Electric Scooters Under Rs 50,000: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ దూరాలకు ప్రయాణించేవారు, రోజువారీ అవసరాల కోసం స్కూటర్ కొనాలనుకునేవారు తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ వాహనాల కోసం చూస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో రూ.50,000 లోపే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో కొన్ని మోడళ్లు గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ప్రయాణిస్తాయి. నిబంధనలకు అనుగుణంగా ఉండే ఈ లో-స్పీడ్ స్కూటర్లకు సాధారణంగా RTO రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండదు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 50 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ లో అందుబాటులో ఉన్న నాలుగు స్కూటర్ల గురించి తెలుసుకుందాం..
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి కొమాకి XR1, X-One మోడళ్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. వీటి ధర సుమారు రూ.35,499 నుంచి రూ.39,102 వరకు ఉంటుంది. ఈ స్కూటర్లు గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. సుమారు మూడు గంటల్లో ఛార్జింగ్ పూర్తవుతుందని, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కొంచెం ఎక్కువ వేగం కోరుకునేవారు అల్ట్రాబైక్స్ నియోను తీసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.46,900. ఇందులో 48V గ్రాఫీన్ బ్యాటరీ, 1000W BLDC మోటార్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. USB ఛార్జింగ్, రిమోట్ లాక్, డిస్క్ బ్రేకులు లాంటి సదుపాయాలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే, ఈ మోడల్ వేగం గంటకు 45–50 కిలోమీటర్ల వరకు ఉండటంతో, ఇది RTO రిజిస్ట్రేషన్ అవసరం లేని 25 కి.మీ లోపు స్కూటర్ల కేటగిరీలోకి రాదు.
బడ్జెట్‌లో మరో మంచి ఆప్షన్ జెలియో ఈవా ఎకో LX. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.47,783గా ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 65 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సిటీల్లో చిన్న చిన్న ప్రయాణాలకు అనువైన డిజైన్‌తో పాటు బ్యాటరీ ఆప్షన్లను బట్టి వారంటీ సదుపాయం కూడా ఉంది.
రూ.50 వేల బడ్జెట్‌లో మరో ఆప్షన్ టున్వాల్ లిథినో ప్రో. దీని ధర సుమారు రూ.49,993. గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 70 నుంచి 75 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. తక్కువ బరువు కలిగిన నిర్మాణం, రోజువారీ ప్రయాణాలకు అనువైన డిజైన్ దీని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.
Read Also: టీవీఎస్ ఎన్‌టార్క్ 150కు కొత్త లుక్.. స్పెక్ట్రల్ గ్రీన్ కలర్ భలే ఉంది భయ్యా!