E-Paper
Advertisement

ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!

ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!
Advertisement

Train Sandwiches: రైలులో కొందరు ప్రయాణికులు చేసే పనులు.. తోటివారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఇందుకు సంబంధించి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో ఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. ఓ ఫ్యామిలీ తమ బెర్త్ లను కిచెన్ ల మార్చేసిన దృశ్యాలను అందరినీ షాక్ గురిచేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే?

ఓ రైలులోని 3AC కోచ్ లో ప్రయాణిస్తున్న ఒక గుజరాతి కుటుంబం.. తమ కేటాయించిన మిడిల్ బెర్త్ ను కిచెన్ ఫ్లోర్ గా మార్చేసింది. దానిపై పేపర్లు పరిచేసి.. బెర్త్ పై శాండ్ విచ్ లు తయారుచేసింది. ఓ మహిళ బ్రెడ్ ముక్కలను బెర్త్ పై వరుసగా పరుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్రెడ్ ముక్కలపై వెజిటేబుల్స్ పేర్చడం, సాస్ రాయడం వీడియోలో కనిపించింది. బెర్త్ పాడవకుండా న్యూస్ పేపర్లు పరిచినప్పటికీ.. వారు చేసిన పని తోటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురిచేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

‘టోస్టర్ కూడా తెచ్చి ఉంటేనా’

ఇదే వీడియోలో ఓ మహిళ మాట్లాడిన మాటలు మరింత చర్చకు దారి తీశాయి. ‘అయ్యో.. ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ టోస్టర్ తెచ్చుకోవడం మర్చిపోయాం. లేదంటే ఇక్కడే వేడివేడిగా శాండ్‌విచ్‌లు గ్రిల్ చేసుకునేవాళ్లం’ అని ఆమె సరదాగా అనడం వైరల్ క్లిప్‌లో రికార్డయింది. రైలు బెర్త్‌ను అప్పటికే వంటగదిగా మార్చేసిన సదరు కుటుంబం.. ఏకంగా ఎలక్ట్రిక్ పరికరాలను తీసుకొచ్చి కుకింగ్ చేసుంటే ఇంకా బాగుండేదని వ్యాఖ్యానించడం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

నెటిజన్లు తీవ్ర ఆగ్రహం

Advertisement

రైలులో శాండ్ విచ్ లు చేసుకోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నాయి. కొందరు దీనిని సరదాగా తీసుకున్నప్పటికీ.. మెజారిటీ నెటిజన్లు మాత్రం గుజరాతి ఫ్యామిలీ చేసిన పనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ బెర్త్ లు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రయాణించడానికి ఉద్దేశించినవే తప్ప.. నచ్చిన ఆహారం చేసుకొని తినడానికి కాదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన లేకుండా ఇలా ప్రవర్తించడం ఏమాత్రం బాగోలేదని అభిప్రాయపడ్డారు.

Also Read: మొదటి రైలు ఆలస్యమై కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయ్యిందా? మీ టికెట్ రిఫండ్ ఇలా పొందండి

రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయ్?

ఇంటి నుంచి చేసుకొని తెచ్చుకున్న ఆహారాన్ని రైలులో తినేందుకు రైల్వే రూల్స్ అంగీకరిస్తాయి. అయితే 1989 రైల్వే చట్టంలోని నియమాల ప్రకారం.. రైలు కోచ్‌లలో వంట చేయడం, అనుమతి లేని హీటింగ్ పరికరాలను వాడటం చట్టరీత్యా నేరం. రైలులోని విద్యుత్ సాకెట్లను టోస్టర్లు వంటి అధిక విద్యుత్ ను వినియోగించే సాధనాలకు వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్లు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి అధికారుల దృష్టికి వస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని పేర్కొంటున్నారు.

Also Read: రూ.50 వేల లోపు 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రేంజ్, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

Tags

Related News

ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల.. త్వరలో మరో 7 ట్రైన్స్ రెడీ!

ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?

మొదటి రైలు ఆలస్యమై కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయ్యిందా? మీ టికెట్ రిఫండ్ ఇలా పొందండి

దీపావళి పటాకులతో రైళ్లకు బ్రేక్.. 35 ట్రైన్స్ రద్దు, 150 రైళ్లు ఆలస్యం!

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ ప్రెస్!

సోలోగా యూరప్ టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారా? టాప్ 10 సిటీస్ ఇవే!

బ్రేకప్ కోసం హైకింగ్.. దెయ్యాల కోసం వేట.. 2027లో రాబోతున్న 6 వింత ట్రావెల్ ట్రెండ్స్!

Big Stories

Advertisement
×