే.. హోటల్ రూమ్స్ రేట్లు సగానికి సగం తగ్గుతాయి. అంతేకాదు.. లోకల్ ప్రయాణాల కోసం సొంతంగా బైక్స్ లేదా స్కూటర్స్ రెంటుకు తీసుకోవడం వల్ల క్యాబ్ ఖర్చులు ఆదా అవుతాయి.

జీవితంలో ట్రావెలింగ్ అనేది ఒక అందమైన అనుభూతి. సరైన ప్లానింగ్ ఉంటే ఈ సౌత్ ఇండియన్ లొకేషన్స్ అన్నీ చాలా తక్కువ బడ్జెట్‌లోనే చుట్టేసి రావచ్చు.

Related News

మీకు తెలుసా? భారతీయ రైల్వేలో ఒక రోజు ప్రయాణించే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభాతో సమానం!

పాక్‌లో విమానం అదృశ్యం.. వీడిన మిస్టరి, వాళ్లంతా ఏమయ్యారు?

పొద్దున్నే వెళ్లి సాయంత్రానికి రావచ్చు.. హైదరాబాద్ దగ్గర్లోని టాప్ 4 టూరిస్ట్ స్పాట్స్!

తెలంగాణలో టాప్ జలపాతాలు..ఈ వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ స్పాట్స్!

విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు డైరెక్ట్ ఫ్లైట్స్.. ఇండిగో బిగ్ సర్‌ప్రైజ్!

Driving Schools: కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్!

ఇండియన్ రైల్వేలో ఇలాంటి రైళ్లు కూడా ఉన్నాయా? జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

Big Stories

Advertisement
×