Fastag : ఫాస్టాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్. కేంద్రం బంపరాఫర్ ప్రకటించింది. ఇక ఎంతైనా తిరగొచ్చు. ఎన్నిసార్లైనా టోల్ గేట్లు దాటొచ్చు. ఇప్పటిలా వందలకు వందలు చార్జీలు పడవు. అటు వెళ్తే వంద.. ఇటు వస్తే రూ.150.. కొత్త రోడ్డు అయితే రూ.200.. పాతదైతే రూ.50.. ఇలా అడ్డగోలు రేట్లు వసూలు చేయరు. దానికో కొత్త పద్దతి తీసుకొస్తోంది కేంద్రం. వన్ టైమ్ పేమెంట్. ఫిక్స్డ్ ట్రిప్స్. ఆ ప్లాన్‌లో డిస్కౌంట్ కూడా భారీగానే ఉంది.
రూ.3000 కట్టు.. 200 ట్రిప్పులు కొట్టు..
టోల్ రోడ్లపై ప్రయాణం విషయంలో మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 3 వేల రూపాయలతో ఫాస్టాగ్ ఏడాది ప్లాన్ తీసుకుంటే.. 200 ట్రిప్పులు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. కొత్త ప్లాన్ అమల్లోకి వచ్చాక ఏ రహదారిపైన ప్రయాణించినా యాన్యువల్ పాస్ యూజ్ చేయొచ్చు. ఆ రీచార్జ్‌తో ఏ రాష్ట్రంలోనైనా జర్నీ చేయొచ్చు. ఏ రోడ్డుకు ఎంత టోల్ ఉన్నా సంబంధం లేదు. ఏ స్టేట్‌లో ఎంత ఛార్జీ ఉన్నా నో ప్రాబ్లమ్. ట్రిప్పులతోనే లెక్క. రూ.3వేలు కట్టు.. 200 ట్రిప్పులు కొట్టు.. అనేది ఈ స్కీమ్.
టోల్ @ రూ.15 మాత్రమే..
200 ట్రిప్పులకు రూ.3వేలు అంటే.. ఒక్కో ట్రిప్పుకు కేవలం రూ.15 మాత్రమే టోల్ చార్జ్ పడుతోంది. డెడ్ చీప్ అన్నట్టేగా. ఇన్నాళ్లూ టోల్ రేట్లు తెగ బాదేశారు. ప్రయాణికుల తోలు తీసేశారు. ఏ రోడ్డు ఎక్కినా రూ.100 పైనే వసూల్ చేసేవారు. అలాంటిది ఆగస్టు 15 తర్వాత అమల్లోకి వచ్చే కొత్త ఆఫర్ తీసుకుంటే.. కేవలం రూ.15 మాత్రమే చార్జ్ పడనుంది. ఇంతకంటే బంపరాఫర్ ఇంకేం ఉంటుంది. హైవేలపై ప్రయాణానికి సంబంధించి ఇది కీలక సంస్కరణగా ప్రకటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఒకసారి టోల్‌గేట్ వార్షిక పాస్ తీసుకున్న తర్వాత ఏడాది లోపే 200 టోల్‌గేట్స్ దాటితే, మళ్లీ 3 వేల రూపాయలు చెల్లించి పాస్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఏడాదిలోపు 200 టోల్‌గేట్స్ దాటకపోయినా.. పాస్ రెన్యువల్ చేసుకోవాల్సిందే.
Also Read : వందేభారత్ స్లీపర్ ట్రైన్.. స్పెషల్ వీడియో..
కండిషన్స్ అప్లై..
అయితే, ఇందులోనూ చిన్న కండిషన్ ఉంది. ఈ డిస్కౌంట్ కేవలం ప్యాసింజర్ వెహికిల్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. సరకు రవాణా వాహనాలు, వ్యాపార, వాణిజ్యాల కోసం ఉపయోగించే వెహికిల్స్‌కు మాత్రం ఈ ఆఫర్ లేదు. కార్లు, జీపులు, వ్యాన్లు లాంటి వ్యక్తిగత వాహనాలకే ఈ బంపరాఫర్. ఇంకెందుకు ఆలస్యం.. చల్ చలోరే చలో…
Important Announcement 📢
🔹In a transformative step towards hassle-free highway travel, we are introducing a FASTag-based Annual Pass priced at ₹3,000, effective from 15th August 2025. Valid for one year from the date of activation or up to 200 trips—whichever comes…
— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025