E-Paper
Advertisement

VD14 : సరైన హిట్ లేకున్నా ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు, ఇప్పుడు ఏకంగా సౌత్ ఆఫ్రికన్ యాక్టర్

VD14 : సరైన హిట్ లేకున్నా ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు, ఇప్పుడు ఏకంగా సౌత్ ఆఫ్రికన్ యాక్టర్
Advertisement

VD14 : కొన్నిసార్లు విపరీతమైన పేరు వచ్చిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ సినిమా చేయడానికి కొంతమంది నటులు చాలా కష్టపడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేరు. సక్సెస్ కోసం ఎంతలా కష్టపడతారో, ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి అంతకు మించి కష్టపడాలి. అలా కష్టపడినప్పుడే ఆ నటులకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఆ క్రేజ్ ఉంటుంది.

ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కనిపించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయిపోయారు. ఒక చిన్న సినిమాను కూడా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఆ సినిమా మంచి ఎగ్జాంపుల్.

విజయ్ దేవరకొండ సినిమాలో సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ 

Advertisement

విజయ్ దేవరకొండ రాహుల్ దర్శకత్వంలో ప్రస్తుతం తన 14వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రాహుల్ దర్శకత్వంలో టాక్సీవాలా సినిమాను చేశాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. విజయ్ దేవరకొండ దక్షిణాఫ్రికా నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్) తో నటిస్తున్నారు, అతను ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా నటించాడు. బ్రిటిష్ కాలంలో రాయలసీమ నేపథ్యంలో నడిచే ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది.

అర్జున్ రెడ్డి తో స్టార్ డం

పెళ్లి చూపులు సినిమాతో హీరో అయిపోయిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమా విపరీతమైన స్టార్డం తీసుకొచ్చింది. ఆ సినిమా ఎంత స్టార్డం తీసుకొచ్చింది అంటే ఇప్పటికీ విజయ్ సినిమాలు ఫెయిల్ అవుతున్న కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఆయన కోసం నిల్చుని ఉంది అంటే కారణం అర్జున్ రెడ్డి. అర్జున్ అనే పాత్రలో విజయ్ ఒదిగిపోయిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పటికీ అర్జున్ రెడ్డి అనే పాత్రలో విజయ్ తప్ప ఇంకెవరిని ఊహించలేము అనే రేంజ్ లో చేశాడు. ఇక ప్రస్తుతం రాహుల్ దర్శకత్వం తో పాటు రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా మరో సినిమా కూడా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

Advertisement

Also Read: OG Film : పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకు. సుజీత్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×