Indian Railway Vikalp Scheme: దేశ వ్యాప్తంగా నిత్యం వేలాది రైళ్లు నడుస్తున్నాయి. లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తక్కువ ఖర్చులో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది ట్రైన్ జర్నీ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే, రద్దీ కారణంగా చాలా మందికి కన్ఫర్మ్ టికెట్ పొందడం కష్టం అవుతుంది. ప్రయాణ సమయంలో సీట్లు, టికెట్లు లేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే, వెయిటింగ్ లిస్టు ఇబ్బందులను తొలగించడానికి రైల్వేశాఖ చక్కటి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి? ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
‘వికల్ప యోజన’తో కన్ఫర్మ్ టికెట్
ప్రయాణీకులు కన్ఫర్మ్ టికెట్ పొందేందుకు రైల్వేశాఖ ‘వికల్ప యోజన’ను పరిచయం చేసింది. ఈ స్కీమ్ ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకుంటే కచ్చితంగా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ కన్ఫర్మ్ టికెట్ ఎలా పొందవచ్చంటే? మీరు రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ‘వికల్ప్’ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. మీ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నా? ఆ తర్వాతి రైల్లో మీకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అంటే మీరు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం టికెట్ బుక్ చేసుకుంటే.. మీ టికెట వెయిటింగ్ లిస్టులో వచ్చింది అనుకుందాం. ఛార్జ్ రెడీ అయిన తర్వాత కూడా వెయిటింగ్ లిస్టులోనే ఉంటే మీరు ఆ రైలులో ప్రయాణించలేదు. క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల డబ్బులు వేస్ట్ అవుతాయి. తర్వాత రైల్లో కూడా మీరు జనరల్ టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే, మీరు టికెట్ బుక్ చేసే సమయంలో ‘వికల్ప్’ అప్షన్ మీద క్లిక్ చేసి టికెట్ బుక్ చేసుకుంటే, అదే దారిలో మరో రైలు మీకు కన్ఫర్మ్ టికెట్ ఇస్తారు. ఈ సౌకర్యాన్ని మీరు 12 గంటలలోపు ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు వెళ్లే దారిలో 12 గంటలలోపు వచ్చే రైళ్లలో కన్షర్మ్ టికెట్ పొందవచ్చు. ఈ పథకం అన్ని రైళ్లలోనూ ఉంటుంది.
అటు ఈ సర్వీసును ఉపయోగించుకునేందు ఎలాంటి అదనపు ఛార్జీలు అనేవి ఉండవు. అయితే, అంతకు ముందు సూపర్ ఫాస్ట్ రైల్లో టికెట్ బుక్ చేసుకుని, ‘వికల్ప్ యోజన’ ద్వారా సాధారణ ఎక్స్ ప్రెస్ రైల్లో కన్ఫర్మ్ టికెట్ తీసుకున్నా, ఎలాంటి డబ్బులు తిరిగి ఇవ్వరు.
‘వికల్ప్ యోజన’ను ఇలా ఎంచుకోండి!
⦿ ముందుగా మీరు IRCTC వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
⦿ ప్రయాణం చేయాల్సి డేట్, గమ్యస్థానం, క్లాస్, సీటుకు సంబంధించి వివరాలను ఎంటర్ చేయాలి.
⦿ ప్రయాణీకుల పేరు వివరాలను పొందుపరచాలి.
⦿ టికెట్ బుకింగ్ ని కన్ఫర్మ్ చేయడానికి డబ్బులు చెల్లించాలి.
⦿ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ‘వికల్ప్’ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ వెంటనే ప్రత్యామ్నాయ రైళ్ల వివరాలు కనిపిస్తాయి.
⦿అదే రూట్ లో ప్రత్యామ్నాయ రైళ్లను ఎంచుకోవచ్చు.
⦿ కన్ఫర్మ్ టికెట్ తీసుకుని హ్యాపీగా జర్నీ చెయ్యొచ్చు!
Read Also: రైల్వే ట్రాక్ మీదికి దూసుకొచ్చిన కారు, అదెలా సాధ్యం రా?