E-Paper
Advertisement

బ్రేకప్ కోసం హైకింగ్.. దెయ్యాల కోసం వేట.. 2027లో రాబోతున్న 6 వింత ట్రావెల్ ట్రెండ్స్!

బ్రేకప్ కోసం హైకింగ్.. దెయ్యాల కోసం వేట.. 2027లో రాబోతున్న 6 వింత ట్రావెల్ ట్రెండ్స్!
Advertisement

2027 Travel Trends: సెలవులు వస్తే బీచ్‌లకు వెళ్లడం, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం, అందమైన హోటళ్లలో బస చేయడం చాలామందికి అలవాటు. అయితే, 2027లో ప్రయాణాల తీరు మారబోతోంది. సాధారణ విహారయాత్రలకు భిన్నంగా కొత్త అనుభవాలను పొందేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. దెయ్యాల వేట, పర్వతాల్లో హైకింగ్, అపరిచితులతో కలిసి హాబీ కార్యకలాపాల్లో పాల్గొనడం లాంటి ఆసక్తికరమైన ట్రెండ్‌లు తెరపైకి వస్తున్నాయి. 2027లో పాపులర్ కానున్న 6 ట్రావెల్ ట్రెండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.దెయ్యాల కోసం స్పెషల్ టూర్లు

దెయ్యాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న ప్రాంతాలను సందర్శించడం, పాత భవనాల్లో స్టే చేయడం లాంటి ఎక్స్ పీరియెన్స్ పై ఆసక్తి పెరుగుతోంది. 65 శాతం మంది ప్రయాణికులు హారర్, గోతిక్ వెదర్, అతీంద్రియ సంఘటనలకు సంబంధించిన అనుభవాలను ఇష్టపడుతున్నారు. దీంతో ఘోస్ట్ టూర్స్, రాత్రిపూట పారానార్మల్ పరిశోధనలు కొత్త ట్రావెల్ ట్రెండ్‌గా మారవచ్చు.

2.సంబంధాల కోసం బ్రేకప్ హైకింగ్!

Advertisement

జంటల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి హైకింగ్‌ను ఒక మార్గంగా ఎంచుకోవడం మరో కొత్త ట్రెండ్. దీనినే ‘ట్రైల్‌ సైడ్ థెరపీ’ అంటున్నారు. మొబైల్ ఫోన్లు, రోజువారీ పనులకు దూరంగా ప్రకృతి మధ్య నడుస్తూ మనసులోని విషయాలను పంచుకోవడం ద్వారా భాగస్వాములు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోవచ్చు.

3.గోతిక్ హోటళ్లలో బస!

సాధారణ హోటళ్లకు భిన్నంగా పాతకాలపు భవనాలు, ప్రత్యేకమైన అలంకరణలు, మసక వెలుతురు, చారిత్రక వాతావరణం ఉండే హోటళ్లపై ఆసక్తి పెరుగుతోంది. వీటినే గోతిక్ గెట్‌ అవేలు అంటున్నారు. ఎక్స్‌ పీడియా గ్రూప్ నివేదిక కూడా ఈ ట్రెండ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది.

4.అపరిచితులతో కలిసి హాబీ ట్రిప్స్!

Advertisement

ఫోటోగ్రఫీ, బోర్డ్ గేమ్స్, పెయింటింగ్, స్టార్స్ ను చూడటం లాంటి ఒకే రకమైన ఇష్టాలు ఉన్న వ్యక్తులతో కలిసి ప్రయాణించడం మరో ఆసక్తికరమైన ట్రెండ్. సుమారు 68 శాతం మంది ప్రయాణికులు తమ హాబీలకు సంబంధించిన ట్రిప్స్‌ పై ఆసక్తి చూపిస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రయాణాలు కొత్త స్నేహాలకు కూడా అవకాశం కల్పిస్తాయి.

5.నిద్ర కోసం స్పెషల్ ట్రిప్స్!

సెలవుల్లో తిరగడం కంటే ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకునేవారి కోసం స్లీప్ టూరిజం పాపులర్ అవుతోంది. ప్రత్యేకమైన బెడ్‌లు, ప్రశాంతమైన వాతావరణం, నిద్రకు అనుకూలమైన వెల్‌ నెస్ కార్యక్రమాలు అందించే హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది.

6.మళ్లీ చిన్నపిల్లల్లా మారిపోయే సెలవులు!

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఆటలు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, సరదా కార్యక్రమాలతో సెలవులు గడపాలని పెద్దలు కూడా కోరుకుంటున్నారు. ఎక్స్‌ పీడియా దీనిని ‘అన్-అడల్టింగ్’ ట్రెండ్‌గా పిలుస్తోంది. బాధ్యతలు, పని ఒత్తిడిని పక్కనపెట్టి మనస్ఫూర్తిగా ఆనందించడమే దీని ప్రధాన ఉద్దేశం.

మారుతున్న ట్రావెల్ డెఫినేషన్!

2027లో ప్రయాణం అంటే కొత్త ప్రాంతాలను చూడటమే కాదు.. మనసుకు నచ్చిన ఎక్స్ పీరియెన్స్ పొందడం కూడా. కొందరికి దెయ్యాల వేట ఆసక్తికరంగా అనిపిస్తే, మరికొందరికి ప్రశాంతమైన నిద్రే బెస్ట్ హాలీడే కావచ్చు. మొత్తంగా చూస్తే, రాబోయే రోజుల్లో ప్రయాణాలు క్రేజీగా మారనున్నాయి.

Read Also: దేశంలోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్.. బీచ్‌లు, జలపాతాలు, పురాతన కోటల మధ్య అద్భుత ప్రయాణం!

Tags

Related News

దేశంలోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్.. బీచ్‌లు, జలపాతాలు, పురాతన కోటల మధ్య అద్భుత ప్రయాణం!

దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ కింద సమాధి.. దీపావళి అక్కడే ఎందుకు జరుపుకున్నారో తెలుసా?

వందే భారత్ స్లీపర్ రైళ్లలో తత్కాల్ టికెట్లు బంద్.. రైల్వే షాకింగ్ డెసిషన్!

ప్లాట్‌ఫామ్ టికెట్‌తో రైలులో ప్రయాణించవచ్చా? ఫైన్ లేకుండా రైల్వే రూల్స్ ఇవే

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1,286 కిలోల మాంసం.. రైల్వే స్టేషన్‌లో ఏం జరిగింది?

జటాయువు ఎక్కడ ప్రాణాలు విడిచాడు? రామాయణంలోని 6 అసలైన ప్రదేశాలు ఎక్కడున్నాయంటే!

చలికాలంలో పక్షుల పండుగ.. దేశంలోని ఈ 10 ప్రదేశాలు మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×