E-Paper
Advertisement

హైస్కూల్ కుర్రాడి జాక్‌పాట్.. రూ. 2.30 కోట్ల బీఎండబ్ల్యూ కారు, బహుమతి వెనుక లాజిక్ ఇదే

హైస్కూల్ కుర్రాడి జాక్‌పాట్..  రూ. 2.30 కోట్ల బీఎండబ్ల్యూ కారు, బహుమతి వెనుక లాజిక్ ఇదే
Advertisement

West Bengal: పిల్లలు బాగా చదివితే బహుమతులు ఇస్తుంటారు తల్లిదండ్రులు. దీంతో బాగా చదవాలన్న కోరిక టీనేజర్లకు వస్తుంది. కానీ అది వ్యవసం మారితే ఇబ్బందులు తప్పవు. తొమ్మిదో తరగతిలో మంచి మార్కులు వచ్చినందుకు కొడుకుకి ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు తండ్రి. ఆ కారుని చూసి కొడుకు మురిసి పోతున్నాడు. దీనిపై సోషల్ మీడియా చర్చ మొదలైంది.

బెంగాల్ హైస్కూల్ కుర్రాడికి జాక్‌పాట్

బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లాకు చెందిన మహమ్మద్ తల్హా విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాయి. ఈ రీసెంట్‌గా అర్థ సంవత్సర పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాడు. తన 15 ఏళ్ల కొడుక్కి ఏకంగా రూ.2.30 కోట్ల విలువైన లగ్జరీ బీఎండబ్ల్యూ ఎం4 కారుని బహుమతిగా ఇచ్చాడు తండ్రి షంసుద్దీన్ మిడ్యా. ఈయన పెద్ద వ్యాపారివేత్త కూడా. టీనేజర్ గిఫ్ట్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Advertisement

చదువులో మంచి ప్రతిభ చూపినందుకు బహుమతి ఇవ్వడం సాధారణమేనని, కాకపోతే ఖరీదైన బహుమతి ఇవ్వడం గొప్ప విషయంగా చెబుతున్నారు. ఇంత ఖరీదైన కారు ఇవ్వడంపై చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచి మార్కులు వస్తే ఊహించని గిఫ్ట్ ఇస్తానని తండ్రి ముందుగానే చెప్పాడు, అలాగే చేశాడు. కొడుకు తల్హాకు బీఎండబ్ల్యూ ఎం4 కారు అంటే చెప్పలేనంత ఇష్టం. చాన్నాళ్లుగా ఆ కారు కావాలని కోరుతున్నాడు.

ఏకంగా రూ. 2.30 కోట్ల బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్

పరీక్షల్లో మంచి ఫలితాలు రావడంతో కొడుకు కోరిక నెరవేర్చాడు. ఈ కారు కొనుగోలు చేసేందుకు షంసుద్దీన్ ముంబైకి వెళ్లి అక్కడ కొనుగోలు చేసి ప్రత్యేక కంటైనర్‌లో సొంత ఊరికి తరలించాడని సమాచారం.  దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  హైస్కూల్ పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఏకంగా కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు ఇవ్వడం చర్చకు దారి తీసింది. కొంత మంది తండ్రి తన కొడుకుపై చూపించిన ప్రేమగా చెబుతున్నారు.

Advertisement

ALSO READ: ఈమె తల్లి కాదు కామాంధురాలు.. ప్రియుడి మోజులో పడి, కొడుకుని చంపేంచి ఆ తర్వాత

మరికొందరు మైనర్‌కు అంత ఖరీదైన కారు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. తండ్రి కారు గిఫ్ట్ ఇచ్చినా మేజర్ అయ్యేవరకు నడిపే ఛాన్స్ ఉండదని అంటున్నారు. ఎవరైనా కారు నడిపితే హాయిగా కూర్చుని ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. మరో నాలుగేళ్ల వరకు తల్హా కారు నడిపే ఛాన్స్ ఉండదని అంటున్నారు. ఒకవేళ డ్రైవింగ్ వచ్చని రోడ్ల మీదకు వెళ్తే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కారు గిఫ్ట్ వల్ల యువకుడికి చాలా ప్రచారం వచ్చింది. ఒకవేళ కారు నిడిపితే పోలీసులు చిక్కడం ఖాయం.

ఆ లెక్కన కారుని యువకుడి ఫాదర్ నడిపే అవకాశం ఉందని అంటున్నారు. చిన్నప్పుడే ఇలాంటి ఖరీదైన గిఫ్ట్‌లకు టీనేజర్ అలవాటు పడితే, మిగతా ఎగ్జామ్స్‌లో ఆ మజా ఉండదని అంటున్నారు. ఇలాంటి ఒక్కోసారి అనర్థాలకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు.

 

 

 

Related News

ఈమె తల్లి కాదు కామాంధురాలు.. ప్రియుడి మోజులో పడి, కొడుకుని చంపేంచి ఆ తర్వాత

ఢిల్లీ వాయు కాలుష్యం 3036.. లండన్ 100 కంటే తక్కువ.. అయినా హై అలర్ట్ జారీ

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం పై.. బీజేపీ సీనియర్ నేతలు ఫైర్!

హోసూర్ ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం.. ఒకరిని కాపాడబోయి ముగ్గురు మృతి.. అసలేం జరిగింది?

కాళ్ల పారాణి ఆరకముందే.. పెళ్లైన నాలుగు రోజులకే, వధువు ఏం చేసిందంటే..

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్య.. ప్రియురాలు హంతకురాలు, పదునైన ఆయుధంతో పలుమార్లు

యూపీలో తీవ్ర విషాదం.. రీల్స్ చేసే ఇద్దరు మైనర్ బాలికలు ఒకే చెట్టుకు ఉరి! అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×