BigTV English

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ స్పెషల్ వీడియో.. ఇది చూశారంటే ఆగలేరు!

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ స్పెషల్ వీడియో.. ఇది చూశారంటే ఆగలేరు!

Vande Bharat Sleeper: ఒకప్పుడు రాత్రిపూట ట్రైన్ ప్రయాణం అంటే.. ఇబ్బందులే ఎక్కువ. భద్రతా సమస్యలే కాకుండా, శబ్దం, జోలపాటు, అసౌకర్యాలు, రూమ్ లేదనిపించే బెడ్లు.. ఇవన్నీ సహజమే. కానీ ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయిందనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అది చూస్తే.. మన రైలు ప్రయాణం అద్భుతంగా మారిపోతుందనిపిస్తుంది. కొత్తగా కనిపిస్తున్న ఆ దృశ్యం ఏంటో తెలుసుకుంటే మీరూ ఆశ్చర్యపోతారు!


ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చూపిన దృశ్యం చూస్తే.. ఇది ట్రైన్ లోపలిదా? లేక ఓ హోటల్ కారిడార్ లో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. తాజాగా నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ లోపలి ఇంటీరియర్, బెడ్లు, సౌకర్యాలన్నీ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రైన్ లో ప్రయాణించడం కన్నా హై-ఎండ్ హోటల్‌లో ఒకరాత్రి గడిపిన ఫీలింగ్ వచ్చేస్తుందంతే! వైరల్ వీడియోతో పాటు వచ్చిన విజువల్స్ చూస్తే మన దేశ రైల్వే ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అర్థమవుతుంది.

ఇప్పటికే చెయిర్‌కార్ వేరియంట్ లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నా, ఇవి సాధారణంగా రోజువేళ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇప్పుడు.. రాత్రిపూట ప్రయాణించే వారికి సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది. వచ్చే నెల నుంచి వందే భారత్ స్లీపర్ ట్రెయిన్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో సౌకర్యాల సంగతి చెప్పనక్కర్లేదు. AC 1st క్లాస్, AC 2nd, AC 3rd కోచ్‌లు, స్టైలిష్ బెడ్లు, స్మార్ట్ లైటింగ్, సెల్ఫ్-కంట్రోల్ సీటింగ్ వ్యవస్థ, నిశబ్ద ప్రయాణానికి ప్రత్యేక డిజైన్ ఇలా చాలా ఉంది.


ఈ స్లీపర్ ట్రెయిన్ల మొదటి దశలో దేశవ్యాప్తంగా 30 ట్రెయిన్లు నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. మొదటగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖ వంటివి ప్రధాన నగరాల మధ్య ఈ ట్రెయిన్లు ప్రయాణిస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ట్రెయిన్లలో తీసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ట్రెయిన్లు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కింద రూపుదిద్దుకుంటున్నాయి. చెన్నైలోని ICF ఫ్యాక్టరీలో కోచ్‌ల తయారీ శరవేగంగా జరుగుతోంది. గంటకు 160 కి.మీ వేగంతో నడిచే ఈ ట్రెయిన్లలో ప్రయాణం ఓ మైలు రాయిగా మారనుంది. టెక్నాలజీ, డిజైన్, భద్రత, శుభ్రత, సౌకర్యం అన్నింటికీ ఇది సరికొత్త ప్రమాణం పెట్టబోతోంది.

Also Read: Bullet Train Project: రెడీ అయింది భారీ వంతెన.. ఇక బుల్లెట్ ట్రైన్ పరుగుకు మార్గం సిద్ధం!

వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఇది ట్రైన్ కాదు బాస్, ఓ 5 స్టార్ హోటల్ లా ఉందే!, ఇదేనా మన రైలు భవిష్యత్? ఇదే అయితే ఇక విమానాలు ఎందుకు?, ఈ సీట్స్ చూసాక IRCTC లో టికెట్ బుక్ చేయడం కోసం మరీ ముందుగానే సిద్ధం కావాలనే కామెంట్లు ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇది కేవలం ట్రైన్ కాదు. ఇది ట్రావెల్ అనుభవాన్ని తిరగరాసే ప్రయత్నం. మనం చూసే వందే భారత్ రైలు రాత్రిపూట కూడా అంతే కంఫర్ట్ తో, అంతే హై క్లాస్ సౌకర్యాలతో అందుబాటులోకి రావడం అంటే భారతీయ రైల్వేలో ఒక నూతన శకం ప్రారంభమైనట్టే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో దృష్టిలో ఉంచుకుంటే, రైలు ప్రయాణం అంటే కేవలం గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు… అది ఒక ఎక్సపీరియన్స్ అయ్యే రోజులు దగ్గరపడుతున్నాయి.

మీరు కూడా ఆ వీడియో చూసినవారైతే, ఇప్పుడు నుంచే రెడీ అయిపోండి. వచ్చే నెల నుంచి మొదలయ్యే ఈ వందే భారత్ స్లీపర్ ట్రెయిన్లు.. మన దేశ రైలు చరిత్రలో కొత్త పుటలు సృష్టించబోతున్నాయి. ఆ వీడియో మీరు చూసేయండి.. ఒక్కసారైనా ఈ ట్రైన్ లో ప్రయాణించండి.

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×