BigTV English

Vande Bharath Train: వందే భారత్ రైళ్లలో ఇక ఫ్లైట్ ఫుడ్.. కేవలం ఆ రూట్లలో మాత్రమే

Vande Bharath Train: వందే భారత్ రైళ్లలో ఇక ఫ్లైట్ ఫుడ్.. కేవలం ఆ రూట్లలో మాత్రమే

భారత రైల్వే వ్యవస్థలో ఇప్పుడు వందే భారత్ రైళ్లు ప్రముఖమైనవి. వీటి టిక్కెట్ ధరలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ వందే భారత రైళ్ల లో ఎయిర్ లైన్ ఫుడ్ అందించాలని భారత రైల్వే నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని వందే భారత్ రైళ్లల్లో ఇలాంటి ఆహారం లభించదు. కేవలం కేరళలో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో మాత్రమే ఫ్లైట్ ఫుడ్ దొరికే అవకాశం ఉంది. ఇప్పటికే కేరళలోని ఫ్లైట్ కిచెన్ ఆపరేటర్లతో సహా మూడు కేటరింగ్ యూనిట్లను ఆన్ బోర్డ్ క్యాటరింగ్ జాబితాలో చేర్చినట్టు అధికారులు చెప్పారు.


కొచ్చి కి చెందిన కుటుంబం శ్రీ యూనిట్, క్యాసినో ఎయిర్ క్యాటరర్స్ అండ్ ఫ్లైట్ సర్వీసెస్ అలాగే తిరువనంతపురానికి చెందిన సమృద్ధిని అనే సంస్థలతో క్యాటరింగ్ ఒప్పందం జరిగినట్టు రైల్వే అధికారులు తెలియజేశారు.

టేస్టీ క్వాలిటీ ఫుడ్స్
ఇంతవరకు రైళ్లలో నాణ్యతలేని ఆహారమే సరఫరా అవుతుంది అని ఎంతో మంది ప్రయాణికుల అభిప్రాయం. నిజానికి అందులో వాస్తవం కూడా ఉంది. రైళ్లల్లో దొరికే ఆహారాన్ని తినలేక ఇబ్బంది పడే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఈ పరిస్థితిని మార్చాలన్నదే రైల్వే బోర్డు ప్రయత్నం. ఇందుకోసం వందే భారత్ లో తొలిసారిగా విమానంలో దొరికే నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు.


ఫుడ్ ఆప్షన్ మీకే
మొదటిగా కేరళలో తిరువనంతపురం నుంచి కాసర్గడ్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రయాణికులకు ఆహారం అవసరం లేకపోతే టికెట్ బుక్ చేసుకున్నప్పుడే నో ఫుడ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు కొంతవరకు టికెట్ ధర తగ్గుతుంది. అదే ఫుడ్ ను ఎంపిక చేసుకుంటే మాత్రం టికెట్ ధర పెరుగుతుంది.

ఆహారం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న ప్రయాణికులు 139 కు డయల్ చేసి లేదా రైల్ మదద్ యాప్ ద్వారా క్యాటరింగ్ గురించి ఫిర్యాదులు చేయవచ్చు. లేదా సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో రైల్వేస్ ను ట్యాగ్ చేస్తూ కూడా తమ పోస్టులను పెట్టవచ్చు.

వందే భారత్ రైల్లో ఎలాంటి ఆహారాన్ని అందించబోతున్నారో కూడా రైల్వే బోర్డు అధికారులు ప్రకటించారు. ఇవన్నీ కూడా పిల్లలకు పెద్దలకు నచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల మనసు దోచేలాగా మెనూ సిద్ధం చేశారు.

ప్రస్తుతం ఎయిర్ ఇండియా వంటి డొమెస్టిక్ ఫ్లైట్లో ఈ తరహా మెనూ ఇస్తున్నారు. ఇదే తరహా ఆహారాన్ని వందే భారత్ లో కూడా పెడితే ప్రయాణికులకు పండుగే.

అల్పాహారం మెనూ ఇదే
అల్పాహారంలో భాగంగా మష్రూమ్ ఆమ్లెట్, ఆలూ పరాటా, వడ, ఇడ్లీ, డ్రైజీరా ఆలూ వెడ్జెస్, స్మూతీస్, పాలకూర ఫ్రై, ఉడికించిన మొక్కజొన్న వంటివి లభిస్తాయి.

లంచ్ లో…
ఇక మధ్యాహ్న భోజనంలో వెజిటబుల్ బిర్యానీ, మలబార్ చికెన్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ పోరియల్, చేపల కూర, చెట్టినాడ్ చికెన్ కర్రీ, బంగాళదుంప వేపుడు, చికెన్ సాండ్విచ్, వెజిటబుల్ ఫ్రైడ్ నూడిల్స్, చిల్లి చికెన్ వంటివి ఉంటాయి. అలాగే డిజర్ట్ గా బ్లూబెర్రీ వెనిల్లా పేస్ట్రీ, కాఫీ ట్రఫిల్ కేకులు లభిస్తాయి

సాయంత్రం స్నాక్స్
సాయంత్రం పూట స్నాక్స్ గా మసాలా బన్, ఉడికించిన మొక్కజొన్న, చీజ్ సాండ్విచ్లు, కూల్ డ్రింకులు వంటివి ఉంటాయి.

వీటిని పొందాలంటే ముందుగానే టికెట్ తో సహా తగిన రుసుమును చెల్లించాలి. మీరు రైలు ప్రయాణం చేసే సమయాన్నిబట్టి అవి మీకు అందిస్తారు. అంటే వందే భారత్ రైలులో మీరు అల్పాహారం అందే సమయానికి ప్రయాణం చేస్తే బ్రేక్ ఫాస్ట్ మెనూలోని ఆహారాలని అందిస్తారు. అదే లంచ్ టైమ్ అయితే ఇక్కడ చెప్పిన ఫుడ్ మెనూలోని ఆహారాలను అందిస్తారు.

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×