E-Paper
Advertisement

ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు.. ఏకంగా 250 ట్రైన్స్..

ఇక దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్ల పరుగులు..  ఏకంగా 250 ట్రైన్స్..
Advertisement

Vande Bharat Sleeper Trains Expansion: భారతీయ రైల్వేలో వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుదూర ప్రయాణాలను మరింత వేగంగా, సౌకర్యవంతంగా మార్చేలా రైల్వేశాఖ ఈ రైళ్ల సంఖ్యను పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఢిల్లీ–వారణాసి, ముంబై–బెంగళూరు, గౌహతి–హౌరా మార్గాల్లో మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని రేక్‌లు సిద్ధం కానుండటంతో కొత్త మార్గాల్లో కూడా ఈ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

తొలుత 10 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ

తొలుత 10 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ బాధ్యతను భారతీయ రైల్వే BEML సంస్థకు అప్పగించింది. వీటిలో ఇప్పటికే ఆరు రేక్‌ల తయారీ పూర్తయింది. మిగిలిన నాలుగు రేక్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో మరో రెండు రేక్‌లు ఈ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్ల తెలుస్తోంది. మిగిలిన రెండు రేక్‌లు వచ్చే రెండు నెలల్లో సిద్ధమవుతాయని రైల్వే  వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా, మరో మూడు వందే భారత్ స్లీపర్ రేక్‌ల తయారీ కాంట్రాక్టును కూడా BEMLకు అప్పగించారు. ఇందుకు అవసరమైన  పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం

Advertisement

వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రధానంగా రాత్రిపూట సుదూర ప్రయాణాల కోసం రూపొందించారు. పూర్తిగా ఏసీ సౌకర్యంతో పాటు అత్యాధునిక బెర్తులు, మెరుగైన పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లతో వీటిని తయారు చేశారు. ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. అయితే, ఆపరేషనల్ స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లుగా నిర్ణయించారు. మార్గంలోని ట్రాక్ పరిస్థితులు, సెక్షనల్ క్లియరెన్స్ ఆధారంగా స్పీడ్ మారుతుంది.

ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు

ఈ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. ప్రతి బెర్త్ వద్ద మొబైల్ ఛార్జింగ్ కోసం USB టైప్-A, టైప్-C పోర్టులు, త్రీ పిన్ సాకెట్లు ఏర్పాటు చేశారు. లగేజీ పెట్టుకునేందుకు మంచి స్పేస్ తో పాటు మోడ్రన్ టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి.  ముఖ్యంగా ఫస్ట్ ఏసీ ప్రయాణికుల కోసం వేడి నీటి షవర్ సదుపాయం కల్పించారు. వై ఫై, LED లైటింగ్, సెన్సార్ ఆధారిత ఆటోమేటిక్ డోర్లు, సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లు ఏర్పాటు చేశారు.

భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం

Advertisement

ప్రయాణికుల భద్రత కోసం CCTV కెమెరాలు, ఫాగ్, ఫైర్ రెసిస్టెన్స్ వ్యవస్థ, ఎమర్జెన్సీ అలారం బటన్లు ఏర్పాటు చేశారు. అలాగే, కవచ్ తరహా ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS), విపత్తు సమయాల్లో ఉపయోగపడే ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను అందించారు.

మరో 250కి పైగా రైళ్ల తయారీ..

వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీని మరింత విస్తరించాలని రైల్వే శాఖ భావిస్తోంది. అదనపు కోచ్‌లతో కూడిన 50 రైళ్ల తయారీ బాధ్యతను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కు అప్పగించింది. మరోవైపు 16 కోచ్‌లతో కూడిన సుమారు 200 రైళ్ల తయారీని కినెట్, టిటాగఢ్ వ్యాగన్స్ సంస్థలు చేపడుతున్నాయి. ప్రయాణికులకు వేగం, భద్రత, అత్యాధునిక సౌకర్యాలు ఒకేసారి అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అని రైల్వే ప్రకటించింది.

Read Also: ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?

Tags

Related News

ఈ ఫ్యామిలీ నిర్వాకం చూశారా? రైలులోని 3AC కోచ్‌లో వంటలు.. నెటిజన్ల ఫైర్!

ఇకపై 72 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేయాలా? లేదంటే రీఫండ్ రాదా?

మొదటి రైలు ఆలస్యమై కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయ్యిందా? మీ టికెట్ రిఫండ్ ఇలా పొందండి

దీపావళి పటాకులతో రైళ్లకు బ్రేక్.. 35 ట్రైన్స్ రద్దు, 150 రైళ్లు ఆలస్యం!

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ ప్రెస్!

సోలోగా యూరప్ టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారా? టాప్ 10 సిటీస్ ఇవే!

బ్రేకప్ కోసం హైకింగ్.. దెయ్యాల కోసం వేట.. 2027లో రాబోతున్న 6 వింత ట్రావెల్ ట్రెండ్స్!

Big Stories

Advertisement
×