ప్రపంచంలో అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఫిన్ లాండ్ ఒకటి. ఆ దేశంలో సుమారు 17 వేల మంది భారతీయు నివాసం ఉంటున్నారు. వారిలో 92 శాతం మందికి ఇప్పటికీ పౌరసత్వం లేదు. తాజాగా వారందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఫిన్ లాండ్ లో శాశ్వతంగా నివాసం ఉండాలనుకునే వారికి నిబంధనలను సులభతరం చేసింది. ఫిన్ లాండ్ కు వెళ్లిన చాలా మంది అక్కడ నివాసం ఉండటానికి కంటిన్యూయస్ రెసిడెన్సీ పర్మిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫిన్నిష్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన తర్వాత కుటుంబ సంబంధాలు, చదువు నుంచి ఉద్యోగానికి మారడం లాంటి చెల్లుబాటు అయ్యే కారణం ఉంటే నాలుగు సంవత్సరాల వరకు ఉండటానికి వీలు కల్పిస్తుంది. గత విధానాలు సురక్షితమైన నివాసానికి అనుమతి ఇవ్వకపోయినా, కొత్త రూల్స్ చాలా మందికి అనుకూలంగా మారే అవకాశం ఉంది.
ఫిన్ లాండ్ లో PR పొందడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. ఫిన్లాండ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నివాసం ఉండటంతో పాటు పని చేసుకోవచ్చు. PR హోల్డర్లు ఫిన్లాండ్ సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య, పెన్షన్ పథకాలకు అర్హత పొందుతారు. గృహ ప్రయోజనాలు, నిరుద్యోగ మద్దతు లభిస్తుంది.
కంటిన్యూయస్ రెసిడెన్సీ పర్మిట్ అనుమతి (A పర్మిట్)పై కనీసం 4 సంవత్సరాలు ఫిన్ లాండ్ లో నివసించి ఉండాలి. జనవరి 2026 నుంచి ఈ కాలం 6 సంవత్సరాలకు పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఫిన్ లాండ్ లో కనీసం 2 సంవత్సరాలు నివసించి ఉండాలి.
ఫిన్ లాండ్ లో శాశ్వత నివాస అనుమతి రావాలంటే కనీస వార్షిక ఆదాయం సుమారు €40,000(రూ.41.3 లక్షలు) ఉండాలి. 2 సంవత్సరాల పని అనుభవంతో గుర్తింపు పొందిన మాస్టర్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. 3 సంవత్సరాల పని అనుభవంతో ఉన్నత స్థాయి ఫిన్నిష్/స్వీడిష్ భాషా నైపుణ్యాలు ఉండాలి. దరఖాస్తుదారులకు క్లీన్ క్రిమినల్ రికార్డ్ కూడా ఉండాలి.
చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ ఫోటోలు ఉండాలి. సంపాదనకు సంబంధించిన స్టేట్ మెంట్ ఉండాలి. మీ పాస్‌పోర్ట్ ID పేజీ కాపీ ఉండాలి. చిన్నప్పుడు దరఖాస్తు చేసుకుంటే సమ్మతి ఫారమ్ ఉండాలి. విద్య, ఉపాధి, భాషా నైపుణ్యాలను నిరూపించే ఏవైనా పత్రాలు ఉంటే వాటిని జత చేయాలి.
1.అర్హతను తనిఖీ చేయాలి. అవసరమైన అన్ని పత్రాలను అందివ్వాలి.
2.ఎంటర్ ఫిన్లాండ్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను ఆన్ లైన్ లో ఫిల్ చేయాలి. పేపర్ అప్లికేషన్ ను కూడా ఇవ్వవచ్చు.
3.నిర్ణయించిన అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
4.బయోమెట్రిక్స్ ఇవ్వడానికి ఫిన్నిష్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ లేదంటే VFS గ్లోబల్‌లో అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలి.
5.అప్‌డేట్‌ల కోసం మీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయండి.
6.ఆమోదించబడిన తర్వాత, రాయబార కార్యాలయం లేదంటే సేవా కేంద్రం నుండి మీ నివాస కార్డును తీసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ అప్లికేషన్: € 240 (సుమారు 24,800)
పేపర్ అప్లికేషన్: € 350 (సుమారు 36,100)
18 ఏళ్లలోపు దరఖాస్తుదారులు: € 180 (సుమారు 18,600)
ఫిన్ లాండ్ కేవలం నివాసాన్ని మాత్రమే కాకుండా కాకుండా మెరుగైన జీవన నాణ్యతను అందిస్తుంది.
Read Also: వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!