Shivathmika Rajashekar..సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనే విషయాన్ని నేచురల్ స్టార్ నాని (Nani)ని మొదలుకొని.. యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వరకూ ఇలా చాలామంది ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నెపోటిజం వల్ల చాలా వరకు అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు తమ బాధను వెళ్ళబుచ్చుకున్నారు. అటు నెపోకిడ్స్ విషయానికి వస్తే.. మహేష్ బాబు (Maheshbabu) ను మొదలుకొని అల్లు అర్జున్(Allu Arjun), ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan), ప్రభాస్ (Prabhas)ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న చాలామంది ఇలా సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వారే కావడం గమనార్హం.
నెపోటిజంపై రాజశేఖర్ కూతురు ఊహించని కామెంట్స్..
అయితే ఈ నెపోటిజం ఉంది అనే విషయాన్ని చాలామంది బల్ల గుద్దినట్టు చెబుతున్నా.. కొంతమంది నెపోకిడ్స్ మాత్రం దీనిని ఖండిస్తున్నారు. అవకాశాలు అనేవి టాలెంట్ ఉంటేనే వస్తాయి అని, నెపోటిజం అనేది ఇండస్ట్రీలో వర్కౌట్ కాదని చెబుతున్నారు. కానీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అని, ఆ నెపోటిజం కారణంగానే తాను కూడా హీరోయిన్గా అవతారం ఎత్తాను అంటూ నిజాలు ఒప్పేసుకుంది యాంగ్రీ మ్యాన్, స్టార్ హీరో రాజశేఖర్ (Rajasekhar) కూతురు శివాత్మిక రాజశేఖర్ ( Shivathmika Rajasekhar).
ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది – శివాత్మిక రాజశేఖర్
తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. నెపోటిజంపై అలాగే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం పై పలు కామెంట్లు చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా నెపోటిజంపై శివాత్మిక మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మా అమ్మ నాన్న ఇండస్ట్రీకి చెందిన వారే కదా.. ఇక ఒక సినిమాలో చేస్తే చాలు.. ఆ తర్వాత వాటంతాటవే ఆఫర్స్ వస్తాయి అనుకున్నాను. ఎందుకంటే నా మొదటి సినిమా ఎలాగో నెపోటిజం కారణంగానే అవకాశం లభించింది. పైగా హీరో రాజశేఖర్ కూతురు కదా.. బాగా నటిస్తుంది.. మళ్ళీ సినిమాల్లో అవకాశం ఇద్దామని అనుకుంటారు. అనుకున్నాను. కానీ ఆ నెపోటిజం పనికి వచ్చేది కేవలం ఒక్క సినిమాకి మాత్రమే. అది కూడా మొదటి సినిమాకే నెపోటిజం పనికి వస్తుంది. అయితే ఇక్కడ అవకాశం వచ్చింది అంటే నెపోటిజం ఉన్నట్టే కదా. ఆ తర్వాత మన కష్టం పైనే మిగతా అవకాశాలు అనేవి ఆధారపడి ఉంటాయి” అంటూ ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనే విషయాన్ని బహిరంగంగా తెలిపింది శివాత్మిక.
నెపోకిడ్స్ కి మాత్రమే ఆ అవకాశం..
“అంతేకాదు ఇక్కడ నెపోకిడ్స్ కి ఉండే మరో ఉపయోగం ఏమిటంటే.. ఇండస్ట్రీలో ఎవరో తెలియని అమ్మాయికి డైరెక్ట్ గా డైరెక్టర్లను వెళ్లి కలిసే అవకాశం ఉండదు. కానీ నాకు ఆ అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను రాజశేఖర్ కూతురిని కాబట్టి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ డైరెక్టర్ నైనా కలిసే అవకాశం నాకు ఉంటుంది. అయితే అంతటితో నా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఇక సినిమాల్లో అవకాశం అనేది నా టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో నాకు అర్థమైంది ఏమంటే.. నువ్వు ఒక సినిమాలో బెస్ట్ ఇచ్చావంటే ఆ పాత్ర పట్టుకొని ఇంకో సినిమాలో నీకు అవకాశం వస్తుంది. అంతేతప్ప ఫలానా వారి కూతురివి అన్నంత మాత్రాన నీకు ప్రతి సినిమాలో అవకాశం రాదు” అంటూ తెలిపింది శివాత్మిక.
ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు రావాలంటే..
అలాగే ఇండస్ట్రీలో తనకు వచ్చే వరుస అవకాశాలపై కూడా స్పందిస్తూ.. ” ‘ దొరసాని’ సినిమాలో నా నటన చూడడం వల్లే నాకు ‘ రంగ మార్తాండ’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నా పాత్ర ఇంకో సినిమాకు అవకాశం వచ్చేలా చేసింది. అలా ఒక సినిమా నుండి ఇంకో సినిమాకు నాకు అవకాశాలు వచ్చాయి. మన జీవితానికి మనమే హీరో. ప్రస్తుతం మా అమ్మ నటన ఆపేసింది..మా నాన్న అప్పుడప్పుడు నటిస్తున్నారు. అయినా సరే ఇవేవీ మనకు వర్క్ అవుట్ అవ్వవు”.
also read: Sister Midnight OTT: ఓటీటీలోకి రాధిక బోల్డ్ మూవీ.. హెడ్ ఫోన్స్ తో మాత్రమే చూడండి!
ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మా అమ్మ నాన్న ఒకటే చెప్పారు..
“ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న ఒకటే చెప్పారు. సక్సెస్ ఒకటే కాదు ఫెయిల్యూర్ ని కూడా తీసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎంత పుష్ చేసుకుంటే అంత సక్సెస్ మీకు లభిస్తుంది. ఈ రంగం కాకుంటే ఇంకో రంగం అన్నట్టుగానే వ్యవహరించాలి. అంతే తప్ప ఫ్లాప్స్ పడినప్పుడు, అవకాశాలు లేనప్పుడు, డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు అని మాకు నేర్పించారు” అంటూ శివాత్మిక చెప్పు కొచ్చింది.