Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అనౌన్స్ చేసిన సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలు రిలీజ్ పై రకరకాల వార్తలు వినిపించాయి. వాటికి చెక్ పెడుతూ ప్రముఖ నిర్మాతలు ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు త్వరలోనే రిలీజ్ అవుతాయని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ పై కొత్త చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. దానితో సినిమాలో రిలీజ్ అవుతాయా లేదా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాయా? లేదా రూమర్స్ కు క్లారిటీ దొరుకుతుందేమో చూడాలి..
పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు. ఆ సినిమాలను తక్కువ టైంలోనే పూర్తి చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే అనూష చేసిన సినిమాల్లో మొదటిగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు… ఇందులో అనుమానం లేదు. అయితే గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు, ఇతర చిన్నా పెద్ద పోటీ చిత్రాలు అదే మార్చి 28 వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ విషయం టాలీవుడ్ ప్రేక్షకులలో కొత్త చర్చ వినిపిస్తుంది.. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో పవన్ కు సంబంధించి అతి కొద్ది వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. దానికోసమే ప్రత్యేకంగా అమరావతికి దగ్గరలో సెట్లు కూడా వేస్తున్నారు. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల ఈ సినిమా డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అని మేకర్స్ మాత్రం ఆ డేట్ ను మార్చలేదని తెలుస్తుంది.
ఇక ఈ మూవీ కన్నా ముందు పవన్ కళ్యాణ్ నటించిన మరో మూవీ ఓజీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధపడుతున్నారు. ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైఫ్ నెలకొంది. దాంతో మూవీ హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ హిట్ అవ్వడం పై హరి హర వీరమల్లు సినిమా రిజల్ట్ ఆడపడుతుంది. కానీ నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం కాదు ముందైతే పవన్ డేట్లు దొరకాలి. కానీ ఏపీ లో రాజకీయ పరిస్థితులు చక్కగానే ఉన్నప్పటికి పాలన పరంగా బిజీగా ఉండటం వల్ల పవన్ సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టలేకున్నారు. ఫిబ్రవరి వచ్చేసింది. అసలే ఈ నెలలో తక్కువ రోజులు. ఒకవేళ వీరమల్లు కనక మార్చిలోనే రావాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాలి. కానీ ఇప్పటివరకు ఒక పాట గతంలో ఒక టీజర్ తప్ప ఈ మూవీ నుంచి పెద్దగా అప్డేట్ ని వదిలినట్టు లేదు. ఇక ఓజికైతే కొన్ని కీలక అంశాల గురించి పలువురు చర్చలు జరపడంతో ఆ సినిమాపై ఆసక్తి పెరిగింది. పవన్ కళ్యాణ్ సిగ్నల్ రాకపోవడం వల్ల డివివి దానయ్య ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఇక సినిమాలు ఇప్పటిలో రిలీజ్ అవ్వవు అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. త్వరలోనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశాలు ఉన్నాయి.